Sri Bharatha Temple | Irinjalakuda | Kerala


శ్రీ భరతుని ఆలయం , ఇరింజలకుడ :

కేరళలోని ప్రసిద్ద అలయాలో ఈ ఆలయం ఒకటి.  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం కేరళ రాష్ట్రంలోని , ఇరింజలకుడ గ్రామం లో ఉన్నది. ఇటువంటి ఆలయం భారతదేశం మొత్తంలో  ఉన్న ఏకైక ఆలయం. ఈ ఆలయంలో ఏనుగుల పోటీ చాలా బాగా జరుగుతుంది. ఈ ఆలయానికి కోడల్ మాణిక్యం అనే పేరు కూడా ఉన్నది.

ఆలయ చరిత్ర :

ఈ ప్రాంతానికి నలాంబలం అనే పేరు ఉన్నది. అనగా   మలయాళంలో నలు అంటే "నాలుగు", అంబలం అంటే "ఆలయం" అని అర్ధం. రాముడు మరియు అతని రామాయణ సోదరుల ఆలయాలు.  ఇవి కేరళలో సుమారు ఐదు సెట్ల నలంబలములు ఉన్నాయి, వాటిలో అత్యంత ప్రసిద్ధమైనవి త్రిశూర్ మరియు ఎర్నాకుళం జిల్లాలలో ఉన్న నాలుగు ఆలయాలు, అవి త్రిప్రయార్ శ్రీ రామ ఆలయం, కూడల్మానిక్యం భరత ఆలయం, మూజిక్కులం లక్ష్మణ ఆలయం మరియు పాయమ్మల్ ఆలయం.


ఈ పురాతన ఆలయం శ్రీ రాముడి సోదరుడు భరతుడికి అంకితం చేయబడింది. భరతుడిని దేవతగా భారతదేశంలో ఉన్న ఏకైక ఆలయం ఇది. పదమూడు కాపరిసన్ ఏనుగుల పోటీతో రంగురంగుల పదకొండు రోజుల వార్షిక ఉత్సవం ఏప్రిల్ / మే నెలల్లో జరుగుతుంది.

కూడల్‌మణికం ఆలయంలో మరో 6 అడుగుల ఎత్తైన భగవంతుడి విగ్రహం ఉంది, ఇది భయంకరమైన రూపంలో, తూర్పు ముఖంగా, త్రిప్రయార్‌లో చూసినట్లుగా ఉన్న భంగిమలో ఉంది. ఒకే విగ్రహం ఉన్న అరుదైన దేవాలయాలలో ఇది ఒకటి.


ఆలయ దర్శన సమయం :

ఉదయం      : 4.00-12.00
సాయంత్రం : 5.00-8.00

వసతి వివరాలు  :

ఆలయం యొక్క ఒకే ఒక్క గెస్ట్ హౌస్ కలదు. మరియు  ఆలయం నుంచి  4 కి.మీ దూరంలో ప్రైవేట్ హోటల్ లు కలవు.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

త్రిసూర్ నుంచి ఇరింజలకూడ గ్రామానికి రోడ్డు మార్గం కలదు. త్రిసూర్ కేవలం 22  కి. మీ దూరంలో ఆలయం కలదు.

రైలు మార్గం :

ఈ ఆలయానికి దగ్గర లోనే త్రిసూర్ రైల్వే స్టేషన్ కలదు. ఈ స్టేషన్ నుంచి ఆలయానికి 12 కి. మీ దూరం కలదు.

విమానా మార్గం :

కొచ్చిన్ విమానశ్రయం లో దిగి కార్ లేదా బస్ లో ఈ ఆలయానికి చేరుకోవాలి. ఈ విమానాశ్రయం నుంచి ఆలయానికి 46 కి. మీ దూరం ఉన్నది.

ఆలయ చిరునామా  :

శ్రీ భరతుని ఆలయం ,
ఇరింజలకుడ (గ్రా),
త్రిసూర్ జిల్లా ,
పిన్ కోడ్ : 680121
కేరళ.

Keywords : Sri Bharatha Temple , Irinjalakuda , Famous Temples In Kerala , Lord Bharatha , Hindu Temples Guide 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS