Drop Down Menus

Sri Duryodhana Temple | Malanada | Kerala


శ్రీ దుర్యోధన ఆలయం , మలనాడ , కేరళ :

ఇప్పటి వరకు రాక్షసులు దేవుతల అనుగ్రహం కొరకు వాళ్ళకి గుళ్ళు కట్టి పూజలు చేసిన సందర్భాలు చరిత్రలు కనిపించాయి. కానీ ఇది ఒక విచిత్రమైన ఆలయం. దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ఉన్న ఏకైక దుర్యోధన ఆలయం ఇది. ఈ ఆలయం కేరళ రాష్ట్రంలో కొల్లాం జిల్లాలో పోరువలి అనే చిన్న గ్రామంలో మలనాడ అనే ప్రాంతంలో  ఈ ఆలయం ఉంది. మలనాడు అనగా కొండ అని అర్ధం. ఈ కొండకి మారియొక్క పేరు కూడా ఉన్నది. పెరువీరితి మలనాడు అని కూడ ఉన్నది. ఇది అప్రసిద్ధ రాజు దుర్యోధనుడికి గుడిని నిర్మించబడిన ఆలయం.

ఆలయ చరిత్ర  :

ఈ ఆలయ చరిత్ర దాదాపుగా మన అందరికీ తెలిసిన మహాభారతం సమయంలో జూదంలో ఓడిన పాండవులందరిని  12 సం ||  అరణ్యవాసానికి, ఒక ఏడాది అజ్ఞాత వాసానికి వెళ్తారు. అప్పుడు పాండవులు తమ అరణ్య వాసం పూర్తి చేసుకుని అజ్ఞాత వాసంలో ఉన్న సమయంలో వారిని పట్టుకునేందుకు ధూర్యోధనుడు, శకుని వేయని ఎత్తులు ఉండవు. అజ్ఞాత వాసంలో ఉన్న పాండవులను కనుకుంటే  వారు మరో 12 ఏళ్లు అజ్ఞాత వాసం చేయాల్సి ఉంటుంది.


అందుకే పాండవుల జాడ కనుగొనేందుకు దుర్యోధనుడే స్వయంగా వారిని వెతుక్కుంటూ  వెల్లుతాడు. చాలా దూరం ప్రయాణించి కేరళలోని మలనాడు ప్రాంతానికి చేరుకున్న దుర్యోధనుడు అక్కడ దప్పికతో నీరసించి సేద తీరుతుంటాడు. ఆ సమయంలో దుర్యోధనుడి పరిస్థితి గమనించిన కురువ జాతికి చెందిన ఓ మహిళ తన వద్ద ఉన్న కొబ్బరి కల్లును అతడిని ఇస్తుంది. ఆ కల్లు రుచి చూసిన దుర్యోధనుడు వెంటనే దప్పిక నుంచి ఉపశమనం పొంది సాంత్వన పొందుతాడు. ఆమె చేసిన సహాయానికి కృతజ్ఞతగా తన రాజ్యంలోని ఆ ప్రాంతాన్ని అక్కడి వారికి కానుకగా ఇస్తాడు. మలనాడ కొండపై కూర్చుకుని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పరమేశ్వరున్ని ప్రార్ధిస్తాడు. ఆ విశ్వాసంతో కురువ జాతికి చెందిన పూర్వీకులు మలనాడ కొండపై దుర్యోధనుడికి ఆలయం కట్టించినట్లు కధనం.

ఇప్పటికీ ధూర్యోధనుడు కొరకు వెదురు కట్టెలతో 70-80 అడుగుల పల్లకి ని నిర్మించి దాన్నిని చక్కగా అలంకరణచేసి ఊరేరిగింపు గా కొండపై ఉన్న ఆలయం వరకు తీసుకొని వెల్లుతారు. కేరళ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఆలయ నిర్మాణం చేశారు. ఈ గుడిలో దుర్యోధనుడితో పాటు అతడి భార్య భానుమతి, తల్లి గాంధారీ, గురువు ద్రోణుడు, మిత్రుడు కర్ణుడులను కూడా పూజిస్తారు.


ఈ ఆలయంలో మారియొక్క విశేషం ఏమిటనగా ఉత్సవం రోజున మాత్రం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు మలనాడకు చేరుకుంటారు. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన బ్రాందీని తమ వెంట తెచ్చి దుర్యోధనుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. దుర్యోధనుడు ఇక్కడి కల్లు రుచికి ఆకర్షితుడైన కారణంగా మద్యాన్నే నైవేద్యంగా పెడుతుంటారు.

ఆలయ దర్శన సమయం :

ఉదయం      : 5.00-12.00
సాయంత్రం : 5.30-8.00

వసతి వివరాలు  :

ఆలయం నుంచి  12 కి.మీ దూరంలో ప్రైవేట్ హోటల్ లు కలవు.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

మొదట కేరళ చేరుకొని అక్కడి నుంచి కొల్లాంకి వెళ్ళి అక్కడి నుంచి మలనాడకు 35 కిలోమీటర్లు దూరం ఉంటుంది.

రైలు మార్గం :

ఈ ఆలయానికి దగ్గర లోనే కారుణగపాపల్లి అనే  రైల్వే స్టేషన్ కలదు. ఈ స్టేషన్ నుంచి ఆలయానికి 17 కి. మీ దూరం కలదు.

విమానా మార్గం :

త్రివేండ్రంలో విమానశ్రయం లో దిగి కార్ లేదా బస్ లో ఈ ఆలయానికి చేరుకోవాలి. త్రివేండ్రం నుంచి 94 కి. మీ దూరంలో ఈ ఆలయం ఉన్నది.

ఆలయ చిరునామా  :

శ్రీ దుర్యోధన ఆలయం ,
మలనాడ (గ్రా),
పోరువలి ,
కొల్లాం జిల్లా
పిన్ కోడ్ : 691552
కేరళ.

Keywords : Sri Duryodhana Temple , Malanada , Famous Temples In Kerala , Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments