శ్రీ సీత లవ కుశ ఆలయం , కాలపెట్ట , కేరళ :
కేరళలోని పురాతన అలయాలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం వయనాడ్ జిల్లాలోని పుల్పల్లి గ్రామంలో ఉన్నది. కేరళ ఆలయాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది, సాధారణంగా శ్రీ రామ ఆలయం అనగానే శ్రీ రాముడు సీత , లక్ష్మణ , ఆంజనేయ స్వామి మాత్రమే దర్శించడానికి వీలుగా ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ రాముడు మరియు సీతాదేవితో పాటుగా పిల్లలు లవ మరియు కుశలను దేవతలుగా ఏర్పాటు చేసిన ఏకైక ఆలయం ఇది.
ఆలయ చరిత్ర :
పుల్పల్లి ఆలయం యొక్క ప్రాధమిక దేవత సీతాదేవి. వాల్మీకి ఆశ్రమంలో బహిష్కరణ సమయంలో సీత ఇక్కడే ఉన్నట్లు నమ్ముతారు. ఇక్కడి సీతాదేవి విగ్రహాన్ని -జదయతా అమ్మ- అంటారు. ఈ ప్రదేశంలో లవ మరియు కుశ పెరిగారు అని నమ్ముతారు. ఈ స్థలం యొక్క అసలు పేరు సిసుమల మరియు తరువాత సశిమలగా మార్చబడింది. సీత యొక్క పురాణం, మరియు ఆమె పిల్లలు లవ మరియు కుష ఈ ఆలయానికి దగ్గరి సంబంధం కలిగి ఉన్నాది. పుల్పల్లి అనే పేరు కూడా గడ్డి మంచానికి (ధర్భా) అనుసంధానించబడిందని నమ్ముతారు, దానిపై శ్రీ రాముని కుమారులు చిన్నతనంలో ఆడినట్లు తెలుస్తుంది.తరువాత కాలంలో ఈ పరిపాలిపించే రాజు పజ్ హస్సీ లవ మరియు కుశ కథలతో సంబంధం ఉన్నందున చాలా మంది భక్తులు సశిమాలను పవిత్ర స్థలంగా భావించి అందరూ దర్శించే విధంగా పుణ్యక్షేత్రం గా మారుస్తాడు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 5.00-12.00సాయంత్రం : 5.30-8.00
వసతి వివరాలు :
ఆలయం నుంచి 4 కి.మీ దూరంలో ప్రైవేట్ హోటల్ లు కలవు.ఆలయానికి చేరుకునే విధానం :
రోడ్డు మార్గం :
కల్పేట నుండి 32 కిలోమీటర్ల దూరంలో, సుల్తాన్ బాథేరి నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఆలయం కలదు.రైలు మార్గం :
ఈ ఆలయానికి దగ్గర లోనే త్రిసూర్ రైల్వే స్టేషన్ కలదు. ఈ స్టేషన్ నుంచి ఆలయానికి 12 కి. మీ దూరం కలదు.విమానా మార్గం :
కొచ్చిన్ విమానశ్రయం లో దిగి కార్ లేదా బస్ లో ఈ ఆలయానికి చేరుకోవాలి.ఆలయ చిరునామా :
శ్రీ సీత లవ కుశ ఆలయం ,కాలపెట్ట (గ్రా),
పూల్ పల్లి
పిన్ కోడ్ : 673579
కేరళ.
Keywords : Sri Lava Kusa Temple , Kalpetta , Famous Temples In Kerala , Lord sri rama , Hindu Temples Guide