అమెరికా ఏడారిలో 22 కిమీల శ్రీ చక్రం | Amazing Facts Sri Yantra appears in Oregon Dry Lake

అమెరికా ఏడారిలో 22 కిమీల శ్రీ చక్రం.. గీసింది మనుషులు కాదు, నేటికీ వీడని మిస్టరీ:
హిందువులు పవిత్రంగా భావించే శ్రీ చక్రం గురించి మీకు ఆలోచన ఉందా ? శ్రీ చక్రాన్ని తమ ఇంట్లో పెట్టుకుంటే అంత శుభకరమైన అని హిందువులు చాలామంది నమ్ముతారు. శ్రీచక్రం లేదా శ్రీ యంత్రం అని దీన్ని పిలుస్తారు.
అయితే శ్రీచక్రం విషయంలో ఒక సారి అమెరికా ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.దానికి కారణం ఆదేశంలోని ఓ ఎడారిలో ఎండిపోయిన సరస్సులో ఏకంగా 22 కిలోమీటర్ల వైశాల్యంలో అతిపెద్ద శ్రీ చక్రం ప్రత్యక్షం అయ్యింది. ప్రతి రోజూ ప్రతి నిమిషం అమెరికా వైమానిక దళం ఇంకా ఉండే ఆ ప్రాంతంలో శ్రీ చక్రం ఎలా ఏర్పడిందని హిస్టరీ ఇప్పటికీ తేలలేదని నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే.దీని విషయం తేల్చేందుకు పరిశోధకులు కూడా చేతులెత్తేశారు అంటే నమ్మండి.
ప్రతి రోజూ ప్రతి నిమిషం అమెరికా వైమానిక దళం ఇంకా ఉండే ఆ ప్రాంతంలో శ్రీ చక్రం ఎలా ఏర్పడిందని హిస్టరీ ఇప్పటికీ తేలలేదని నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే.దీని విషయం తేల్చేందుకు పరిశోధకులు కూడా చేతులెత్తేశారు 

అలాంటివి భూమిపై ఎలాంటి తప్పులు వంకరలు లేకుండా కచ్చితంగా తీయాలంటే ఎంత మేధాశక్తి అవసరం కదా.అయితే ఈ సంఘటన 1990వ సంవత్సరంలో జరిగింది.

నిజానికి ఆ సమయాల్లో ఇప్పుడున్న టెక్నాలజీ కూడా అప్పుడు లేదు.అ సమయంలో కనీసం డ్రోన్ కెమెరాలు కూడా అందుబాటులో లేవు.మరి అంత పెద్ద  శ్రీచక్రం ఆకారం ఎలా ప్రత్యక్షమైంది ఎవరు తీశారు చివరికి ఏం తేల్చారు ? దాన్ని మానవుల లేకపోతే ఎవరైనా గ్రహాంతరవాసులు ఏర్పరిచారా .? అనేవాటికి ఇప్పటికీ సమాధానం సరిగ్గా దొరకలేదు.అసలు హిందూ ధర్మానికి సంబంధించిన శ్రీచక్రాన్ని ఎందుకు అక్కడ గీసారు అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. నిజానికి ఆ శ్రీచక్రాన్ని మామూలుగా చూడలేము. ఏకంగా తొమ్మిది వేల అడుగుల ఎత్తు నుంచి మాత్రమే అది స్పష్టంగా కనపడుతుంది.భూమి మీద నుంచి చూస్తే ఏదో అవి గీతల మాత్రమే అనిపిస్తాయి అని తెలుస్తోంది.
ఇకపోతే నేషనల్ ఎయిర్ గార్డ్ పైలెట్ లో ఆ మార్గంలో కొద్ది సేపటి క్రితమే ప్రయత్నించినప్పటికీ మళ్ళీ వారు తిరిగి వచ్చే సమయం లోపల ఆ ఆకారం వచ్చిందని అధికారులు తెలియజేశారు.కేవలం అదింత సమయంలోనే అంత పక్కాగా శ్రీ చక్రాన్ని ఎలా చేయగలిగారు వారికి ఇప్పటికీ అంతుపట్టని విశేషం అది.ఆ గీతలు ఎలా ఉన్నాయంటే 3 అంగుళాల లోతు 9 అంగుళాల వెడల్పుతో నాగలితో తగినట్లుగా ఆ గీతలు కనపడతాయి.అయితే వాటిమీద పరిశోధనలు చేసిన కొంతమంది పరిశోధకులు మాత్రం ఖచ్చితంగా మానవ నిర్మితం కాదని గ్రహాంతర వాసులు ఈ పని చేసి ఉంటారని వారు తెలియజేస్తున్నారు.
అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో ఉన్న బర్న్స్ ప్రాంతంలో వేడి తీవ్రత ఎక్కువ. ఆ వేడికి అక్కడ ఉన్న సరస్సులు సైతం ఎండిపోయాయి. ఆ ప్రాంతం క్రమేనా ఎడారిలా మారిపోయింది. ఈ ప్రాంతానికి సమీపంలోనే ఇదహో ఎయిర్‌ఫోర్స్ కేంద్రం కూడా ఉంది. జనవాసాలు తక్కువగా ఉండే ప్రాంతం కావడంతో వైమానిక దళం తమ పైలట్లకు ఇక్కడే శిక్షణ ఇస్తోంది. ఇందులో భాగం నిత్యం బర్న్స్ ప్రాంతం మీదుగా వైమానిక విమానాలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే, వారికి ఏ రోజు అక్కడ శ్రీచక్రం కనిపించలేదు. పైగా, అక్కడ ఉండే వేడికి ఆ ప్రాంతంలో మనుషులు పనిగట్టుకుని అంత పెద్ద శ్రీచక్రాన్ని గీయడమంటే మాటలు కాదు. నిత్యం నిఘా ఉండే ఆ ప్రాంతంలోకి అత్యాధునిక పరికరాలను తీసుకెళ్లే అవకాశం కూడా లేదు.
ఆ శ్రీచక్రాన్ని సాధారణంగా చూడలేం. కేవలం 9 వేల అడుగుల ఎత్తు నుంచే అది స్పష్టంగా కనిపిస్తుంది. దగ్గర నుంచి చూస్తే ఏవో గీతల్లా అనిపిస్తుంది. బిల్ ప్రయాణించడానికి కొద్ది క్షణాల ముందే ఇదహో నేషనల్ ఎయిర్ గార్డ్ పైలట్లు కూడా ఆ మార్గంలో ప్రయాణించారు. వారికి కూడా అవి కనిపించలేదు. ఇంతలోనే ఆ ఆకారం ఎలా వచ్చిందనేది అధికారులకు అర్థం కాలేదు. ఈ గీతలను దగ్గర నుంచి పరిశీలించగా.. మనుషుల అడుగులేవీ కనిపించలేదు. అది ఎవరు గీసి ఉంటారో అర్థం కాలేదు. ఆధారాల కోసం ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. 3 అంగుళాల లోతు, 9 అంగుళాల వెడల్పుతో నాగలితో తవ్వినట్లుగా ఆ గీతలు ఉన్నాయి. అక్కడ పరిశోధనలు చేసిన కొంతమంది అది మానవ నిర్మితం కాదని, గ్రహాంతరవాసులే ఆ పని చేసి ఉంటారని వెల్లడించారు.
ఆ వీడియోలో ఓ బృందం కర్రలు, సైకిల్ చక్రాన్ని వాడుతూ సరస్సులో శ్రీచక్రాన్ని గీస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అయితే, అది ఫేక్ వీడియో అని, ఆ క్రెడిట్ తమ సొంతం చేసుకొనేందుకే వాళ్లు ఈ వీడియోను సృష్టించారని పరిశోధకలు కొట్టిపడేశారు. అది మానవుల వల్ల సాధ్యం కాదని, అంత పెద్ద డిజైన్‌ను ఖచ్చితంగా అంచనా వేస్తూ నలుగురు మనుషులు అరగంట వ్యవధిలో ఎలా గీస్తారని ప్రశ్నించారు. అయితే, ఆ వీడియోలో బృందం హెలికాప్టర్లను కూడా వాడుతున్నట్లుగా కనిపించింది. సైన్యం పహారా ఉండే ఆ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా హెలికాప్టర్ ఎలా ఉపయోగించారనే సందేహాలు వచ్చాయి. హిందూ ధర్మానికి ప్రచారం కల్పించడం ఇష్టం లేక అమెరికానే ఈ ఫేక్ వీడియో సృష్టించి ఉండవచ్చని వాదించారు. కాలక్రమేనా ఆ శ్రీచక్రం కనిపించకుండా పోయింది. ముంచు, ఇసుక కమ్మేయడం వల్ల ఆ ప్రాంతంలో శ్రీచక్రం కనుమరుగైంది.

అదే ఏడాది సెప్టెంబరు 15న ఆ ప్రాంతాన్ని సందర్శించిన ఇద్దరు పరిశోధకులు డాన్ న్యూమాన్, ఎల్లెన్ డెకర్‌లు కొన్ని ఆసక్తికర విషయాలను వివరించారు. ఆ ప్రాంతంలో ఎలాంటి మిషన్లు, టైరు మార్కులు కనిపించలేదని తెలిపారు. కేవలం తాము ప్రయాణించిన వాహనం గుర్తులు మాత్రమే అక్కడ కనిపించాయన్నారు. అక్కడ నిలుచుని చూస్తుంటే తమకు శ్రీచక్రం కనిపించలేదని.. అది కేవలం కొన్ని వందల అడుగుల ఎత్తు నుంచి మాత్రమే స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. అంత పెద్ద శ్రీచక్రాన్ని గీయాలంటే భారీ సంఖ్యలో తాళ్లు, యంత్రాలు అవసరం అవుతాయన్నారు.
అక్కడ శ్రీ యంత్రాన్ని ఎలా నిర్మించారు? మనుషుల వల్ల సాధ్యమా, కాదా అని తెలుసుకోడానికి పరిశోధకులు ముందుకొచ్చారు. ఇందుకు కనీసం రూ.10 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు. అయితే, ప్రభుత్వం ఇందుకు ముందుకు రాలేదు. ఫలితంగా దీనిపై మరింత లోతుగా పరిశోధనలు కొనసాగలేదు. ఓరేగాన్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జేమ్స్ డెడ్రూఫ్ రాసిన రీసెర్చ్ పేపర్లో శ్రీచక్రం గురించి ‘‘శ్రీచక్ర తయారీకి మానవతీత శక్తులు శ్రమించాయని పేర్కొన్నారు. యూఎఫ్ఓ లేదా అతీంద్ర శక్తులే దీన్ని రూపొందించాయి. ఈ ఆధ్యాత్మిక ఘటన గురించి అమెరికా ప్రభుత్వం తమ ప్రజలకు ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.

శ్రీచక్రం అంటే ఏమిటీ? ఎందుకంత ప్రాధాన్యం?
త్రిమూర్తులకు దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తులను ఆ జగన్మాత లేదా పరాశక్తి అందిస్తోందనే విశ్వాసం ఉంది. శ్రీచక్రాన్ని శివశక్తుల సంయోగంగా భావిస్తారు. ఈ చక్రం మధ్యలో ఉండే బిందువు నుంచి సమస్తలోకాలు, భూతాలు పుట్టినవని అంటారు. శ్రీ చక్రాన్ని శ్రీచక్ర రాజం అంటారు. శ్రీ చక్రాన్ని తొమ్మిది విభాగాలుగా పూజిస్తారు. ఇందులో త్రిభుజాలు మొత్తం తొమ్మిది ఉన్నందున దీనిని నవ చక్రం అని కూడా పిలుస్తారు. ‘శ్రీ’ అనేది మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి సంబంధించిన సంయుక్తాక్షరం అని అంటారు. శ్రీ యంత్రంలేని పూజ వలన ప్రయోజనం ఉండదని అంటారు. అందుకే, దాదాపు అన్ని పూజల్లో శ్రీచక్రాన్ని ఉంచుతారు. ప్రతి దేవాలయంలో దైవ విగ్రహాల ఏర్పాటు కోసం ముందుగా యంత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. శ్రీ చక్రాన్ని బంగారం, వెండి, రాగి, ఇలా ఏడు లోహాలను కలిపి తయారు చేస్తారు.
శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టడం వల్ల ధనధాన్యాలు వృద్ధి చెందుతాయని, అకాల మృత్యువు నుంచి రక్షణ లభిస్తుందని భావిస్తారు. ఏది ఏమైనా శ్రీచక్రం వంటి పవిత్రమైన యంత్రం అమెరికాలో అంత భారీస్థాయిలో ప్రత్యక్షం కావడం నిజంగా ఆశ్చర్యమే కదూ.
Related Temples:
పూరీ జగన్నాథ్ దేవాలయం యొక్క అంతుచిక్కని రహస్యాలు

oregon sri chakra mystery, sri yantra: the oregon desert mystery documentary, sri chakra images, oregon sri yantra in hindi, yantra mandala, meru chakra, sri chakra usa location, shree yantra image, sri chakra usa tamil, america sri chakram, sri chakram yantram america.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS