Drop Down Menus

లక్ష్మీ దేవి మీ ఇంటికి  వచ్చేముందు మీకు ఈ సంకేతాలు కనిపిస్తాయి | What are signs that you will be rich?

జీవితంలోని అవసరాలను, ఆపదలను తొలగించాలన్నా, ఆనందంగా ఉండాలన్నా ధనం చాలా అవసరం. ఎందుకంటే అవసరాలకు చాలా ముఖ్యమైనది ధనం కాబట్టే. ఈ కాలంలో ఏ విషయం చేయాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ధనం ఉండాలి.
కొన్ని అవసరాలను ధనం తీర్చకపోయిన చాలావరకూ సమకూర్చేది ధనమే. అందుకే చాలామంది సంపదను పెంచుకోవడానికి శ్రద్ధ చూపుతుంటారు.

అలాంటి సంపదకు కొరత లేకుండా ఉండాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. అంతేకాకుండా ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెట్టే ఇళ్లంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం. ముగ్గు పెట్టే వాకిట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటారని శాస్త్రంలో చెప్పబడుతోంది. ప్రతిరోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని పూజా మందిరంలో దీపం పెట్టితే లక్ష్మీదేవి అమ్మవారికి ఆనందం కలుగుతుంది.
గుమ్మంలో నుండి చూస్తే పెరట్లో అరటి చెట్టు, తులసి మెుక్క కనిపిస్తే ఇక లక్ష్మీదేవి ఆ ఇంట్లో తప్పకుండా ఉంటారు. కుటుంబ సభ్యులంతా సఖ్యతతో ప్రశాంతమైన, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతుంటే లక్ష్మీదేవి అక్కడే స్థిరనివాసం చేస్తారని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడింది.

మరి ఇలాంటి తరుణంలో లక్ష్మీ దేవి ఇంట్లోకి రావాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అయితే శ్రీమహాలక్ష్మీ మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి. ఈ సంకేతాలను పసిగడితే డబ్బు ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది.

​కోయిల కూత శుభసూచకం:
కోయిల కూత వినడానిక ఎంత వినసొంపుగా ఉండి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. అంతేకాకుండా కోయిల చేసే ఈ శబ్ధం ధనానికి శుభ సూచికగా చెబుతారు. కోయిల కూసే దిశ ఆధారంగా శుభాశుభాలు నిర్ణయిస్తారు. కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి వినిపించినట్లయితే నష్టం జరుగుతుందని విశ్వసిస్తుంటారు. అదే సాయంత్రం పూట వినిపిస్తే అవి శుభసూచకాలుగా పరిగణిస్తారు. మధ్యాహ్నం పూట కోయిన కూత వినిపిస్తే అది శుభంగా భావిస్తారు. ముఖ్యంగా మీరు ఏదైన పనిమీద వెళ్తుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. మామిడి చెట్టు మీద కూర్చోని కోయిల కూస్తుంటే లక్ష్మీ దేవి ఆగమానాన్ని సూచిస్తుంది.
బల్లి పడితే:
బల్లి మీద పడితే అశుభంగా భావిస్తారు చాలామంది. అయితే బల్లి వల్ల శుభసూచకాలు కూడా ఉన్నాయి. అకస్మాత్తుగా బల్లి మీ కుడి చేతిపై పడి.. త్వరత్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ పురోగతికి మార్గం తెరవబోతోందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీరు ఏదోక మార్గంలో డబ్బు పొందబోతున్నారని తెలుసుకోవచ్చు. బల్లి మురికిగా అనిపించవచ్చు. కానీ బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు.
ఇంట్లో చీమలుంటే శుభమా:
ఇంట్లో చీమలు ఉంటే చాలా మందికి నచ్చదు. ఎందుకంటే ఇల్లు మురికిగా ఉంటుందని రకరకాలుగా ఆలోచిస్తారు. అయితే ఇంట్లో నల్ల చీమలు ఉంటే మాత్రం శుభ సూచకగా భావించవచ్చు. నోటిలో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమను శుభ చిహ్నంగా పరిగణిస్తారు. అక్షితలు మహాలక్ష్మీకి ఎంతో ప్రియమైనవి. అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉంది. అదే ఇంట్లో ఎర్ర చీమలు ఉండటం అంత మంచిది కాదు. ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే మీపై అప్పు భారం పెరిగే అవకాశముంటుంది.

ఆ పాము కనిపిస్తే లక్ష్మీ ఆగమనం:
ఇంట్లో పాము కనిపిస్తే భయంతో దాన్ని చంపేంతవరకు నిద్రపోరు చాలామంది. అయితే పాములు శుభసూచకమని మీకు తెలుసా. మీ ఇంట్లో ఎప్పుడైనా రెండు ముఖాల పామును చూసినట్లయితే, ఇది చాలా శుభసూచనగా పరిగణించండి. చూసిన వారి ఇంటికి వెళ్ళడం చాలా పవిత్రంగా భావించవచ్చు. ఈ పాము విషపూరితం కాదు. దీన్ని ఎప్పుడూ చంపేందుకు ప్రయత్నించకూడదు. ఒకవేళ కనిపిస్తే అది బయటకు వెళ్లేందుకు మార్గం చూపిస్తే సరిపోతుంది. ఈ పాము రాక లక్ష్మీ ఆగమనానికి సంకేతంగా భావించాలి.
కుటుంబంలో మార్పులు:
లక్ష్మీ దేవి ఇంటికి వచ్చిందంటే ప్రజలు ఆలోచనలు, వ్యవహారాల్లో మార్పులు వస్తుంది. రాగ-ద్వేషాలు, ఈర్ష్య అసూయలు లాంటివి తగ్గుతాయి. ఆనందం పెంపొందుతుంది. కుటుంబంలో పరస్పర ప్రేమ, సామరస్యం లాంటివి పెరుగుతాయి. ఇంట్లో భార్యభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు దరి చేరవు. ఇంట్లో మనస్పర్థలు, విబేధాలు, కలతలు తగ్గుతున్నాయంటే దాని అర్థం లక్ష్మీ దేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు.
Famous Books:

లక్ష్మీ దేవి, లక్ష్మీ దేవి పాటలు, Lakshmi Devi, money, rich, symptoms, poojas, lashmi devi pooja, signs of a rich person, will i be rich astrology, sign of rich person
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.