Drop Down Menus

తిరుమల శ్రీవారి సేవ కొత్త రూల్స్ | Tirumala Srivari Seva New Rules | Hindu Temples Guide

తిరుమల లో  శ్రీవారి సేవ చెయ్యాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు సేవ చేయడానికి వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది ఏ దేవాలయానికి లేని విధంగా సేవ బుకింగ్ మరియు భక్తులకు వసతి మరియు  లాకర్లు సదుపాయం కల్పిస్తుంది.  
tirumala srivari seva new rules
తిరుమల లో సేవ చెయ్యాలంటే ఎన్ని రోజులు చేయవచ్చు ? సంవత్సరం లో ఎన్ని సార్లు వెళ్ళవచ్చు ? శ్రీవారి సేవ కు కావాల్సిన అర్హతలు ఏమిటి ? ఒక్కరు వెళ్ళవచ్చా ? గ్రూప్ గా వెళ్లాలంటే ఆ గ్రూప్ లో ఎంత మంది ఉండాలి ? గుడి లో సేవ అందరికి ఉంటుందా ? ఏ విధంగా బుక్ చేసుకోవాలి ? గ్రూప్ బుక్ అయ్యాక ఎవరైనా రాకపోతే ఎలా ? వీటికి సమాధానాలు ఇప్పడు తెలుసుకుందాం .
🛕 శ్రీవారి సేవ జూలై నెలకు ఏప్రిల్ నెలకు 27వ తేదీ 11 గంటలకు విడుదల చేస్తున్నారు. 12 గంటలకు నవనీత సేవ టికెట్స్ కు 1 గంటకు పరకామణి సేవ విడుదల చేస్తున్నారు.

శ్రీవారి సేవ ఎన్ని రోజులు ఉంటుంది ?

శ్రీవారి సేవ 7 రోజులు ఉంటుంది. వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాల సందర్భం లో 10 రోజులు ఉంటుంది. 

శ్రీవారి సేవ కు వయస్సు ఎంత ఉండాలి ?

శ్రీవారి సేవ కు 18-60 సంవత్సరాలు ఉండాలి . పర్వదినాల్లో ప్రత్యేక కోట విడుదల చేసినపుడు 18-50 సంవత్సరాలు వారిని మాత్రమే అనుమతి ఇస్తారు .

శ్రీవారి సేవకు ఒక్కరు బుక్ చేసుకోవాలా ? గ్రూప్ గా చేయాలి అంటే ఎంత మంది ఉండాలి ?

శ్రీవారి సేవ కు ఒక్కరు కూడా బుక్ చేసుకోవచ్చు . గ్రూప్ గా వెళ్ళాలి అనుకుంటే కనీసం 10 మంది ఉండాలి గరిష్టంగా 15 మంది ఉండవచ్చు

శ్రీవారి సేవ కు భార్యాభర్తలు వెళ్లాలంటే ఎలా ?

సేవ బుకింగ్ సింగల్ గా లేదా గ్రూప్ గా అవకాశం ఉంది. జంట గా చేసుకోవడానికి అవకాశం లేదు మీరు విడిగా విడిగా ఒకే తేదికి బుక్ చేసుకుని వెళ్ళవచ్చు . 

శ్రీవారి సేవ ఆఫ్ లైన్ లో ఎలా బుక్  చేసుకోవాలి ?

శ్రీవారి సేవ బుకింగ్ ఇంతకు ముందు ఆఫ్ లైన్ లో అనగా దేవస్థానం వారికి లెటర్ ద్వారా దరఖాస్తు చేసుకుని బుకింగ్ చేసుకునే వారు ఇప్పుడు ఆ పద్దతి లేదు. 

శ్రీవారి సేవ వెళ్లేవారికి దేవస్థానం వారు డబ్బులు ఇస్తారా ?

శ్రీవారి సేవకులు తమ సొంత ఖర్చులతో తిరుమల చేరుకోవాలి , దేవస్థానము వారు ఉండటానికి వసతి మరియు వెంగమాంబ లో భోజన సదుపాయం కల్పిస్తారు డబ్బులు ఇవ్వరు .  

శ్రీవారి సేవ కు తీసుకుని వెళ్లే టీం లీడర్ కు దేవస్థానం వారు డబ్బులు  ఇవ్వడం కానీ లేదా ప్రత్యేక సత్కారాలు ఏమైనా చేస్తారా ?

టీం లీడర్ కు ఎటువంటి ప్రత్యేక సత్కారాలు చెయ్యరు మరియు డబ్బులు ఇవ్వరు . 

శ్రీవారి సేవ  చేసేవారికి డ్యూటీ ఎన్ని గంటలు ఉంటుంది ?

ప్రతి రోజు 6 గంటలు ఉంటుంది . చాలామంది భక్తులు కోరి మరీ అదనపు డ్యూటీ వేయించుకుంటారు . 

శ్రీవారి సేవకులకు గుడి లో ఎప్పుడు డ్యూటీ వేస్తారు ?

ప్రతి రోజు లక్కీ డ్రా ద్వారా టీమ్ లను మరియు సింగల్ గా సేవ కు వచ్చిన వారిని సెలెక్ట్ చేసి వారికి టెంపుల్ డ్యూటీ వేస్తారు .

టెంపుల్ డ్యూటీ వచ్చిన అందరికి స్వామి వారి దగ్గర సేవ ఉంటుందా ?

లక్కీ డ్రా లో సెలెక్ట్ అయిన వారందరికీ స్వామి దగ్గరే సేవ ఉంటుంది అనేది చెప్పలేము. మనం చూస్తుంటాం కదా ధ్వజ స్థంభం దగ్గర ఆలయం బయట కూడా సేవ కులు ఉంటారు. సేవ వచ్చిన తరువాత తప్పనిసరిగా దర్శనం ఉంటుంది .

టెంపుల్ డ్యూటీ రాని వారికీ దర్శనం ఉంటుందా ?

టెంపుల్ డ్యూటీ కి దర్శనం కు సంబంధం ఉండదు . శ్రీవారి సేవ కు వచ్చిన అందరికి చివరి రోజు దర్శనమ్ ఇస్తారు. 

శ్రీవారి సేవ బుక్  అయ్యాక ఎక్కడ రిపోర్ట్ చెయ్యాలి ?

సేవ బుక్ అయ్యాక ప్రింట్ తీసుకుని కొండపైన సేవ సదన్ -2 లో కి వెళ్లి రిపోర్ట్ చెయ్యాలి . ఈ సేవ సదన్ వెంగమాంబ అన్నదానం వెనకాల గల బస్సు స్టాప్ దగ్గర ఉంటుంది . 

 సేవకులకు డ్రెస్ కోడ్ ఏమిటీ ?

ఆడవారు ఆరంజ్ కలర్ చీర , మెరూన్ కలర్ జాకెట్టు ఉండాలి . మగ వారు తెల్ల చొక్కా , తెల్ల పంచ ఉండాలి .

శ్రీవారి సేవ వెబ్సైటు ఏమిటీ ?

https://srivariseva.tirumala.org/#/login

శ్రీవారి సేవ కు బుక్ అయిన తరువాత ఎవరైనా రాకపోతే వారికి బదులు ఎవరైనా తీసుకుని వెళ్లవచ్చా ?

కొత్త రూల్స్ ప్రకారం ఆలా తీసుకుని వెళ్లడం కుదరదు 

 

హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు టికెట్స్ విడుదల ఇతర సేవ విషయాలు మీకు తెలియచేస్తాముమీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి . 

ఇవి చదివారా ?
తిరుమల టికెట్ లేకుండా వెళ్తున్నారా
తిరుమల లో రూమ్ కావాలా ?
300/- టికెట్స్ రూల్స్
500/- టికెట్స్ రూల్స్
శ్రీవాణి టికెట్స్ వివరాలు
లక్ష ఆపైన డొనేషన్ వివరాలు
సుప్రభాతం టికెట్స్
తోమాల సేవ టికెట్స్
అర్చన టికెట్స్
అష్టదళ టికెట్స్
కళ్యాణం టికెట్స్
తిరుప్పావడ టికెట్స్
మెల్చట్ వస్త్రం
చంటి పిల్లల దర్శనం
శ్రీవారి సేవ
నవనీత సేవ
పరకామణి సేవ
తిరుమల చుట్టుపక్కల ఆలయాలు
ఇతర ఆర్జిత సేవలు
అంగ ప్రదక్షిణ
అన్నదాన సమయాలు
శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు
తులాభారం
తిరుమల తీర్ధాలు వాటి విశేషాలు
సీనియర్ సిటిజెన్ దర్శనం
అరుణాచలం యాత్ర
కాశీయాత్ర

keywords : srivari seva latest information, srivari seva website , srivari seva rules, 

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.