Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం | Your Job, Your Village


సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం... ఆధార్ కార్డు ఫ్రాంచైజ్:
తక్కువ పెట్టుబడితోనే ఏదో ఒక వ్యాపారం చేసి స్వయం ఉపాధి పొందాలని చాలా మంది భావిస్తారు. అలాంటి వారికోసమే Lokal యాప్ ఈరోజు ఒక చక్కటి, తక్కువ పెట్టుబడితో చేయగలిగే స్వయం ఉపాధి మార్గాన్ని తీసుకువచ్చింది. సొంతఊరిలోనే స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి ఇది చక్కటి అవకాశం. అదే ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్‌ అవకాశం. కొత్త ఆధార్‌ తీసుకోవాలన్నా, ఇప్పుడు ఉన్న ఆధార్‌లోనే ఏవైనా మార్పులు చేయాలన్నా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాల్సిందే. UIDAI నియమనిబంధనలకు అనుగుణంగా ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లు నడుచుకుంటాయి. ఈ ఎన్‌రోల్‌మెంట్ ఏజెన్సీలను రిజిస్ట్రార్లు నియమిస్తారు. పౌరుల బయోమెట్రిక్, డెమొగ్రఫిక్ డేటా సేకరిస్తుంటాయి. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లు ఉన్నాయి.

ఆధార్ కార్డు ఫ్రాంచైజ్ పొంది, ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలంటే ముందుగా మీరు UIDAI నిర్వహించే సూపర్‌వైజర్ లేదా ఆపరేటర్ సర్టిఫికేషన్ ఆన్‌లైన్ ఎగ్జామ్ పాస్ కావాల్సి ఉంటుంది. ఈ పరీక్ష పాసైన తర్వాత మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, ఆధార్ బయోమెట్రిక్స్ వెరిఫికేషన్ చేయడానికి ఆథరైజేషన్ లభిస్తుంది. ఆ తర్వాత మీరు ప్రభుత్వ గుర్తింపు పొందిన కామన్ సర్వీస్ సెంటర్-CSC రిజిస్ట్రేషన్ పొందాలి. CSC రిజిస్ట్రేషన్ కోసం మీరు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

CSC అధికారిక వెబ్‌సైట్ www.csc.gov.in/ ఓపెన్ చేసిన తర్వాత ‘Interested to become a CSC’ లింక్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. CSC రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత ఆధార్ ఫ్రాంఛైజ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్ ఏర్పాటు చేయడానికి ఆఫీస్ గది కావాలి. కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్, వెబ్‌క్యామ్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐరిస్ స్కానర్, ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్, పవర్ స్టాండ్‌బై ఉండాలి. ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్ నిర్వహించేవారికి ఒక ఆధార్ కార్డుపై రూ.35 ఆదాయం లభిస్తుంది.
Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ

హనుమ నామస్మరణం సర్వపాప నివారణం

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము

శనేశ్వరుడు శనివారాల నోము

శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

శివదేవుని సోమవారపు నోము కథ



aadhar card work my village, first aadhaar card issued in india, aadhar card number village wise list, aadhar card update, aadhar card link with mobile number, aadhar card search by name and father name, aadhar card download by name and date of birth, m aadhar card download, aadhaar card reprint

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు