Drop Down Menus

Sri Mahadeva Temple | Vaikom | Kerala


శ్రీ మహాదేవ ఆలయం , వైకోం : 

వైకోం మహాదేవ దేవాలయం, కేరళ దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాల్లో వైకోమ్ మహా దేవాలయం ఒకటి.  ఈ ఆలయంలో ఉన్న శివుడిని అన్నదాన ప్రభువు అని అంటారు. ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే ఇక్కడ ఉదయం పూట దక్షిణామూర్తిగా పూజలు అందుకునే పరమశివుడు సాయంత్రం మాత్రం కిరాతక మూర్తిగా భక్తులకు దర్శనమిస్తాడు.

ఆలయ చరిత్ర :

 పూర్వం ఖరా అనే రాక్షసుడు ఉండేవాడు. అతను చిదంబరంలోని పరమేశ్వరుడు గురించి ఘోరమైన తపస్సు  చేస్తాడు. పరమేశ్వరుడు అతని భక్తికి మెచ్చి మూడు శివలింగాలు పొందుతాడు. ఆ మూడు శివలింగలను ఒకటి కుడి చేతిలో రెండు ఎడమ చేతిలో మూడవ శివలింగం నోటిలో కరుచుకొని తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అతడు వైకోము వద్దకు రాగానే ప్రయాణబడలిక వల్ల కొద్ది సేపు విశ్రమిస్తాడు.

అప్పుడు అతని నోటిలో ఉన్న శివలింగం భూమిని తాకి అక్కడే ప్రతిష్టించబడుతుంది. ఇంకా రెండు చేతులలోని ఉన్న శివలింగాలను ఎట్టుమన్నూర్ , కాడుతత్తూర్ లో ప్రతిష్టించి తన ప్రయాణన్ని కొనసాగిస్తాడు. అటు పై ఈ మూడు ప్రాంతలు ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా మారిపోయాయి.   


ఇక్కడ ఉన్న స్వామిని 11 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. కేరళ లో పెద్ద ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం ఎనిమిది ఎకరాలు లో ఉన్నది. అంతరాలయం మొత్తం అధ్బుతమైన శిల్ప కళా కట్టడం. 

వైకుంఠ అష్టమి రోజు స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తారు.


ఆలయ దర్శన సమయం :

ఉదయం  : 5.00-12.00
సాయంత్రం : 4.00-8.30

వసతి వివరాలు  :

శ్రీ కైలాస టూరిస్ట్ , తెకకెండా వైకోము Ph: 231367 (O), 215210 (R)
కాలక్కాల టూరిస్ట్ , ఉత్తర గెట్  ,  వైకోము Ph: 04829-329245, Mob: 9447122668
శ్రీ వైకతప్పన్  టూరిస్ట్ తెక్కేనడ ,  వైకోము.

ఆలయ చిరునామా :

శ్రీ శివ ఆలయం ,
త్రవన్కోర్ దేవస్థానం బోర్డు ,
వైకోము ,
కొట్టాయం-686141
కేరళ.


Keywords : Sri Mahadeva Temple , Vaikom , Kerala , Lord Shiva , Hindu Temples Guide 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments