శ్రీ దిల్వారా ఆలయం అబూ నగరం | రాజస్థాన్ | Sri Dilwara Temple Information | Abu Nagaram Rajasthan | Hindu Temples Guide
శ్రీ దిల్వారా ఆలయం, అబూ నగరం, రాజస్థాన్ :
ఈ ఆలయం చాలా ప్రసిద్ది చెందిన ఆలయం. ఈ దేవాలయం దిల్వారా ఆలయం. దేశంలోనే అత్యుత్తమ మరియు నిర్మాణపరంగా ప్రసిద్ధి చెందిన జైన దేవాలయాలలో ఒకటి. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో సందర్శకులు మరియు యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. పాలరాతి పై అద్భుతమైన శిల్పాలు, హస్తకళ నైపుణ్యం ఈ ఆలయంలోని ప్రతి అంశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారం నిజంగా అద్భుతమైనది. ఈ ఆలయని 1147-49లో విమల్ షా యొక్క వారసుడు పృథ్వీపాల్ చేత నిర్మించబడింది. ఈ ఆలయం మొత్తం పూర్తి కావడానికి 14 సంవత్సరాల సమయం పట్టింది. అబూ నగరం నుంచి ఈ ఆలయానికి 2 1⁄2 కిలోమీటర్ల దూరంలో కలదు.ఆలయ చరిత్ర :
ఈ ఆలయం అటవీప్రాంతలో కొండల మధ్యలో ఉంది.ఈ ఆలయంలో మొత్తం ఐదు దేవాలయాలు ఉన్నాయి, ఐదు దేవాలయాలు ఒకే ఎత్తైన గోడల సమ్మేళనం లోపల ఉన్నాయి. ఈ బృందానికి వారు ఉన్న దిల్వారా అనే పేరు పెట్టారు. ఈ ఆలయ సముదాయంలో ఐదు జైన తీర్థంలు ఐదు విభాగాలు ఉన్నాయి. ఇందులో మహావీర్ స్వామి, శ్రీ ఆదినాథ్, శ్రీ పార్షవ్నాథ్ , శ్రీ రిషబ్ మరియు శ్రీ నేమినాథ్ లకు అంకితం చేయబడ్డాయి. శ్రీ ఆదినాథ్ స్వామి ఆలయం వీటిలో పురాతన ఆలయంగా తెలుస్తుంది. ఈ ఆలయాలు 11 నుండి 13 వ శతాబ్దాల మధ్య నిర్మించబడ్డాయి. పాలరాయి స్తంభాలు మరియు పైకప్పులపై క్లిష్టమైన రాతి శిల్పం నిజంగా విస్మయం కలిగిస్తుంది. ఈ ఆలయం హిందూ మరియు జైన పురాణాల నుండి చాలా చిత్రాలను ప్రదర్శిస్తుంది. పైకప్పులు మరియు స్తంభాలపై చెక్కబడిన తామర రేకులు మరియు పువ్వులు ఈ ఆలయానికి విలక్షణమైన విధంగా దర్శనమిస్తాయి.వసతి సౌకర్యాలు :
ఆలయానికి దగ్గరలోనే ప్రైవేట్ హోటల్ లు కలవు.ఆలయ దర్శన సమయం :
ఉదయం : 11.00-5.00ఆలయానికి చేరుకునే విధానం :
రోడ్డు మార్గం :
జోధ్పూర్ మరియు ఉదయపూర్ నుంచి అధిక బస్ లు కలవు. మరియు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల నుండి అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.రైలు మార్గం :
ఆలయానికి 30 కిలోమీటర్ల దూరంలో అబూ రోడ్ రైల్వే స్టేషన్ ఉంది. అక్కడి నుంచి బస్ లేదా ప్రైవేట్ వాహనాలు కూడా ఆలయానికి బయలుదేరును.విమాన మార్గం :
సమీప విమానాశ్రయం మౌంట్ అబూ నుండి దాదాపు 185 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయపూర్ లో ఉంది.ఆలయ చిరునామా :
శ్రీ దిల్వారా ఆలయం,అబూ నగరం ,
రాజస్థాన్.
పిన్ కోడ్ -307501
Key Words : Sri Dilwara Temple, Abu Nagaram, Famous Temples In Rajasthan, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment