లక్ష్మీ నివాస స్థానాలు:
మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని శాస్తాల్రు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి... పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్తాల్రు, వెండి, రాగి, ఇత్తడి కలశాలు, ఆవు పేడ, ఆవు పృష్ట స్థానం, ఆవు కొమ్ముల మధ్యన, పూజా మందిరం, పవిత్రమైన మనస్సు, దర్భలు, మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజు, సదాచార బ్రాహ్మణుడు. శ్రీసూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలు ఉన్నాయి.
యః శుచిః ప్రయతో భూత్వా
జుహుయాదాజ్యమన్వహం శ్రియః
పంచదశశ్చంచ శ్రీకామస్సతతం జపేత్
Also Read : శ్రావణ వరలక్ష్మీ వ్రతం: పూజా విధానం, పాటించాల్సిన నియమాలు
లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ, ఆ దేవి 15 మంత్రాలను నిత్యం పారాయణం చెయ్యాలని ఈ మంత్రానికి భావం. శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం కూడా ధనమే.
Also Read : లక్ష్మీ దేవి మీ ఇంటికి వచ్చేముందు మీకు ఈ సంకేతాలు కనిపిస్తాయి
పంచభూతాలకు ప్రతీక:
వరలక్ష్మీ వ్రతంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించాలి. కలశం అమ్మవారికి ప్రతిరూపం. మట్టిపాత్ర లేదా శక్తిని బట్టి వెండి, బంగారు, రాగి, పంచలోహపాత్రలను కలశం కోసం ఉపయోగించవవచ్చు. కలశం కోసం ఉపయోగించేది ఏ లోహమైనా అది పృథ్వీ తత్త్వానికి సంకేతం అందులో పోసే నీరు జల తత్త్వానికి సంకేతం. కలశాన్ని సగం మాత్రమే నీటితో నింపుతారు. మిగిలిన శూన్యస్థితి ఆకాశతత్త్వానికి సంకేతం. మనం చదివే మంత్రం వాయుజనితం. కనుక అది వాయుతత్త్వానికి సంకేతంగా ఉంటుంది. కలశం ముందు ఉంచే దీపం అగ్ని తత్త్వానికి సంకేతం. ఈవిధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాపించి ఉండే పరతత్త్వం, శక్తి స్వరూపమైన అమ్మను ఆరాధించటం కలశారాధనలోని అంతరార్థం.
మన ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చెయ్యాలో శాస్తాల్రు కొన్ని విషయాలు వివరించాయి. అవేమిటంటే...
> ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారు జామునే వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాలి. అందమైన ముగ్గు, శుభ్రమైన వాకిలి లక్ష్మికి స్వాగతం పలుకుతాయి.
> ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు. > ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం తగవులాడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు.
Also Read: గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా ఎలా మారిందో తెలుసా ?
> ఉదయం, సాయంత్రం సంధ్యల్లో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ఇంట్లోని దేవతామందిరంలో, ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యాదీపం పెట్టాలి. ఇలాంటి ఇళ్లలో లక్ష్మి శాశ్వతంగా నివాసం ఉంటుంది.
> అతిగా మాట్లాడే వారు, గురువులను, పెద్దలను అగౌరవ పరిచేవారు, జూదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్నచోట లక్ష్మిదేవి ఉండదు.
> శంఖధ్వని వినిపించని చోట, తులసిని పూజించని చోట, దేవతలను అర్చించని చోట, బ్రహ్మవేత్తలు, అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు.
> చిల్లర పైసలు, అన్నం, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారి దగ్గర లక్ష్మి చేరదు.
> భక్తులను హింసించేవారు, నిందించేవారు ఉన్నచోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు.
Also Read : > శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి
Famous Posts:
> పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శనేశ్వరుడు శనివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> శివదేవుని సోమవారపు నోము కథ
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
lakshmi devi places, goddess lakshmi story, 5 places where goddess lakshmi resides, lakshmi facts, can we keep standing lakshmi idol at home, which lakshmi idol is good for home, goddess lakshmi offerings, which direction should lakshmi face at home, lakshmi statue, friday, lakshmi devi
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment