Drop Down Menus

పొలాల అమావాస్య పూజా విధానం వ్రత కథ | Polala Amavasya vratham and significance


పెళ్లయి చాలాకాలమయినా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి.

పొలాల అమావాస్య విశిష్టత? పొలాల అమావాస్య ఎందుకు చేసుకొంటారు? ఇది ఎలా చెయ్యాలి? అనేది తెలుసుకొందాం. 
శ్రావణ బహుళ అమావాస్య రోజును పోలాల అమావాస్య అని అంటారు. ఈ పండగ కు కందమొక్క మరియు బచ్చలి మొక్కకు పూజ చేస్తారు. పూజలో ఒక కథ కూడా చెప్తారు.

ఇది పెళ్ళయిన ఆడవాళ్ళుపిల్లల కలవారు వారి శ్రేయస్సు కోసం చేస్తారు. పిల్లలు లేనివారు పిల్లలు కలగటానికి ఈ పూజ చేస్తారు. ఈ పూజలో ఆడపిల్లు కావాలనుకునేవారు గారెలు దండ అమ్మవారికి వేస్తామని, మొగపిల్లలు కావలి అనే కోరిక కలవారు పూర్ణం బూరెలు దండ అమ్మవారికి వేస్తామని మొక్కుకుంటారుట. ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు. నివేదనగా నవకాయ కూర చేస్తారు, ఇంకా పప్పు తాలికలు, పాలతాలికలు, మినపకుడుములు చేసి అమ్మవారికి నివేదిస్తారు. 

వ్యవసాయదారులు గోవులను పాలించువారు తమ ఆవులు ఎద్దులకు ఈ రోజున విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీ. గ్రామాల్లో ఆవులు ఎద్దులకు కడుపునిండా తిండి నీరు తాగించి ఎలాంటి పనులు చేయించకుండా బాగా మేపే అమావాస్యగా పెద్దలు చెబుతారు. భారతీయ సంస్కృతిలో ఆవులు ఎద్దులను పూజించడం సాంప్రదాయంగా వస్తుంది. అలాంటి సాంప్రదాయాలను నేటికీ గ్రామాల్లో పొలాల అమావాస్య పండుగగా జరుపుకుంటారు. 

పార్వతీదేవి విషయమై నంది తనకు చేసిన సాహసాన్ని మెచ్చి శివుడు శ్రావణ బహుళ అమావాస్య రోజున వృషభాన్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని అనుగ్రహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఏరువాక పున్నమి (జ్యేష్ఠ పున్నమి) మొదలు శ్రావణమాసం వరకు వ్యవసాయ పనులతో ఎద్దులకు తీరికలేకుండా పని ఉంటుంది. శ్రావణమాసానికి విశ్రాంతి దొరుకుతుం ది. ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన ఏ పనీ చేయకుండా పూజ మాత్రమే జరపడం సాంప్రదాయంగా వస్తుంది.
వ్రత కథ:
పూర్వం పిల్లలమఱ్ఱి అనే గ్రామంలో సంతానరామావధానులు అనే స్మార్తపండితుడు ఉండేవాడు. ఆయనకు ఏడుగురు మగపిల్లలు. అందరికీ పెళ్లిళ్ళయి, కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్దకోడళ్ళు ఆరుగురికీ పిల్లలు పుట్టారు గానీ, చిన్నకోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం, వెంటనే చనిపోతూండడం జరిగేది. అలా ఆరుసార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికీ ఆ ఆరు సంవత్సరాలూ ‘పోలాల అమావాస్య వ్రతం’ చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం. సూటిపోటి మాటలతో బాధించేవారు. ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈ సారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్దకొడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్యనాడు సుగుణకు ప్రసవమై, మృతశిశువును కంది. ఈ సంగతి తోటికోడళ్ళకు తెలిప్తే తనను వ్రతానికి పిలవరని తలచి, చనిపోయిన  బిడ్డను తన  గదిలో దాచి, ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డలమూట వుంచి తన తోటికోడళ్ళతో కలిసి ‘పోలాల అమావాస్య వ్రతాన్ని’ ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకుని కన్నీటితో  స్మశానానికి వచ్చి, గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని, కన్నీరు మున్నీరుగా విలపించ సాగింది. అప్పటికి బాగా చీకటి పడింది.

ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలు దేరిన పోలాలమ్మదేవి, సుగుణ దగ్గరకు వచ్చి ‘ఎందుకు రోదిస్తున్నావు’ అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి, ‘ సుగుణా.., బాధపడకు. నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్లి, ఏ పేర్లయితే నీ పిల్లలకు పెట్టాలను కున్నావో ఆ పేర్లతో వారిని పిలు’ అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుత దగ్గరకు వెళ్లి తన పుత్రులను పేరుపేరునా పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని, వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటికోడళ్ళకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ, పిల్లా,పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి, తరించింది.
వ్రత విధానం
ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్యనాడు చేసుకోవాలి. పూజచేసే చోట గోమయంతో అలికి, వరిపిండితో అందమైన ముగ్గువేసి, ఒక కందమొక్కను అక్కడ వుంచి, పసుపుకొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ వుంచి, ముందుగా వినాయకుని పూజించి, ఆ తర్వాత ఆ కందమొక్క లోకి మంగళగౌరీదేవిని గానీ, సంతానలక్ష్మీదేవిని గానీ  ఆవాహన చేసి, షోడశోపచారాలతో అర్చించి, తొమ్మిది పూర్ణంబూర్లు ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్దముత్తయిదువును పూజించి, కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి, నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించి, దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత ఒక తోరాన్ని కందమొక్కకు కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి. అలా చేస్తే.., ఆమె సంతానం ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో పది కాలాలపాటు చల్లగా ఉంటారు. ఇక పూర్ణంబూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే..,పూర్ణంబూరె పూర్ణగర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం, గర్భస్థశిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణబూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు. కనుక మాతృత్త్వాన్ని కోరుకునే ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన, సౌభాగ్యాలు పొందాలని ఆకాంక్షిస్తోంది.

Famous Posts:

కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?


మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 


భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 


వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.


శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు


శివ గుణాలు లోకానికి సందేశాలు


భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?


పోలాల అమావాస్య, polala amavasya, polala amavasya 2020 date, polala amavasya pooja vidhanam in telugu pdf free download, polala amavasya dates 2020, polala amavasya katha, polala amavasya 2020 usa, polala meaning, pasupu kommu amavasya today, amavasya
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.