Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 25th Question


25th Question :
ప్రశ్న ) నాకు తెలియకుండా ఎన్నో చిక్కులో పడ్డాను. ఇప్పుడు గమ్యం శూన్యంగా ఉంది. బయటపడే మార్గమే  కనపడటం లేదు. అస్సలు ఆలోచించే ఓపిక కూడా నాకు కరువైంది. కనపడ్డవస్తువుల్లా నాకే కావాలనీ నా ఇష్టానికి అడ్డువస్తే అతణ్ణి సర్వనాశనం చేయాలని ఒకే ఆవేశం. నా మనస్సు నాకే అర్ధం కావడం లేదు. ఏదో అశాంతి. ఏదో ఆదుర్దా. నాకెలా ప్రశాంతి లభిస్తుంది. 


రాగద్వేషవిముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ |
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ‖ (2వ అ - 64వ శ్లో )

ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే |
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే ‖ (2వ అ - 65వ శ్లో )


జవాబు : మి చిక్కులకన్నీటికి రెండే కారణాలు. ఒకటి రాగం. రెండవది ద్వేషం. ఈ రెండిటితోనే మీరు సతమతమౌతున్నారు. మిలొ అశాంతి అలముకుంది. మనస్సును నిగ్రహించండి. ఇంద్రియాలను స్వాధీనపరచుకోండి. రాగద్వేషాలు లేకుండా అనుకోకుండా లభించిన విషయ సుఖాలు మీరు పొందిన మనశ్శాంతికి కరువుండదు. ప్రసన్నమైన, నిర్మలమైన, మనస్సుంటె అన్నీ దుఃఖాలు వాటంతట అవే పోతాయి. ప్రసన్నమైన మనస్సు కలవాడికి స్థిరమైన బుద్ది కలుగుతుంది. అప్పుడు మిలొ ఆవేశాలకు,  ఆదుర్దాలకు చోటుండదు. ఏది చేసిన చక్కగా ఆలోచించి చేస్తారు. రాగద్వేషాల ప్రభావం మీమీద లేదు కాబట్టి మీకు ప్రశాంతికి లోటుండదు. 


తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 



శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

 bhagavad gita in telugu, bhagavad gita solutions, bhagavad gita pdf download, bhagavad gita online quiz, bhagavd gita questions and answers hindu temples guide bhagavad gita.

Comments