Drop Down Menus

శాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితిలో భూమి మీద ఈ వస్తువులు పెట్టకూడదు | Hindu Temple Guide

దైవభక్తి ఉన్న ప్రతి ఒక్కరు సంప్రదాయాలని గౌరవిస్తూ ప్రతి వస్తువు ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా చాలా పవిత్రంగా ఉంటారు. పూజ చేస్తున్నప్పుడు పూజ కోసం ఉపయోగించే పూలు, కొబ్బరికాయ, అగర్బత్తీలు, కర్పూరం లాంటి వాటిని నెల మీద లేదా మంచం పైన అసలు పెట్టము.
ఎందుకంటే అలా కిందపెట్టిన వాటిని పూజకి ఉపయోగిస్తే అశుభం అని మన నమ్మకం. ఇవి కాకుండా హిందు దర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులను కింద పెట్టకూడదు. అలా పెడితే అంతా అశుభమే జరుగుతుందని నమ్మకం. ఇంతకీ అస్సలు క్రింద పెట్టకూడని ఆ వస్తువులు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

> దేవుడి ముందు పెట్టే దీపాలను నేల మీద ఎట్టి పరిస్థితిలోనూ పెట్టరాదు. వాటిని వెలిగించినా, వెలిగించకపోయినా ఎల్లప్పుడూ వాటిని శుభ్రమైన వస్త్రంపైనే ఉంచాలి. వాటిని నేలపై పెట్టరాదు. అలా చేస్తే దేవుళ్లు, దేవతలను అవమానించినట్టే అవుతుందని చెప్పుతున్నారు.
> హిందువుల్లో చాలా మందికి జంధ్యం ధరించే ఆచారం ఉంటుంది. అయితే దాన్ని నేలపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టరాదు. తల్లిదండ్రులు, గురువులకు ప్రతి రూపంగా దాన్ని భావిస్తారు. ఆ క్రమంలో జంధ్యంను కింద పెడితే వారిని అవమానించినట్టే అవుతుంది. అందుకని దాన్ని ఎప్పుడూ నేలపై పెట్టకూడదు.

> బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చూస్తారు. అలాంటి బంగారాన్ని నేలపై పెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై అనేక కష్టాలు పడతారు. అలా చేస్తే వారి వద్ద ధనం నిలువదు, అన్నీ సమస్యలే వస్తాయి.

> శంఖువులో సాక్షాత్తూ లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా నేలపై పెట్టరాదు. పెడితే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.
> నేపాల్లోని గండకీ నది తీరంలో ఓ రకమైన నల్ల రాయి దొరుకుతుంది. దాన్ని సాలిగ్రామం అంటారు. ఈ రాయి విష్ణువుకు ప్రతిరూపమని చెబుతారు. సాలాగ్రామం నేలపై అస్సలు పెట్టకూడదు. అలా చేస్తే అన్నీ సమస్యలే ఎదురవుతాయి. ఒక వేళ వాటిని నేలపై పెట్టాల్సి వస్తే చెక్కతో చేసిన శుభ్రమైన ఉపరితలంపై ఉంచాలని చెబుతున్నారు.

> శివలింగం నేలపై అస్సలు పెట్టకూడదట. అలా చేస్తే అన్నీ సమస్యలే ఎదురవుతాయట. ఒక వేళ వాటిని నేలపై పెట్టాల్సి వస్తే చెక్కతో చేసిన శుభ్రమైన ఉపరితలంపై ఉంచాలని చెబుతున్నారు.
Famous Posts:

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి


hindu dharma sastram, dharma shastra pdf, dharma shastra pdf free download, dharma shastra book, dharma shastra in english, dharma shastra meaning, pooja items, devotionals rules
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.