Drop Down Menus

చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు | Super Healthy Seeds You Should Eat


రూపు కొంచెం పోషణ ఘనం! చిట్టి చిట్టి గింజల గురించైతే ఇలాగే చెప్పుకోవాలి. చూడటానికివి చిన్నగానే ఉండొచ్ఛు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించటం దగ్గర్నుంచి ఇన్ ఫెక్షన్లతో పోరాడటం, గ్లూకోజు స్థాయులను స్థిరంగా ఉంచటం వరకూ ఎన్నెన్నో లాభాలు చేకూర్చుతాయి. గింజలు, విత్తనాల్లో మనకు మేలు చేసే కొవ్వులతో పాటు పీచు, రకరకాల యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి. ఒకింత ప్రొటీన్ సైతం లభిస్తుంది. అలాగని అన్ని గింజలూ ఒకటి కావు. ప్రతీదీ ప్రత్యేకమైనదే.

అవిసె గింజ‌ల‌తో ఆరోగ్య‌మే కాదు.. అంద‌మైన మోము కూడా సొంత‌మ‌వుతుంది.
మనకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అరుదుగా లభిస్తాయి. అవిసె గింజల్లో మాత్రం అవి ఎక్కువగా ఉంటాయి. ఇతర అత్యవసర పోషకాలు కూడా లభిస్తాయి. అవిసె గింజల్లో మనకు కావాల్సినంత ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, ఒమేగా-3 ఫ్యాట్టీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన చర్మం, జుట్టుతోపాటూ ఇతర శరీర భాగాలకు ఎంతో మేలు చేస్తాయి.

అవిసె గింజల్లో నీటిలో కరిగే, కరగని... రెండు రకాల ఫైబర్స్ ఉంటాయి. అవి మన పెద్ద పేగు పాడవకుండా కాపాడతాయి. కొవ్వు కరిగిస్తాయి. చక్కెర నిల్వలను తగ్గిస్తాయి.

అవిసె గింజల్లో ఆరోగ్య కర ఫ్యాట్స్, ఫైబర్ (పీచు పదార్థం) ఉంటాయి. అవి మనకు ఎక్కువ సేపు ఆకలి వెయ్యకుండా చేస్తాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునేవాళ్లు అవిసె గింజలు తినాలి. కడుపులో మంటల్ని కూడా ఇవి తగ్గిస్తాయి.

మన శరీరంలో ఆరోగ్యం సరిగా లేకపోతే... చర్మంపై రకరకాల సమస్యలు వస్తాయి. అవిసె గింజలు తింటే లోపలి ఆరోగ్యం సెట్ అవ్వడమే కాదు... రకరకాల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అలాగే కొత్త చర్మ కణాలు కూడా పుట్టుకొస్తాయి.

అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాట్టీ యాసిడ్స్‌ని అల్ఫా-లైనోలెనిక్ యాసిట్ (ALA) అంటారు. ఇవి బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

చర్మంపై దద్దుర్లు, దురదలు, వాపులు, నొప్పులు, కందిపోవడం వంటివి పోవాలంటే, అవిసె గింజలు తినాలి. ఇలాంటి సమస్యల్ని అవిసె గింజలు త్వరగా పోగొడతాయి.

ఇటీవ‌లి కాలంలో అబ్బాయిల‌కు బ‌ట్ట‌త‌ల సమ‌స్య బాగా పెరిగిపోతోంది. మీక్కూడా ఇలాంటి స‌మ‌స్యే ఉంటే మీరు రోజూ అవిసె గింజ‌లు తీసుకోవ‌డం మంచిది. దీనివ‌ల్ల మీకు మంచి ప్ర‌యోజ‌నం ఉంటుంది. బ‌ట్ట‌త‌ల‌కు దారితీసే ఎంజైమ్‌ల‌తో పోరాడి బ‌ట్ట‌త‌ల‌ను అడ్డుకుంటాయి అవిసె గింజ‌లు.

అవిసె గింజ‌ల్లోని ఒమెగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టులో తేమ‌ను పెంచి అవి తేమ‌తో నిండి ఉండి సిల్కీగా క‌నిపించేలా చేస్తాయి. అందుకే జుట్టు స‌మ‌స్య‌లున్న‌వారు వీటిని త‌ప్ప‌క తీసుకోవాల్సిందే.
ఒక చెంచా గింజలతో 3 గ్రాముల పీచు లభిస్తుంది. ఇది మలబద్ధకం తలెత్తుకుండా చూస్తుంది. రోజుకు 3 చెంచాల చొప్పున 3 నెలల పాటు అవిసె గింజలు తీసుకున్నవారిలో మొత్తం కొలెస్ట్రాల్ 17%, చెడ్డ కొలెస్ట్రాల్ 20% మేరకు తగ్గినట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇవన్నీ అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బుల వంటి సమస్యలు తలెత్తకుండా కాపాడుతున్నాయనే సూచిస్తున్నాయి.

గుమ్మడి గింజలు తింటే జీవితకాలం పెరుగుతుందా...?
పోషకాల పరంగా వీటిని మించిన గింజలు లేవనే చెప్పుకోవాలి. అన్ని ఆరోగ్య సమస్యలను దూరం చేసే ఒక అద్భుత ఔషధం గుమ్మడి గింజలు. గుమ్మడి ఘుమఘుమలు లేని వంటిల్లు ఉంటుందా? గుమ్మడి పండు తగిలించిన తెలుగిళ్లు ఉంటుందా? ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి... గుమ్మడితో పోతాయి.  ఇటు వంటలకు అద్భుతమైన రుచి, అటు అనారోగ్యాలకు అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడే ఈ గుమ్మడిని ఉపయోగించేటప్పుడు గుమ్మడికాయను కట్ చేసుకొని, గింజలను పారేస్తుంటారు.

ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఆర్థరైటీస్, గుండె సంబంధిత వ్యాధులు, మరియు క్యాన్సర్ వంటి జబ్బులతో బాధపడుతుంటారో అటువంటి వారికి, ఈ ఆరోగ్యకరమైన గుమ్మడి గింజలు బాగా సహాయపడుతాయి. వీటిని వారి యొక్క రెగ్యులర్ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. గుమ్మడి గింజలను వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. గింజలను ఒలిచి లోపల ఉన్న పప్పును తినవచ్చు. లేదా దంచి లోపల ఉన్న పప్పును పొడి చేసి, పాలలో మిక్స్ చేసి తీసుకోవచ్చు. లేదంటే, రోజంతా అప్పుడప్పుడు గుమ్మడి గింజలను కొరుకుతుండటం కూడా అరోగ్యకరమే.

పావు కప్పు గుమ్మడి గింజలు తీసుకుంటే మనకు రోజుకు అవసరమైన మెగ్నీషియంలో 37% పొందినట్టే. కండరాలు విశ్రాంతి పొందటానికి మెగ్నీషియం చాలా అవసరం. రక్తపోటును, గ్లూకోజు స్థాయులను నియంత్రించటంలో.. ఎముకలు ఆరోగ్యంగా ఉండటంలోనూ ఇది పాలు పంచుకుంటుంది. వీటిలోని కెరొటినాయిడ్లు, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు విశృంఖల కణాల దుష్ప్రభావాల నుంచి కాపాడతాయి. నెలసరి నిలిచిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గటానికీ గుమ్మడి గింజలు తోడ్పడుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిల్లోని జింక్ వీర్యకణాలు చురుకుగా, ఆరోగ్యంగా ఉండటానికి ఎంతగానో తోడ్పడుతుంది.

గుమ్మడి గింజలను వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. గింజలను ఒలిచి లోపల ఉన్న పప్పును తినవచ్చు. లేదా దంచి లోపల ఉన్న పప్పును పొడి చేసి, పాలలో మిక్స్ చేసి తీసుకోవచ్చు. లేదంటే, రోజంతా అప్పుడప్పుడు గుమ్మడి గింజలను కొరుకుతుండటం కూడా అరోగ్యకరమే.

కాలరీలు తక్కువా, బెనిఫిట్స్ ఎక్కువా ఉన్న ఈ సూపర్ ఫుడ్ ని తీసుకోవడం మిస్ చేయకండి. క్రంచీ గా ఉండే ఈ సీడ్స్ సలాడ్స్, సూప్స్ లో కూడా బావుంటాయి. మీరు ఎలా తీసుకున్నా, తీసుకోవడం మాత్రం మర్చిపోకండి.

రోజూ గుప్పెడు నువ్వులు తింటే శరీరానికి ఎంతో మేలు..!
భారతీయులు నువ్వులను ఎంతోకాలం నుంచి పలు వంటల్లో ఉపయోగిస్తున్నారు. నువ్వుల నుంచి తీసిన నూనెతో అనేక వంటకాలు చేసుకోవచ్చు. అలాగే నువ్వులను పలు సాంప్రదాయ ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. అయితే నిజానికి నువ్వుల్లో మన శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. ఈ క్రమంలో నిత్యం ఒక గుప్పెడు నువ్వులను తింటే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. శరీరానికి శక్తినివ్వటంలో వీటిని మించినవి లేవు.

నిత్యం గుప్పెడు (30 గ్రాములు) నువ్వులను తింటే వాటితో మనకు 3.5 గ్రాముల ఫైబర్ అందుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్లు, టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉంటాయి. వీటిల్లో కొవ్వు దండిగా ఉంటుంది మరి. అంతేకాదు.. పీచు, ఐరన్ , క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలెన్నో ఉంటాయి. వీటిని 3 చెంచాలు తీసుకున్నా చాలు. మనకు రోజుకు అవసరమైన జింక్ మోతాదులో 22-31%, ఐరన్ మోతాదులో 23% పొందినట్టే. వృద్ధాప్య ఛాయలు త్వరగా ముంచుకురాకుండా చూడటానికీ నువ్వులు తోడ్పడతాయి. విశృంఖల కణాల అనర్థాల నుంచి కాలేయాన్ని కాపాడటంలోనూ పాలు పంచుకుంటాయి. వీటిల్లోని లిగ్నాన్లు, ఫైటోస్టెరాల్ వంటి పీచు, వృక్ష రసాయనాలు పెద్దపేగు క్యాన్సర్ నివారణకూ దోహదం చేస్తాయి. పీచు, కొవ్వు ఆమ్లాలు పేగులు సాఫీగా కదిలేలా చేస్తూ.. మలబద్ధకం దరిజేరకుండానూ చూస్తాయి. నులి పురుగుల వంటి వాటిని నిర్మూలించి, జీర్ణక్రియ సజావుగా సాగటంలోనూ నువ్వులు కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి చేసే మరో మంచి పని ఎముక పుష్టిని పెంచటం. దీనికి కారణం వీటిల్లో క్యాల్షియం, జింక్ పెద్దమొత్తంలో ఉండటమే.

నువ్వుల విత్తనాలనుండి తీసిన నూనెలో శక్తి వంతమైన పదార్థాలు అధిక రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను, మధుమేహ వ్యాధి గ్రస్తులలో ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది.

నువ్వులు తినడం వల్ల ఉబ్బసం వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తనాళాలు, ఎముకలు, కీళ్లు సక్రమంగా పనిచేసేలా నువ్వులు తోడ్పడుతాయి. వీటిలో సెసమాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె వ్యాధుల నుంచి కాపాడుతుంది.

‘పొద్దు తిరుగుడు’ గింజల్ని తినటం వల్ల అనేక ప్రయోజనాలు..
పొద్దుతిరుగుడు గింజలు.. వీటి గురించి చాలా తక్కువమందికి తెలుసు. కానీ, ఈ గింజలు తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. పొద్దుతిరుగుడు గింజలనుండి తీసిన నూనె ఆహారయోగ్యమైన వంటనూనె. అయితే మనలో అధిక శాతం మంది పొద్దు తిరుగుడు విత్తనాలతో తయారు చేసిన నూనె (సన్ ఫ్లవర్ ఆయిల్‌)ను వంటల్లో వాడుతుంటారు. సన్ ఫ్లవర్ ఆయిల్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.

సాధారణంగా మనలో ఎక్కువ మంది తీరిక వేళల్లో గానీ లేదా సాయంత్రం స్నాక్స్ తినే సమయాల్లో గానీ జంక్ ఫుడ్‌ను లేదా నూనె ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తింటుంటారు. వీటి వల్ల చేజేతులారా ఆరోగ్యాలను నాశనం చేసుకుంటుంటారు. కాగా సాయంత్ర వేళల్లో తీనే స్నాక్స్ బదులు పొద్దు తిరుగుడు గింజలను స్నాక్స్ రూపంలో తీసుకుంటే, వాటి వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి.

కాస్త తియ్యగా, పప్పు పదార్థంతో ఉండే సీడ్స్… స్నాక్స్‌గా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాయి. వాటి టేస్ట్ ఎంతో మందికి నచ్చుతోంది. కేలరీలతోపాటూ… ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ మన ఆరోగ్యాన్ని పెంచుతున్నాయి. ఈ విత్తనాల్ని పొద్దు తిరుగుడు పువ్వు మధ్యలో నుంచీ సేకరిస్తారు.ఇవి బూడిద రంగులో లేదా నలుపు రంగులో ఉంటాయి. నీటి బిందువు ఆకారంలో కనిపిస్తాయి. సైంటిఫిక్‌గా మూడు రకాల సన్‌ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. అవి లైనోలెయిక్, హైలీ ఒలెయిక్, న్యూసన్. విత్తనాల్లోని మోనోశాచురేటెడ్, శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఆధారంగా వాటిని విభజించారు.

ఇందులో ఉండే ఇన్సులిన్‌ నిరోధానికి సాయపడుతూ మధుమేహం రాకుండా అడ్డుకుంటాయి. పొద్దుతిరుగుడు గింజలు థైరాయిడ్‌ను దరిచేరనివ్వదు. అదే విధంగా.. క్యాన్సర్‌ని అడ్డుకునే గుణాలు పొద్దుతిరుగుడు గింజల్లో ఎక్కువగా ఉంటాయి. పొద్దుతిరుగుడు విత్తనాలను రోజూ తింటే రక్తనాళాల్లో ఉండే కొవ్వు తగ్గుతుంది. దీంతో గుండెజబ్బులు రాకుండా ఉంటాయి. ఈ విత్తనాల్లోని మెగ్నీషియం ఎముకలు గట్టిపడేందుకు ఉపయోగపడుతుంది. ఎముకల జాయింట్లు బాగా పనిచేసేలా ఈ గింజల్లోని కాపర్ సహకరిస్తుంది. అలాగే వీటిని తినడం వల్ల హైబీపీ కంట్రోల్‌లో ఉంటుంది.

వీటిని తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. మన చర్మానికి అత్యంత ప్రయోజన కారకాలు. ముఖ్యంగా విటమిన్ E స్కిన్ డ్యామేజ్ నుంచీ కాపాడుతుంది. చర్మం మెరిసేలా చేస్తుంది.జుట్టుకు అవసరం. మన వెంట్రుకలకు కావాల్సిన సెలెనియం, ప్రోటీన్స్, విటమిన్ ఈ, బీ వంటి వాటిని జుట్టు కోరుకుంటుంది.ఈ గింజలు తిని మనం వాటిని అందించవచ్చు. ఫలితంగా జుట్టు బాగా పెరిగి… హెయిర్ లాస్ అరికట్టవచ్చు. జుట్టు తెల్లబడే సమస్యకు కూడా ఈ గింజలు చక్కటి పరిష్కారం అవుతాయి.
Famous Posts:
Benefits Of Flax Seeds, Avise ginjalu uses, Flax seeds in Telugu, Avise ginjalu in english, అవిసె గింజలు ఉపయోగాలు, sunflower seeds side effects, sunflower seeds price, sunflower seeds nutrition, sunflower seeds health benefits, how to eat sunflower seeds, sesame seeds, white nuvvulu in english, nuvvulu in hindi, sesame seeds in telugu, pumpkin seeds , gummadi seeds, pumpkin seeds benefits
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.