ఏపురాణముల నెంత వెదికినా | Annamayya Keerthanalu Lyrics in telugu


ఏపురాణముల నెంత వెదికినా |
శ్రీపతిదాసులు చెడ రెన్నడును ||

వారివిరహితములు అవి గొన్నాల్లకు |
విరసంబులు మరి విఫలములు |
నరహరి గొలి చిటు నమ్మినవరములు |
నిరతము లెన్నడు నెలవులు చెడవు ||

కమలాక్షుని మతిగాననిచదువులు |
కుమతంబులు బహుకుపథములు |
జమళి నచ్యుతుని సమారాధనలు |
విమలములే కాని వితథముగావు ||

శ్రీవల్లభుగతి జేరనిపదవులు |
దావతులు కపటధర్మములు |
శ్రీవేంకటపతి సేవించునేవలు |
పావనము లధికభాగ్యపుసిరులు ||

అన్నమయ్య కీర్తనలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS