Drop Down Menus

Sri Swamy Narayan Temple | Akshardham | New Delhi

శ్రీ స్వామి నారాయణ్ ఆలయం , అక్షరధామ్, ఢిల్లీ :

ఈ ఆలయం ఢిల్లీలోని కలదు. అతి పెద్ద సువిశాల ఆలయం ఈ దేవాలయం. ఈ దేవాలయం యమునా నది నోయిడాకి కొద్ది దూరంలోనే ఈ ఆలయం కలదు. ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టి పడేలా ఈ ఆలయ నిర్మాణం ఉంటుంది. ఆలయం తేదీ 6 నవంబరు  2005వ తేదీన భారత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదగా ఆవిష్కృతమైంది. 8వ తేదీ నుండి ప్రజలకు దర్శనీయ ప్రదేశంగా తెరిచారు.


ఆలయ చరిత్ర :

ఉత్తరప్రదేశ్‍లోని అయోధ్యకు సమీపంలో వున్న ఛాపయ్యా అనే చిన్న కుగ్రామంలో 1781సం ||  లో స్వామి నారాయణ్ అనే  స్వామి జన్మించాడు. తన ఏడవ సం ||  లోనే గ్రంథాల్ని పఠించాడు. తన 11 వ సం || లో ఇల్లు వదిలి కాలి నడక వెళ్ళాడు. ఏడేళ్ళ పాటు కాలినడకన భారతదేశమంతా సంచరించి, వివిధ సంస్కృతీ రూపాల్ని తేలుసుకుని, చివరకు గుజరాత్‍లో స్థిరపడ్డాడు. ఆధ్యాత్మికభోధనలకి  నాందిపలికి ' స్వామి నారాయణ' సంప్రదాయానికి వ్యవస్థాపకుడయ్యాడు. కొద్ది కాలం లోనే పేరు సంపాదించాడు. ఆ తర్వాత నలబైతొమ్మిదేళ్ళు  జీవించి, తన వారసుల దీక్షవ్వారా, తన బోధనల ప్రాచుర్యం ద్వారా, తాను అమలుపరచిన సంప్రదాయం "అక్షరం" అనగా (వినాశనం లేనిది) గా కొనసాగే మార్గం సుగమం చేశాడు. అందుకే ఆ భవనసముదాయం "అక్షరధామ్"గా ప్రసిద్ధిపొందింది. డబ్బు కొద్ది రోజులలో నీటి లా ఖర్చు అయిపోతుంది. కానీ జ్ఞానం మాత్రం ఎప్పటికీ ఖర్చు జరగనిదే దీని అంతార్ధం. ఈ ఆలయ నిర్మాణానికి చాలా సం || కృషి ఉన్నది.  బ్రహ్మ స్వరూప్ యోగీజి మహారాజ్1892-1971మధ్య కాలంలో జీవించి ఉన్నారు. ఆలయ కోరిక మేరకు ఈ ఆలయం నిర్మించారు.  యమునాతీరాన ఒక స్మారక భవనం నిర్మించబడాలన్నదే ఆయన కోరిక. కానీ ఆయన జీవితకాలంలో అది జరగలేదు. ఆయన వారసుడు బొచాసన్‍వాసి శ్రీ అక్షర పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బ్యాప్స్) కు ఆధ్యాత్మిక గురువైన ప్రముఖ్ స్వామి మహారాజ్ (83) ద్వారా ఆ కోరిక నెరవేరింది. కేవలం ఆయన చొరవతో, ఆశీస్సులతో రెండు దశాబ్దాల కృషి ఫలితంగా నేటి స్వామి నారాయణ్ అక్షరధామ్ వెలిసింది.


ఈ సంస్థ కేవలం ఢిల్లీమాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. భక్తుల నుంచి సేకరించిన విరరాలు సేకరించి 7000 ప్రత్యేకంగా నియమించిన భక్తుల ద్వారా సాంస్కృతిక విద్యా ప్రబోధ కేంద్రం నిర్మించారు. ఈ కేంద్రం ఎంతటి ప్రకృతి విపత్తు వచ్చిన తట్టుకొని నిలబడే విధంగా నిర్మించారు. అక్షరధామ్ సముదాయం అంటే పరమాత్ముని శాశ్వత, అవినాశ నిలయం. వేదాలలో, ఉపనిషత్తులలో నిర్వచించబడిన శాశ్వత విలువలు, శాశ్వత సుగుణాలకు నెలవు. ఆ స్మారక భవన సముదాయం యొక్క పూర్తిపేరు "స్వామి నారాయణ్ అక్షరధామ్".


ఆలయ దర్శన సమయం :

ప్రతి మంగళవారం నుంచి ఆదివారం వరకు
ఉదయం      : 9:30 - 12:00
మధ్యాహ్నం  : 12:30 - 6:30
ప్రతి సోమవారం సెలవు.

వసతి వివరాలు :

ఈ ఆలయనికి 2 కి మీ దూరంలో ప్రైవేట్ హోటల్ కు కలవు.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

ఢిల్లీ లోని అన్నీ ప్రధాన ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి బస్ లు కలవు.

రైలు మార్గం :

ఈ ఆలయానికి దగ్గరలోనే ప్రధాన రైల్వే స్టేషన్ లు కలవు. హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి 6 కి. మీ దూరంలోను , కొత్త ఢిల్లీస్టేషన్ నుంచి 11 కి. మీ దూరంలో ఈ ఆలయం కలదు.

విమాన మార్గం :

ఆలయానికి కొద్ది దూరంలోనే ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. ఈ విమానాశ్రయం నుంచి ఆలయానికి 21కి. మీ దూరంలో ఉన్నది.

ఆలయ చిరునామా :

శ్రీ స్వామి నారాయణ్ ఆలయం ,
NH 24, అక్షరధామ్
న్యూ ఢిల్లీ
పిన్ కోడ్ : 110092.
Phone: +91-11-4344 2344

key words : Sri Swamy Narayan Temple, Akshardham , Famous Temples In New Delhi , Delhi Temple History, Hidnu Temples Guide
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.