Drop Down Menus

శ్రీ గోమఠేశ్వర ఆలయం | శ్రావణబెళగొళ | కర్ణాటక | Sri Gommateshwara Temple Information | Shravanbelagola | Karnataka | Hindu Temples Guide

శ్రీ గోమఠేశ్వర ఆలయం, శ్రావణబెళగొళ, కర్ణాటక : 

ఈ ఆలయం చాలా పురాతన జైన ఆలయం. ఇది బాహుబలి ఆలయం. అందరికీ బాహుబలి అనగానే రాజమౌళి గారి సినిమా గుర్తుకు వస్తుంది, కానీ ఆ పేరుతో కూడా ఆలయం ఉన్నది అని ఎంత మందికి తెలుసు. ఇప్పడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని హాసన్‌ జిల్లా ‘శ్రావణ బెళగొళ’లో కొలువుదీరిన ఈ బాహుబలికి చాలా ప్రాశస్త్యం ఉంది. ఈ ఆలయంలోని విగ్రహం ఏకశిలా విగ్రహం. ఇది గోమఠేశ్వర అను ఒక జైన సన్యాసి విగ్రహం. దీనిని బాహుబలి పేరుతో కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో పుష్కర సమయం అనగా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహామస్తకాభిషేకాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.

ఆలయ చరిత్ర :

పూర్వం జైన తీర్థంకరుల్లో మొదటివాడూ ఇక్ష్వాకు వంశస్థుడైన వృషభనాథుడు. ఆయన అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలన చేసేవారు.  ఆయనకు భార్యలు అయిన సునందాదేవి, యశస్వతీదేవి ఇద్దరు వల్ల భరతుడు, బాహుబలి అనే కుమారులు జన్మించారు. వీళ్ళు జన్మించిన కొద్ది సం || లలోనే కొన్ని కారణాలతో విరక్తి చెందిన తండ్రి వృషభనాథుడు రాజ్యాన్ని విభజించి, అయోధ్యకు భరతుడిని, పోదనపురానికి బాహుబలినీ రాజులుగా చేసి తాను అడవులకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత భరతుడు దండయాత్ర ప్రారంభించాడు. ఇందులో భాగంగా బాహుబలితోనూ యుద్ధం చేయాలనుకున్నాడు. ఇద్దరూ యుద్ధవిద్యా బాగా తెలిసిన వారు. అందువల్ల యుద్ధం వల్ల అపార నష్టం వాటిల్లుతుందని భయపడ్డ ఇరు పక్షాల మంత్రులూ ఆయుధాలు లేకుండా యుద్ధం చేస్తే బాగుంటుందని సూచించారు. దానికి వారిద్దరూ అంగీకరించారు. మల్లయుద్ధంలో భరతుణ్ణి పిడికిలితో గుద్ది చంపేయాలని బాహుబలి చెయ్యి పైకెత్తాడు. అప్పుడు సోదరుడి కళ్లలో మరణ భయాన్ని చూసి చలించిపోయాడు. వెంటనే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. రాజ్యం కోసం అన్నతో యుద్ధమా అని బాధపడి, తన రాజ్యాన్ని కూడా భరతుడికి అప్పగించి, సన్యాసం తీసుకుని తపస్సు చేశాడు. ఆ తర్వాత మహత్తర జ్ఞాన సంపన్నుడయ్యాడని చెబుతారు. బాహుబలి పాలించిన పోదనపురం అప్పట్లో అతి ఎత్తైన బాహుబలి విగ్రహం ఉండేదట.


గంగా రాజైన రాచమల్ల (రాచమల్ల సత్యవాక్ IV క్రీ.శ.975-986) కు మంత్రి అయిన చాముండరాయ ద్వారా క్రీ.శ.983 ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణబెలగోల పట్టణానికి దగ్గర్లోని చంద్రగిరి కొండ మీద ఈ విగ్రహం నిర్మితమైంది. కొండమీద ఉండే ఈ విగ్రహాన్ని చేరేందుకు 618 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఏకశిలకు సంబంధించిన తెల్లటి రాయి ద్వారా ఈ మహా విగ్రహం రూపొందించబడడంతో పాటు ఒక గొప్ప మత సంబంధమైన సంకేతంగాను ఈ విగ్రహం గుర్తింపును సాధించింది. జైనమతంలో మొదటగా మోక్షం పొందినది బాహుబలి అని జైనులు విశ్వసించడమే ఇందుకు కారణం. ఈ విగ్రహం ఒక తామరపుష్పంపై నిల్చి ఉంటుంది. తొడల ప్రాంతం వరకు ఈ విగ్రహానికి ఎలాంటి ఆధారం లేకపోవడంతో పాటు 60 ఫీట్ల పొడవుతో ఉంటుంది.  ఈ విగ్రయం యొక్క ముఖం మాత్రమే 6.5 ఫీట్ల పరిమాణంలో ఉంటుంది. జైన ఆచారం ప్రకారం ఈ విగ్రహం పూర్తి వివస్త్రంగా ఉంటుంది.


ఈ విగ్రహం దాదాపు 15 కి. మీ దూరం నుంచి కూడా చక్కగా కనిపిస్తుంది. కర్ణాటక శిల్పకళకు సంబంధించి ఈ విగ్రహంలపేరు సాధించడంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్దదైన ఏకశిలా విగ్రహంగానూ పేరు సంపాదించినది. గోమటేశ్వర విగ్రహం మాత్రమే కాకుండా, శ్రావణబెలగోలకు సంబంధించిన మిగిలిన ప్రదేశమంతా జైనమతానికి సంబంధించిన విగ్రహాలతోను, జైన తీర్థంకరులకు చెందిన అనేక విగ్రహాలతో నిండి ఉంటుంది. వింధ్యగిరిపై క్రీ.శ.981లో దీన్ని ప్రతిష్ఠించారు. పన్నెండేళ్లకొకసారి(12) మహామస్తకాభిషేకాన్ని జరిపే ఆనవాయితీని ప్రారంభించారు.

ఆలయ దర్శన సమయం :

ఉదయం      : 7.00-12.00
సాయంత్రం  : 3.30-7.00

ఆలయ వసతి సౌకర్యాలు :

ఈ ఆలయం కొండ కింది ప్రైవేట్ హోటల్ కు కలవు.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

ఈ ఆలయానికి దగ్గరలోనే  శ్రావణబెళగోలా అనే బస్ స్టాండ్ కలదు. బెంగుళూరు- మంగుళూరును కలిపే 48 వ జాతీయ రహదారికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది.

రైలు మార్గం :

ఈ ఆలయానికి సమీపంలో గల రైల్వే స్టేషన్ మండగ్రే అనే స్టేషన్ కలదు. ఈ స్టేషన్ నుంచి ఆలయానికి కేవలం 26కి. మీ దూరంలో కలదు.

విమాన మార్గం :

మొదట మంగళూర్ కి చేరుకొని అక్కడి నుంచి ఈ ఆలయానికి కార్ లేదా ప్రైవేట్ వాహనాలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ విమానాశ్రయం నుంచి ఆలయనికి 122కి. మీ దూరంలో కలదు.

ఆలయ చిరునామా :

శ్రీ గోమటేశ్వర  ఆలయం,
శ్రావణబెళగొళ గ్రామం,
హాసన్‌ జిల్లా
కర్ణాటక.
పిన్ కోడ్ - 573135

Key Words : Sri Gommateshwara Temple Information ,  Shravanbelagola Village, Famous Temples In Karnataka,  Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments