Drop Down Menus

Sri Ayyappa Swamy | Sabarimala Temple Information | Kerala


శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం , శబరిమల , కేరళ : 

కేరళలోని ప్రసిద్ద ఆలయాలలో ఈ ఆలయం మొదటిది. కేరళ లోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతంలోని పంబ నది వద్ద ఈ ఆలయం కలదు. ఈ ఆలయానికి ప్రధానంగా నవంబరు నెలలో ప్రారంభమై జనవరి నెల అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. విదేశాల నుంచి కూడా ఈ ఆలయం దర్శించడానికి యాత్రికులు విచ్చేస్తారు.

ఆలయ చరిత్ర :

శబరిమల యాత్ర ఎరుమేలి తో ప్రారంభమవుతుంది. ఎరుమేలిలో "వావరు స్వామిని" దర్శింకుంటారు. స్వామి పులిపాలకోసం అడవికి వెళ్ళినపుడు అతనిని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు. అతడే వావరు స్వామి. "నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకొంటారు" అని అయ్యప్ప స్వామి వావరుకు వరమిచ్చారు.

ఆ కారణం చేత ఇప్పటికీ భక్తులు ముందుగా ఈయన దర్శనం తరువాత స్వామి వారి దర్శనం లభిస్తుంది. దర్శనానంతరం భక్తులు వావరుస్వామి చుట్టూ రకరకాల వేషధారణతో "పేటై తులాల" అనే నాట్యం చేస్తారు. (మహిషితో యుద్ధం చేసేటపుడు అయ్యప్ప చేసిన తాండవం పేరు "పేటై తులాల"). ఈ ఎరుమేలి వద్ద ఉన్న "ధర్మశాస్త" ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్బాణధారియై ఉంటాడు. ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఈయనను "కన్నెమూల గణపతి" అని అంటారు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు.


ఇక్కడి నుంచి స్వామి వారి ఆలయానికి పాదయాత్రతో ప్రారంభం అవుతుంది. పెద్ద పాదం అనే కొండల మధ్య దట్టమైన అడవిలో సుమారు 52 కి. మీ కాలిబాట దారిలో నడుస్తూ చేరుకోవాలి.  దారిలో పెరుర్‌తోడు, కాలైకట్టి అనే స్థలాలున్నాయి.

అయ్యప్ప స్వామి యుద్దం చేసే సమయంలో శివకేశవులు యుద్ధాన్ని చూశారట). ఇక్కడికి కొద్ది దూరంలోనే అళదా నది (మహిషి కార్చిన కన్నీరు నదీరూపమైందట) ఉంది. ఈ నదిలో స్నానం చేసి భక్తులు నదినుండి ఒక రాయిని తీసుకు వెళతారు.

ఆ రాతిని "కళిద ముకుంద" (మహిషి కళేబరాన్ని పూడ్చిన చోటు) వద్ద పడవేస్తారు. తరువాత యాత్ర ముందుకు సాగి కరిమాల పెరియానపట్టమ్, చెరియానపట్టమ్ అనే స్థలాలగుండా పంబ నది చేరుకొంటుంది. అక్కడే "పంబ" అనే గ్రామం కూడా ఉంది. ఇక్కడినుండి స్వామి సన్నిధానానికి ఏడు కిలోమీటర్ల దూరం.

చిన్నపాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి. బస్సులపై పంబానది వరకు చేరుకోవచ్చు. చివరి ఏడు కిలోమీటర్లు మాత్రం కాళినడకన వెళ్ళాలి.


అయ్యప్ప జననం :

ఛైత్రమాసము, ఉత్తరా నక్షత్రం, చతుర్ధశి - సోమవారము నాడు స్వామి వారు జన్మించినారు.. జ్యోతి రూపంగా అంర్ధానమయిన రోజు  మకర సంక్రాంతి. ఇప్పటికీ స్వామి వారుమకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనం ఇస్తారు అని భక్తుల నమ్మకం. రాక్షస సంహారం కొరకు శ్రీ మహా విష్ణువు మోహినీ అవతారం ఎత్తి పరమేశ్వరుడు మోహింపజేస్తే వారికి సంతానం కలిగితే ఆ శిశువు చేతిలో మరణిస్తాను అని ఒక రాక్షసుడు వరం పొందుతాడు.

తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త (అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం.


తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు.సన్నిధానంలో "పానవట్టం"పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. స్వామియే శరణం అయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని. ఒంపు తిరిగిన ఎడమచేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని  భక్తులు చెబుతారు. అందుకే స్వామి వారిని శ్రీ మహా విష్ణువు పేరు హరి పరమేశ్వరుడు పేరు హర ఈ ఇద్దరి పేర్లు కలిపి హరిహారతనయ అనే నామాము కూడా కలదు. ఈ సం || స్వామి వారి దర్శన తేదీలు ఈ కింద వివరించబడినది.


వసతి వివరాలు :

ఆలయానికి విచ్చేసే భక్తులకు చాలా వసతి కాంప్లెక్స్ లు కలవు. వాటి వివరాలు ఈ కింద వివరించడం జరిగినది. కేవలం ఆలయ తెరిచి ఉన్నప్పుడు మాత్రమే బుకింగ్ స్వీకరిస్తారు. మిగిలిన వివరాల కొరకు ఆలయ వెబ్సైట్ ను గమనించగలరు.

Guest House                       Phone                                 Rate/Room (in Rs.)

PALAZHI (DH I)         04735-202049                               350/-
SOPANAM (DH II) 04735-202049                                  350/-
MANIKANTAN (DH III) 04735-202049                           325/-
CHINMUDRA (DH IV)   04735-202049                           325/-
SIVASAKTHI (DH V)         04735-202049                       525-975/-
TEJASWINI (DH VI)         04735-202049                         525/-
SREEMATHA (DH VII) 04735-202049                            525/-
PRANAVAM (PC I) 04735-202049                                  325/-
SAHYADRI (PC II)         04735-202049                           325/-
KAILAS (PC III)         04735-202049                         200/-
GKD Hall                 04735-202049                                  900/-
Poorna, Pushkala Hall         04735-202049                       1275/-

Sabari Guest House         04735-202056

2 bed                                                                              1000/-

3 bed                                                                             1500/-

4 bed                                                                            2000/-

Forest IB Sabarimala          04735-202074/75                    bed/200+50/each additional

Forest Dormitory                  04735-202074/75                    bed/80

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

కొయంబత్తూరు , పళని , మరియు తెంకాశీ నుంచి పంబ వరకు బస్ లో ప్రయాణించి అక్కడి నుంచి ఆలయానికి చేరుకోవాలి.  కేవలం ఆలయం తెరిచి ఉంచిన సమయంలోనే బస్ లు అందుబాటులో ఉంటాయి.

రైలు మార్గం :

యాత్రికులు కొట్టాయం లేదా చెన్నగనూర్ స్టేషన్ కి చేరుకొని అక్కడి నుంచి బస్ లో పంబ ప్రాంతానికి చేరుకోవచ్చు.

విమాన మార్గం :

యాత్రికులు ఈ ఆలయానికి చేరుకోవడానికి దగ్గరలోని విమానాశ్రయం తిరువనంతపురం లేదా కొచ్చి. అక్కడి నుంచి బస్ లేదా కార్ లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

ఆలయ చిరునామా : 

TRAVANCORE DEVASWOM BOARD
Nanthancode,
Kawdiar Post,
Thiruvananthapuram 695003
Kerala.
EPABX NOS: 0471-2317983, 2316963, 2310921, 2723240
FAX: 0471-2310192
Website: www.sabarimala.kerala.gov.in

Keywords : Lord Ayyappa Swamy , Kerala Famous Temples , Kearala Tourism, Ayyappa Swamy temple History , Ayyappa SwamyTemple Address, Makara Jyothi Date, Hindu Temples Guide 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.