Drop Down Menus

గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా ఎలా మారిందో తెలుసా ? | Amazing Facts Behind Goddess Lakshmi's Riding an Owl

మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినపుడు ఆమెకు గుడ్లగూబ వాహనంగా ఉండటాన్ని చూస్తుంటాం. లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనమయ్యింది? అనే ప్రశ్న మనల్ని పట్టి పీడిస్తుంది. దానికి సమాధానంగా పురాణాలలో ఓ కథ కనబడుతోంది.
పూర్వం కౌశికుడు అనే విష్ణు భక్తుడు ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. తన భక్తితో విష్ణుమూర్తిని మెప్పించి ప్రసన్నం చేసుకున్నాడు. అయితే ఆ విష్ణు భక్తుడు మరణించిన తరువాత వైకుంఠానికి చేరుకోగా శ్రీమహావిష్ణువు అతడితో సంగీత సభను ఏర్పాటు చేసాడు కానీ నారదుడికి మాత్రం ఆ సభకి వెళ్ళడానికి ప్రవేశం లభించలేదు. దాంతో నారదుడు లక్ష్మీదేవిని శపించగా అప్పుడు వారు ప్రత్యేక్షమై నారదుడు పశ్చత్తాప పడేలా చేస్తారు. మరి శ్రీమహావిష్ణువు నారదుడు సంగీతం నేర్చుకోవడానికి ఎలాంటి ఉపాయాన్ని చెప్పాడు? నారదుడు సంగీతాన్ని నేర్చుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అతడు తన గతజన్మ గురించి ఏమని చెప్పాడు? గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా ఎలా మారిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వం శ్రీ మహావిష్ణువు భక్తుడైన కౌశికుడు గొప్ప సంగీత విద్వాంసుడు. ఈ విష్ణు భక్తుడు తన సంగీతంతో శ్రీమహావిష్ణువుని మెప్పించి ప్రసన్నం చేసుకున్నాడు. ఇలా అతడు మరణించిన తరువాత వైకుంఠానికి చేరుకోగా అప్పడు శ్రీమహావిష్ణవు ఆ భక్తుడిని స్వాగతించి గౌరవార్థం ఒక సంగీత సభని ఏర్పాటుచేస్తాడు. అయితే త్రిలోక సంచారైనా నారదుడు ఈ సభకి వెళ్లడం అనుకోగా అతడికి ఈ సభలోకి రావడానికి అనుమతి లభించలేదు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన నారదుడు లక్ష్మీదేవి మందిరం నుండి వెళ్ళడానికి ప్రయత్నించగా లక్ష్మీదేవి చెలికత్తెలు నారదుడిని అడ్డుకోగా ఆగ్రహానికి గురైన నారదుడు లక్ష్మీదేవిని శపిస్తాడు.
ఆ సమయంలో శ్రీమహావిష్ణువు నారదుడితో, నారద కపట భక్తితో ఎన్ని తీర్దాలు సేవించనప్పటికీ అది వ్యర్థం, భక్తిశ్రద్ధలతో నన్ను కొలిచినవారికి నేను ఎప్పుడు వెన్నంటి ఉంటాను, సంగీతంతో కూడా నన్ను చేరవచ్చు అని తెలియచెప్పడానికే నేను అతడిని సత్కరించాను. నీ శాపానికి మేము బాధపడటంలేదు, దాని కారణంగా మంచే జరుగుతుందని చెప్పడంతో, నారదుడు చాలా బాధపడుతూ, దేవా నన్ను క్షమించు అసలు జ్ఞానము లేకుండా మూర్ఖంగా ప్రవర్తించాను అంటూ శ్రీమహావిష్ణువు పాదాల పైన పడి వేడుకున్నాడు. ఇక శ్రీమహావిష్ణువు నారద చింతించకు నీకు నిజంగా సంగీతం నేర్చుకోవాలనే కోరిక ఉంటె ఇక్కడ ఉత్తరాన మానససరోవరం అవతల ఒక పర్వత శిఖరం ఉంది. అక్కడవున్న ఉలూకపతి దగ్గర నేర్చుకోమని చెప్పగా నారదుడు శ్రీమహావిష్ణువు నమస్కరించి ఆ పర్వత శిఖరానికి బయలుదేరుతాడు.
ఇక నారదుడు తన మనసులో నాకు తెలియని ఆ సంగీత విద్వంసుడు ఎవరు అని ఆలోచిస్తూ అక్కడికి చేరుకోగానే గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరాసాదులెందరో అక్కడ సంగీత విద్యాబ్యాసం చేస్తున్నారు. అక్కడే నారదుడు వారికీ గురువైన గానబంధుని చూసాడు. నారదుడు అతడికి నమస్కారం చేసి, కౌశికుడు తన సంగీతం తో శ్రీమహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు అలాంటి సంగీత విద్యని నాకు నేర్పిచండని అడిగాడు. అప్పుడు గానబంధువుకి నారదుని మనసులో ఏమున్నదో అర్థమైంది. దీంతో అసలు తాను ఎవరనేది వివరించడం మొదలుపెట్టాడు. పూర్వం భువనేషుడు అనే రాజు ఉండేవాడు. అతడు ప్రజలను అన్ని విషయాల్లో బాగా చూసుకునే ఆ రాజు ఒక సంగీతంలో మాత్రం రాజ్యంలో ఒక షరతు పెట్టాడు. తన రాజ్యంలో సంగీతాన్ని నిషేధించాడు. ఎవరైనా రాజ్యంలో గానం చేస్తే వెంటనే వారికీ మరణ శిక్షని అమలుచేయండి అంటూ మంత్రులకి ఆదేశాలను కూడా ఇచ్చాడు.
Also Readశ్రీలక్ష్మీపూజ ఇలా చేస్తే ధనమే ధనం 

ఒక రోజు హరిమిత్రుడు అనే వ్యక్తి రాజు అజ్ఞాని మరచిపోయి దేవుడిని తన భక్తిగీతాలతో స్తుతించాడు. అతడి గానానికి అక్కడి ప్రజలు కూడా అన్ని మరచిపోయారు. అప్పుడు వెంటనే భటులు వచ్చి హరిమిత్రుడిని బంధీ చేసి రాజు దగ్గరికి తీసుకువెళ్లగా రాజు బాగా అలోచించి పడిన వాడు బ్రాహ్మణుడు కనుక మరణ శిక్ష విదిస్తే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందని భావించి మరణశిక్షకు సమానమైన రాజ్య బహిష్కారణ చేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ రాజు మరణించి మరు జన్మలో గుడ్లగూబ లాగా జన్మించాడు. దాంతో ఆహారం రాత్రి సమయాలలో మాత్రమే తీసుకోవాలి కానీ ఆ గుడ్లగూబకు ఆహారం సరిగా లభించలేదు. ఇలా ఒక నాలుగు రోజులు వరుసగా ఆహారం లభించకపోవడంతో అది మరణానికి దగ్గరైంది. ఆ సమయంలో యమధర్మరాజు వచ్చి దానికి ఎదురుగా నిలబడి ఉండగా, అప్పుడు ఆ గుడ్లగూబ ఎందుకు యమధర్మరాజా నన్ను ఇలా బాధపెడుతున్నావు, నేను రాజ్యంలో అందరిని బాగా చూస్కున్నాను కదా అని అడుగగా, యమధర్మరాజు, రాజా నీవు రాజ్యాన్ని సరిగానే పరిపాలించవు కానీ భగవంతుడిని వేద మంత్రాలతోనే స్తుతించాలని అనుకోవడం నీ ముర్కత్వం అవుతుంది. నీవు విష్ణు భక్తులకు తెచ్చిన ఆ కీడు నిన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకువచ్చింది అని చెప్పడంతో, అతడు యమా నేను చేసిన ఈ తప్పు నుండి బయటపడే మరాగాన్ని చెప్పాడని అనగా, నీవు చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు, ఒకేవేళ శిక్షాకాలం దగ్గాలంటె ఈ గుహ దగ్గరలోనే నీ గత జన్మ శరీరం ఉంది ఆ శరీరంలోని మాంసాన్ని రోజుకు కొంత చీల్చి తిను అది పురాతయ్యే లోపు నీకు శుభం కలుగుతుందని చెబుతాడు.

ఇలాంటి పరిస్థితి వచ్చిన ఆ పాపిని నేనే నారద, ఇలా నేను నా శరీరాన్ని రోజు తింటూ ఉంటె ఒక రోజు ఒక బ్రాహ్మణుడు నా శవం దగ్గరికి వచ్చి చూసాడు, అతడు ఎవరో కాదు నేను రాజ్యబహిష్కారణ చేసిన హరిమిత్రుడు. అతడు నన్ను గుర్తుపట్టి న దగ్గరికి వచ్చి ఏంటి ఈ పరిస్థితి అని బాధపడుతుండగా, వెంటనే అతని పాదాలపైనా పడి జరిగినదానికి నన్ను క్షమించు నేను భువనేశ రాజుని అంటూ పచ్చత్తపపడి తనకి యముడికి మధ్య జరిగినది అంత వివరించాడు. అప్పుడు హరిమిత్రుడు నీవు నాపైన చూపించిన ఆ మూర్కత్వన్ని ఆ రోజే మరచిపోయాను, నీవు అనుభవించిన బాధలు ఇక చాలు, ఈ రోజు నుండి నీకు బాధ అనేది లేకుండా గొప్ప సంగీత విద్వాంసుడవై అందరికి సంగీతాన్ని బోధిస్తావంటూ పలికెను. ఇలా నేను సంగీత విద్వాంసుడను అయ్యాను అంటూ గానబంధు నారదుడితో వివరించాడు.
ఇక ఇలా చెప్పడంతో నారదుడు అతడి శిష్యుడిగా మారిపోయాడు. సంగీతం అనేది ఒక కళ, దానికోసం జీవితాన్ని అర్పించాలి, ప్రతిక్షణం కస్టపడి సాధన చేస్తే దీనిని సాధించవచ్చు అని వివరించగా నారదుడు దాదాపుగా వెయ్యి సంవత్సరాలు సాధన చేసి 3,60.006 రాగాలలో మంచి ప్రావిణ్యం సాధించాడు. దీంతో సంతోషించిన నారదుడు గురు దక్షిణ ఏంకావాలో అని అడుగగా, శిష్యుడిగా కోరుకోమంటువను కనుక అడుగుతున్నాను, లోకం ఉన్నంతవరకు, సంగీత కళతో పాటుగా నేను కూడా అందరికి గుర్తుండేలా వరాన్ని ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు...
నారదుడు నవ్వుతు గురవయ్య ఇది చాలా చిన్న కోరికనే, మీరు నాకు చేసిన ఈ ఉపకారానికి మీకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవాభాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాధిస్తున్నాను. ప్రళయం సంభవించినప్పుడు శ్రీమహావిష్ణువు కి గరుత్మంతుడి వలె, శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనం అవుదు గాక అని వరాన్ని ప్రసాదిస్తాడు. ఈవిధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైనదని పురాణం.
Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ

హనుమ నామస్మరణం సర్వపాప నివారణం

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము

శనేశ్వరుడు శనివారాల నోము

శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

శివదేవుని సోమవారపు నోము కథ

తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?


picture of goddess lakshmi with owl, lakshmi owl meaning, lakshmi facts, goddess lakshmi and owl story, lakshmi goddess, lakshmi owl name, significance of owl in vastu, goddess lakshmi story, 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments