Bhagavad Gita 7th Chapter 11-20 Slokas and Meaning in Telugu | సరళమైన తెలుగు లో భగవద్గీత 

శ్రీమద్ భగవద్ గీత సప్తమోఽధ్యాయః
అథ సప్తమోఽధ్యాయః |

బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ |
ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ ‖ 11 ‖


భావం : బలవంతులలో ఆశ,అనురాగం లేని బలాన్ని నేను. ప్రాణాలలోని ధర్మవిరుద్ధం కానీ కామాన్ని నేనే.

యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే |
మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి ‖ 12 ‖
భావం : సాత్వీక, రాజసిక, తమాసిక భావనలన్నీ నా వల్లనే కలిగాయని తెలుసుకో. వాటిలో నేను లేను. నాలో అవివున్నాయి. 

త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ |
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ ‖ 13 ‖
భావం : ఈ మూడు గుణాల ప్రభావంవల్ల ప్రపంచమంతా భ్రమచెంది, వాటికంటే విలక్షణుడిగా, వినాశం లేనివాడిగా నన్ను గ్రహించలేకపోయినది.

దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా |
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే ‖ 14 ‖
భావం : త్రిగుణ స్వరూపమైన ఈ నా దైవమాయను దాటడం సామాన్యులకు సాధ్యపడదు. అయితే నన్నే ఆశ్రయించినవాళ్ళు దానిని అతిక్రమిస్తారు.

న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః |
మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః ‖ 15 ‖
భావం : పాపాత్ములు, మూఢులు, మానవాధములు మాయలోపడి వివేకం కోల్పోయినవాళ్ళు, రాక్షసభావాలను ఆశ్రయించినవాళ్ళు నన్ను పొందలేరు.

చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోఽర్జున |
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ‖ 16 ‖
భావం : అర్జునా! నన్ను సేవించే పుణ్యపురుషులు నాలుగు రకాలు, ఆపదలో వున్నవాడు, ఆత్మతత్వం తెలుసుకోగోరేవాడు, సిరిసంపదలు కోరేవాడు. ఆత్మజ్ఞానం కలిగినవాడు.

తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే |
ప్రియో హి జ్ఞానినోఽత్యర్థమహం స చ మమ ప్రియః ‖ 17 ‖
భావం : ఈ నలుగురిలో నిత్యమూ భగవంతుణ్ణి భక్తితో భజించే ఆత్మజ్ఞాని ఆత్యూత్తముడు. అలాంటి జ్ఞానికి నేను, నాకు అతనూ నేను ఎంతో ప్రియులం కావడమే దీనికి కారణం.

ఉదారస్సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మవ మే మతమ్ |
అస్థిత స్సహి యుక్తత్మా మామేవానుత్తమం గతిమ్ || 18 ||
భావం : వీళ్ళంతా గొప్పవాళ్ళే అయినప్పటికీ జ్ఞానిమాత్రం నా ఆత్మ స్వరూపుడే అని నా అభిప్రాయం. ఎందువల్లనంటే అతను నన్నే పరమగతిగా భావించి సేవిస్తాడు. 

బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే |
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ‖ 19 ‖
భావం : అనేక జన్మలలో ఆచరించిన పుణ్యకర్మల ఫలితంగా జ్ఞాని చివర జగత్తు సర్వమూ వాసుదేవమయము అనే జ్ఞానంతో సన్నాశ్రయిస్తాడు. ఈ లోకంలో అలాంటి మహానుభావులు చాలా అరుదు. 

కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేఽన్యదేవతాః |
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా ‖ 20 ‖
భావం : తమ తమ పూర్వ జన్మల సంస్కారాలకు సంబంధించిన కోరికల మూలంగా వివేకం కోల్పోయిన కొందరు, ఇతర దేవతలను వాళ్ళకు తగిన నియమాలతో ఉపాసిస్తున్నారు. 

7వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 7th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS