Drop Down Menus

ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండవలసిన చిత్రపటము | Sri Rama Pattabhishekam | Hindu Temple Guide

ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండవలసిన చిత్రపటము..
శ్రీరామ పట్టాభిషేకం మూర్తి లేని ఇల్లు ఉండకూడదు. ఉండి తీరాలి. ఎందుచేత అంటే ప్రణవాన్ని పిల్లలు, స్త్రీలు, పలకకూడదు.
కానీ ’ఓం’కారాన్ని తీసుకువచ్చి ఇంట్లో పూజ చేయడానికి తేలిక మార్గం ఏమిటంటే శ్రీరామ పట్టాభిషేకం.
పట్టాభిషేకంలో అందరూ ఉన్నా మనం ఇంట్లో పెట్టుకునే పట్టాభిషేక మూర్తిలో నలుగురే ఉంటారు – సీతారాములు, లక్ష్మణస్వామి, కాళ్ళ దగ్గర హనుమ.
రాముడు అకారానికి ప్రతినిధి, 
యో వేదాదౌ స్వరఃప్రోక్తః! వేదాంతేచ ప్రతిష్ఠితః!. 
అకారం విష్ణువు అయితే ఉకార మకారములు లక్ష్మణస్వామి, సీతమ్మ.
’మ్’ అనే నాదస్వరూపం వాయుపుత్రుడైన హనుమ.
అకార ఉకార మకార నాద స్వరూపమైనటువంటి హనుమతో కలిపి ఓంకారమే ఇంట్లో సీతారామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక మూర్తిగా ఉంటుంది. ఆయనకి పూజ చేయడానికి వాళ్ళు చేయవచ్చా? వీళ్ళు చేయవచ్చా? అని అభ్యంతరం ఉండదు. కాబట్టి ఓంకారానికి పూజ చేయడం ఎంత గొప్పదో పట్టాభిషేకానికి పూజ చేయడం అంత గొప్పది.

రాముడికి ఒక్కడికే రెండు పేర్లు ఉంటాయి. వీర రాఘవ, విజయ రాఘవ. ఆయన ఎప్పుడూ కోదండం చేత్తో పట్టుకుంటాడు. అపజయం అన్నది రాముడికి లేదు. రాముడు ఆర్తత్రాణపరాయణుడు. అటువంటి రాముడు ఇంట్లో ఉంటే నిర్భయత్వం. చెడు చేసేవారు ఇంట్లోకి రాలేరు. కానీ పూజకు సంబంధించినంత వరకు పంచాయతనంలో సీతారామచంద్రమూర్తి పట్టాభిషేకమూర్తిని పెట్టుకుని చేయాలి అన్న కోరిక విష్ణువుయందు సమన్వయం చేసుకోవాలి. వేంకటేశ్వరుడు ఉన్నాడు మూర్తిలో. రామచంద్రమూర్తియే వేంకటేశ్వరుడు. అన్నమాచార్యుల వారు ఆయన చేతిలో దశావతారాలూ చూశాడు. అన్నీ వేంకటేశ్వర స్వామివారే. అయినప్పుడు వేంకటేశ్వరుడే రామచంద్రమూర్తి.
మనస్సుతో చూడగలిగినటువంటి శక్తికి ఎదిగి ఉంటే హనుమ ఆయన పాదాల దగ్గర కూర్చున్నట్లు సీతారామలక్ష్మణులు అక్కడ ఉన్నట్లు భావన చేసి వేంకటేశ్వరుడి పాదాల దగ్గర రామచంద్రమూర్తికి సమర్పిస్తున్నట్లు పూజ చేయడం ఉత్కృష్టమైనటువంటి పూజ.
కాదంటే దానికి మార్గం ఏమిటంటే తూర్పు గోడకు పెట్టకుండా దక్షిణానికి తిరిగి మీరు నమస్కారం చేయవలసిన అవసరం రాకుండా రామచంద్రమూర్తి పట్టాభిషేకమూర్తిని ఉంచుకొని ఆ మూర్తి వంక చూసి తులసీ దళాన్ని వేంకటేశ్వరుని పాదాల దగ్గర వేస్తూ ఉండవచ్చు. మీరు ఎవరిని అనుకుని వేస్తారో ఆయనకే పడుతోంది అని భావన చేస్తే చాలు..

సుప్రభాతంలో ’అవనీ తనయా కమనీయకరం’ అని సీతమ్మ తల్లి భర్తగా రామచంద్రమూర్తిగానే వేంకటేశ్వరుడికి. అసలు సుప్రభాతం ప్రారంభం ’కౌసల్యాసుప్రజారామ పూర్వాసంధ్యాప్రవర్తతే! ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్!!’

రాముణ్ణి విశ్వామిత్రుడు ప్రత్యక్షంగా నిద్రలేపాడు. ఆ శ్లోకంతో ప్రారంభం. ఆ రాముడే వేంకటేశ్వరుడిగా లోపల నిలబడి ఉన్నాడు. ఇప్పటికీ ఆనందనిలయ విమానంలో స్వామివారి ప్రక్కన ఉన్న వేదిక మీద రామచంద్రమూర్తి యొక్క మూర్తి ఉంది. త్రిభంగి స్వరూపంగా కోదండం పట్టుకొని ఉంటాడు. ఊరేగింపుకు బయటికి వస్తూ ఉంటాడు. కాబట్టి వేంకటేశ్వరుడే రాముడు. చూడగలిగి పూజ చేస్తే మంచిది. కాదు మాంసనేత్రంతో కూడా అలా చూసి చేయాలని ఉంది అంటారా తప్పు అనను.
పట్టాభిషేకమూర్తిని ఒక చోట పెట్టుకోండి. ఆయన వంక చూస్తూ ఈయన పాదాలమీద తులసీదళం వేయండి. సంప్రదాయానికీ భంగం రాదు. మనస్సులో కోరిక తీరడానికీ ఇబ్బంది రాదు. అలా పూజామందిరాన్ని నిర్వహించుకోండి.
Famous Posts:
స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము

శనేశ్వరుడు శనివారాల నోము

శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

శివదేవుని సోమవారపు నోము కథ

తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

sri rama pattabhishekam, sri rama pattabhishekam in telugu pdf, sri rama pattabhishekam story, sri rama pattabhishekam songs, sri rama pattabhishekam hd wallpapers, sri rama pattabhishekam painting, sri rama pattabhishekam slokas in telugu, sri rama pattabhishekam story in telugu, sri rama pattabhishekam videos, sri rama images, sri rama, 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.