Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఈ పవర్‌ఫుల్ మంత్రాలతో పూజచేస్తే లక్ష్మీ అనుగ్రహం | Lord Lakshmi Devi Powerful Mantrams in Telugu

పురాణాలు, ఇతిహాసాల ప్రకారం దేవతా మంత్రాలకు అపారమైన శక్తి ఉంది. దీని వల్ల అపరమితమైన ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. క్రమ పద్ధతిలో వీటిని ఉచ్ఛరిస్తే పాజిటివ్ వైబ్స్ సిద్ధిస్తాయి. విశ్వంలోని ఈ వైబ్స్ మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. వీటిలో ముఖ్యమైంది లక్ష్మీ మంత్రం.
దీన్ని సిద్ధి మంత్రం అని కూడా అంటారు. ఇందులోని ప్రతి అక్షరం అత్యంత శక్తివంతమైంది. మనస్ఫూర్తిగా వీటిని జపిస్తే అనుకూల ఫలితాలు దక్కుతాయి. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయాలు సొంతమవుతాయి.

> ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ:
మంత్రాన్ని పఠించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.

> ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ:
మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల అన్ని రంగాల్లోనూ సమృద్ధి సాధిస్తారు.

> ఓం శ్రీం శ్రీ అయే నమ:
మంత్రాన్ని పలకడం వల్ల సంతోషం లభిస్తుంది.

> ఓం మహాదేవ్యేచ విద్మహే, విష్ణు పత్నేచ దీమహే... తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేది లక్ష్మీ గాయత్రి మంత్రం.
ఈ మంత్రం వల్ల ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారు.

> ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట-లక్ష్మి మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమః

> ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ:
అనే శుక్ర బీజ మంత్రాన్ని శుక్రవారం నాడు 108 సార్లు జపించాలి. పూజగదిని శుభ్రం చేసి, లక్ష్మీదేవి ముందు నేతితో దీపం వెలిగించాలి. ఇలా చేసిన తర్వాత ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. శుక్ర బీజ మంత్రం. దీన్ని 108 సార్లు ప్రతి శుక్రవారం ఉచ్ఛరిస్తే పరిస్థితుల్లో మార్పులు తప్పకుండా వస్తాయట.

> ఓం శ్రింగ్ హ్రింగ్ క్లింగ్ శ్రింగ్ సిద్ధ లక్ష్మ్యై నమః ఏకాదశాక్షర సిద్ధ్ 
మంత్రం వల్ల సిద్ధి పొందుతారు.

> ఓం సర్వబాధా వినిర్ముక్తో, ధనధాన్య సుతాన్వితా। మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయా ఓం..
ఈ మహాలక్ష్మి మంత్రం చెడును అంతం చేసి సుఖసంతోషాలను కలగజేస్తుంది.

మహాలక్ష్మీ ముల్లోకాలలో పూజించబడుతుంది. శ్రీమహావిష్ణువు పట్టమహిషి, భగవాన్ శ్రీకృష్ణుడి భార్య. మాతోనే స్థిరంగా ఉండిపోవాలని అందరూ కోరుకుంటున్నారు.
సాధారణంగా శుక్రవారం నుంచి మంత్రోపాసన మొదలుపెడతారు. పౌర్ణమి రోజు నుంచి కూడా ప్రారంభించవచ్చు. దీపావళి కూడా లక్ష్మీ మంత్రాన్ని పఠించడానికి అత్యుత్తమైన రోజు. జపమాల కానీ, స్ఫటిక మాలతో మంత్రపఠనాన్ని గావించాలి.
Famous Posts:


lakshmi devi powerful mantra in telugu, lakshmi moola mantra in telugu pdf, vyuha lakshmi mantra in telugu download, lakshmi devi slokas in telugu lyrics, lakshmi kubera mantra in telugu pdf, laxmi mantra for money, lakshmi devi slokas | telugu, lakshmi devi stotram telugu, kanakadhara stotram in telugu, lakshmi devi mantram

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు