Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శ్రీ శివ భుజంగ స్తోత్రం | Sri Shiva Bhujangam Stotram | Hindu Temples Guide

శ్రీ శివ భుజంగ స్తోత్రం  :

గలద్దానగండం మిలద్భృంగషండం
చలచ్చారుశుండం జగత్త్రాణశౌండమ్ |
కనద్దంతకాండం విపద్భంగచండం
శివప్రేమపిండం భజే వక్రతుండమ్ || 1 ||

అనాద్యంతమాద్యం పరం తత్త్వమర్థం
చిదాకారమేకం తురీయం త్వమేయమ్ |
హరిబ్రహ్మమృగ్యం పరబ్రహ్మరూపం
మనోవాగతీతం మహఃశైవమీడే || 2 ||

స్వశక్త్యాది శక్త్యంత సింహాసనస్థం
మనోహారి సర్వాంగరత్నోరుభూషమ్ |
జటాహీందుగంగాస్థిశమ్యాకమౌళిం
పరాశక్తిమిత్రం నమః పంచవక్త్రమ్ || 3 ||

శివేశానతత్పూరుషాఘోరవామాదిభిః
పంచభిర్హృన్ముఖైః షడ్భిరంగైః |
అనౌపమ్య షట్త్రింశతం తత్త్వవిద్యామతీతం
పరం త్వాం కథం వేత్తి కో వా || 4 ||

ప్రవాళప్రవాహప్రభాశోణమర్ధం
మరుత్వన్మణి శ్రీమహః శ్యామమర్ధమ్ |
గుణస్యూతమేతద్వపుః శైవమంతః
స్మరామి స్మరాపత్తిసంపత్తిహేతోః || 5 ||

స్వసేవాసమాయాతదేవాసురేంద్రా
నమన్మౌళిమందారమాలాభిషిక్తమ్ |
నమస్యామి శంభో పదాంభోరుహం తే
భవాంభోధిపోతం భవానీ విభావ్యమ్ || 6 ||

జగన్నాథ మన్నాథ గౌరీసనాథ
ప్రపన్నానుకంపిన్విపన్నార్తిహారిన్ |
మహఃస్తోమమూర్తే సమస్తైకబంధో
నమస్తే నమస్తే పునస్తే నమో‌உస్తు || 7 ||

విరూపాక్ష విశ్వేశ విశ్వాదిదేవ
త్రయీ మూల శంభో శివ త్ర్యంబక త్వమ్ |
ప్రసీద స్మర త్రాహి పశ్యావముక్త్యై
క్షమాం ప్రాప్నుహి త్ర్యక్ష మాం రక్ష మోదాత్ || 8 ||

మహాదేవ దేవేశ దేవాదిదేవ
స్మరారే పురారే యమారే హరేతి |
బ్రువాణః స్మరిష్యామి భక్త్యా
భవంతం తతో మే దయాశీల దేవ ప్రసీద || 9 ||

త్వదన్యః శరణ్యః ప్రపన్నస్య నేతి
ప్రసీద స్మరన్నేవ హన్యాస్తు దైన్యమ్ |
న చేత్తే భవేద్భక్తవాత్సల్యహానిస్తతో
మే దయాళో సదా సన్నిధేహి || 10 ||

అయం దానకాలస్త్వహం దానపాత్రం
భవానేవ దాతా త్వదన్యం న యాచే |
భవద్భక్తిమేవ స్థిరాం దేహి మహ్యం
కృపాశీల శంభో కృతార్థో‌உస్మి తస్మాత్ || 11 ||

పశుం వేత్సి చేన్మాం తమేవాధిరూఢః
కలంకీతి వా మూర్ధ్ని ధత్సే తమేవ |
ద్విజిహ్వః పునః సో‌உపి తే కంఠభూషా
త్వదంగీకృతాః శర్వ సర్వే‌உపి ధన్యాః || 12 ||

న శక్నోమి కర్తుం పరద్రోహలేశం
కథం ప్రీయసే త్వం న జానే గిరీశ |
తథాహి ప్రసన్నో‌உసి కస్యాపి
కాంతాసుతద్రోహిణో వా పితృద్రోహిణో వా || 13 ||

స్తుతిం ధ్యానమర్చాం యథావద్విధాతుం
భజన్నప్యజానన్మహేశావలంబే |
త్రసంతం సుతం త్రాతుమగ్రే
మృకండోర్యమప్రాణనిర్వాపణం త్వత్పదాబ్జమ్ || 14 ||

శిరో దృష్టి హృద్రోగ శూల ప్రమేహజ్వరార్శో జరాయక్ష్మహిక్కావిషార్తాన్ |
త్వమాద్యో భిషగ్భేషజం భస్మ శంభో
త్వముల్లాఘయాస్మాన్వపుర్లాఘవాయ || 15 ||

దరిద్రో‌உస్మ్యభద్రో‌உస్మి భగ్నో‌உస్మి దూయే
విషణ్ణో‌உస్మి సన్నో‌உస్మి ఖిన్నో‌உస్మి చాహమ్ |
భవాన్ప్రాణినామంతరాత్మాసి శంభో
మమాధిం న వేత్సి ప్రభో రక్ష మాం త్వమ్ || 16 ||

త్వదక్ష్ణోః కటాక్షః పతేత్త్ర్యక్ష యత్ర
క్షణం క్ష్మా చ లక్ష్మీః స్వయం తం వృణాతే |
కిరీటస్ఫురచ్చామరచ్ఛత్రమాలాకలాచీగజక్షౌమభూషావిశేషైః || 17 ||

భవాన్యై భవాయాపి మాత్రే చ పిత్రే
మృడాన్యై మృడాయాప్యఘఘ్న్యై మఖఘ్నే |
శివాంగ్యై శివాంగాయ కుర్మః శివాయై
శివాయాంబికాయై నమస్త్ర్యంబకాయ || 18 ||

భవద్గౌరవం మల్లఘుత్వం విదిత్వా
ప్రభో రక్ష కారుణ్యదృష్ట్యానుగం మామ్ |
శివాత్మానుభావస్తుతావక్షమో‌உహం
స్వశక్త్యా కృతం మే‌உపరాధం క్షమస్వ || 19 ||

యదా కర్ణరంధ్రం వ్రజేత్కాలవాహద్విషత్కంఠఘంటా ఘణాత్కారనాదః |
వృషాధీశమారుహ్య దేవౌపవాహ్యంతదా
వత్స మా భీరితి ప్రీణయ త్వమ్ || 20 ||

యదా దారుణాభాషణా భీషణా మే
భవిష్యంత్యుపాంతే కృతాంతస్య దూతాః |
తదా మన్మనస్త్వత్పదాంభోరుహస్థం
కథం నిశ్చలం స్యాన్నమస్తే‌உస్తు శంభో || 21 ||

యదా దుర్నివారవ్యథో‌உహం శయానో
లుఠన్నిఃశ్వసన్నిఃసృతావ్యక్తవాణిః |
తదా జహ్నుకన్యాజలాలంకృతం తే
జటామండలం మన్మనోమందిరే స్యాత్ || 22 ||

యదా పుత్రమిత్రాదయో మత్సకాశే
రుదంత్యస్య హా కీదృశీయం దశేతి |
తదా దేవదేవేశ గౌరీశ శంభో
నమస్తే శివాయేత్యజస్రం బ్రవాణి || 23 ||

యదా పశ్యతాం మామసౌ వేత్తి
నాస్మానయం శ్వాస ఏవేతి వాచో భవేయుః |
తదా భూతిభూషం భుజంగావనద్ధం
పురారే భవంతం స్ఫుటం భావయేయమ్ || 24 ||

యదా యాతనాదేహసందేహవాహీ
భవేదాత్మదేహే న మోహో మహాన్మే |
తదా కాశశీతాంశుసంకాశమీశ
స్మరారే వపుస్తే నమస్తే స్మరామి || 25 ||

యదాపారమచ్ఛాయమస్థానమద్భిర్జనైర్వా విహీనం గమిష్యామి మార్గమ్ |
తదా తం నిరుంధంకృతాంతస్య మార్గం
మహాదేవ మహ్యం మనోఙ్ఞం ప్రయచ్ఛ || 26 ||

యదా రౌరవాది స్మరన్నేవ భీత్యా
వ్రజామ్యత్ర మోహం మహాదేవ ఘోరమ్ |
తదా మామహో నాథ కస్తారయిష్యత్యనాథం పరాధీనమర్ధేందుమౌళే || 27 ||

యదా శ్వేతపత్రాయతాలంఘ్యశక్తేః
కృతాంతాద్భయం భక్తివాత్సల్యభావాత్ |
తదా పాహి మాం పార్వతీవల్లభాన్యం
న పశ్యామి పాతారమేతాదృశం మే || 28 ||

ఇదానీమిదానీం మృతిర్మే భవిత్రీత్యహో సంతతం చింతయా పీడితో‌உస్మి |
కథం నామ మా భూన్మృతౌ భీతిరేషా
నమస్తే గతీనాం గతే నీలకంఠ || 29 ||

అమర్యాదమేవాహమాబాలవృద్ధం
హరంతం కృతాంతం సమీక్ష్యాస్మి భీతః |
మృతౌ తావకాంఘ్ర్యబ్జదివ్యప్రసాదాద్భవానీపతే నిర్భయో‌உహం భవాని || 30 ||

జరాజన్మగర్భాధివాసాదిదుఃఖాన్యసహ్యాని జహ్యాం జగన్నాథ దేవ |
భవంతం వినా మే గతిర్నైవ శంభో
దయాళో న జాగర్తి కిం వా దయా తే || 31 ||

శివాయేతి శబ్దో నమఃపూర్వ ఏష
స్మరన్ముక్తికృన్మృత్యుహా తత్త్వవాచీ |
మహేశాన మా గాన్మనస్తో వచస్తః
సదా మహ్యమేతత్ప్రదానం ప్రయచ్ఛ || 32 ||

త్వమప్యంబ మాం పశ్య శీతాంశుమౌళిప్రియే భేషజం త్వం భవవ్యాధిశాంతౌ
బహుక్లేశభాజం పదాంభోజపోతే
భవాబ్ధౌ నిమగ్నం నయస్వాద్య పారమ్ || 33 ||

అనుద్యల్లలాటాక్షి వహ్ని ప్రరోహైరవామస్ఫురచ్చారువామోరుశోభైః |
అనంగభ్రమద్భోగిభూషావిశేషైరచంద్రార్ధచూడైరలం దైవతైర్నః || 34 ||

అకంఠేకలంకాదనంగేభుజంగాదపాణౌకపాలాదఫాలే‌உనలాక్షాత్ |
అమౌళౌశశాంకాదవామేకళత్రాదహం దేవమన్యం న మన్యే న మన్యే || 35 ||

మహాదేవ శంభో గిరీశ త్రిశూలింస్త్వదీయం సమస్తం విభాతీతి యస్మాత్ |
శివాదన్యథా దైవతం నాభిజానే
శివో‌உహం శివో‌உహం శివో‌உహం శివో‌உహమ్ || 36 ||

యతో‌உజాయతేదం ప్రపంచం విచిత్రం
స్థితిం యాతి యస్మిన్యదేకాంతమంతే |
స కర్మాదిహీనః స్వయంజ్యోతిరాత్మా
శివో‌உహం శివో‌உహం శివో‌உహం శివో‌உహమ్ || 37 ||

కిరీటే నిశేశో లలాటే హుతాశో
భుజే భోగిరాజో గలే కాలిమా చ |
తనౌ కామినీ యస్య తత్తుల్యదేవం
న జానే న జానే న జానే న జానే || 38 ||

అనేన స్తవేనాదరాదంబికేశం
పరాం భక్తిమాసాద్య యం యే నమంతి |
మృతౌ నిర్భయాస్తే జనాస్తం భజంతే
హృదంభోజమధ్యే సదాసీనమీశమ్ || 39 ||

భుజంగప్రియాకల్ప శంభో మయైవం
భుజంగప్రయాతేన వృత్తేన క్లృప్తమ్ |
నరః స్తోత్రమేతత్పఠిత్వోరుభక్త్యా
సుపుత్రాయురారోగ్యమైశ్వర్యమేతి || 40 ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Key words : Sri Shiva Bhujangam Stotram , Telugu Stotras , Storas In Telugu Lyrics , Hindu Temples Guide 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు