Drop Down Menus

దేవాలయాలకు స్త్రీలు ఎలా వెళ్ళాలి? How Should Women Go To Temples | Hindu Temple Guide

దేవాలయాలకు,స్త్రీలు,ఎలా,వెళ్ళాలి?
స్త్రీలు ప్రతి శుక్రవారం గుడికి వెళుతూ ఉంటారు. ఆలా గుడికి వెళ్ళితే సుఖ సంతోషాలు,అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం.
అయితే శుక్రవారం గుడికి వెళ్లే స్త్రీలు ఎలా వెళ్ళాలి. మన పెద్దలు స్త్రీలు గుడికి ఎలా వెళ్లాలో కూడా చెప్పారు.

చీర,లంగా,ఓణీ వంటి సాంప్రదాయ దుస్తులను ధరించాలి. అలాగే నుదుట కుంకుమ ధరించాలి.

గుడిలో ఇచ్చే పసుపు,కుంకుమను నుదుటి కుంకుమ కింద,విభూతి అయితే నుదుటి బొట్టు పైన పెట్టుకోవాలి.

ఈ విధంగా చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని మన పెద్దలు చెప్పుతున్నారు. వినాయకుని గుడికి వెళ్ళితే గరిక మాలను తీసుకువెళ్లాలి. గరిక మాలను ప్రతి శుక్రవారం వినాయకునికి సమర్పిస్తే కోరిన కోరికలు తిరటమే కాకుండా ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
అదే శివాలయానికి వెళ్ళినప్పుడు బిల్వ పత్రాలను ఏవైనా బాధలు ఉంటే తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. విష్ణు మూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు తులసి మాలతో వెళ్ళాలి. ఆంజనేయ స్వామి దగ్గరకు వెళ్ళినప్పుడు వెన్న తీసుకోని వెళ్ళాలి.

అదేవిధంగా దుర్గాదేవిని శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో గల పువ్వులను సమర్పించుకుంటే సర్వసుఖసంతోషాలు చేకూరుతాయి.

అదేవిధంగా దేవాలయంలో ఎవరితో మాట్లాడకూడదు, గట్టిగా మాట్లాడం, నవ్వడం, పాటలు, పద్యాలు పాడటం చేయకూడదు. సాధ్యమైనంత మౌనంగా ఉండాలి. భారీగా అలంకరణలు చేసుకుని దేవాలయానికి వెళ్లకూడదు. అక్కడ మన ఆడంబరాలు, స్థాయి, అంతస్తులను చూపించుకునే విధంగా ప్రవర్తించకూడదు. గుడికి వచ్చే ప్రతీ ఒక్కరూ భక్తులే కాబట్టి అక్కడ తప్పక అందరినీ గౌరవించాలి. అక్కడ దర్పాలకు పోకూడదు. స్వామి/అమ్మమీద ధ్యాసతో అక్కడ ప్రతీదానిలో ఆ భగవంతుడి స్వరూపాన్ని దర్శించగలిగితే తప్పక భగవంతుడి ఆనుగ్రహం మనకు కలుగుతుంది.
అదేవిధంగా దుర్గాదేవిని శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో గల పువ్వులను సమర్పించుకుంటే సర్వసుఖసంతోషాలు చేకూరుతాయి.ఈతిబాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మన పెద్దలు అంటున్నారు.

ఈతిబాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మన పెద్దలు అంటున్నారు.
Famous Posts:
Temples, Rules, Pradakshina,  temple rules in women, Indian temples, sabarimala temple, temple rules and regulations in tamil, temple construction rules
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.