లాలి శ్రీ క్రిష్ణయ్య నీల మేఘవర్ణ | Annamayya Keerthanalu Lyrics in Telugu

లాలి శ్రీ క్రిష్ణయ్య నీల మేఘవర్ణ
నవ నీల మేఘవర్ణ
బాలగోపాలపాల పవ్వళింపరా

సింగారించిన మంచి బంగారు ఊయలలోన
మరి బంగారు ఊయలలోన
శంఖు చక్రథరస్వామి నిదురపోరా

లలితాంగి రుక్మిణీ లలనాయె కావలెనా
నీకు లలనాయె కావలెనా
పలుకు కోయిల సత్యభామయె కావలెనా

అందెలూ మువ్వలూ సందడిగ మ్రోయగను
అతి సందడిగ మ్రోయగను
అందముగాను నీవు పవ్వలింపరా

పగడాల పతకాలు కంఠనా ధరియించి
నీ కంఠనా ధరియించి
వంగేవు తొంగేవు నిదురపోరా

అలుకలు పోనెల అలవేలు మంగతో
శ్రీ అలవేలు మంగతో
కులుకుచు శయ్యనించు వెంకటేశ్వరుడా
అన్నమయ్య కీర్తనలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
Related Postings :

annamayya keerthanalu , bhajanalu , annamayya keerthanalu lyrics , annamayya keerthanalu list, annayyamma , god keerthanalu , venkateswara keerthanas, 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS