Drop Down Menus

మన జీవితంలో ఒక్కసారి అయిన ఈ నామాలు చదవాలి | Yama Kruta Shiva Keshava Stuti | Hindu Temple Guide

జీవితంలో  ఒక్కసారి అయిన ఈ నామాలు చదవాలి
యమకృత శివకేశవ స్తుతి అనారోగ్యంతో.. బాధపడుతున్నవారు..ఆరోగ్యంగా జీవించాలనుకునేవారు..నిత్యం ఈ స్తోత్రం చదవాలి.
మన జీవితం లొ ఒక్కసారి అయిన ఈ నామాలు చదవాలి.
కాశీఖండము లోని యముని చే చెప్పబడిన శివుడు..విష్ణువు ఇద్దరు తో కూడిన నామాలు ఒక్కసారి చదివినా అనేక జన్మల పాపాలు పోతాయి..

ఈ నామాలనూ ప్రతిరోజు పటించే వాళ్ళకి యమ దర్శనం వుండదు..

యముడు స్వయంగా తన యమభటులు కు ఈ శివకేశవ నామాలు ఎవ్వరు భక్తితో రోజు చదువుతూ వుంటారో వారి జోలికి మీరు పోవద్దు అనిచెప్పాడు..
గోవింద మాధవ ముకుంద హరే మురారే ,శంభో శివేచ శంకర శశిశేఖర శూలపానే !
దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

గంగాధరాంధకరిపో హర నీలకంఠ , వైకుంఠ కైటభరిపో కమలాబ్జపానే !
భూతేశ ఖండపరశో మృడ చండికేశ , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే ,గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ !
నారాయణాసుర నిబర్హణ ,శార్జ్గపాణే , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో, శ్రీకాంత పీతవసనాంబుదనీల శౌరే !
ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

లక్ష్మిపతే మధురిపో పురుషోత్తమాద్య, శ్రీకంఠ దిగ్విసన శాంతి పినాకపానే !
ఆనందకంద ధరణీధర పద్మనాభ , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ, బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపానే !
త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌలే , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే , భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ!
చానూరమర్దన హృషీకపతే మురారే , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

శూలిన్ గిరీశ రజనీశకళావతంస, కంసప్రణాశన సనాతన కేశినాశ!
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

గోపీపతే యదుపతే వసుదేవసూనో, కర్పూరగౌర వృషభధ్వజ ఫాలనేత్ర !
గోవర్దనోద్దరన ధర్మధురీణ గోప , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

స్థానో త్రిలోచన పినాకధర స్మరారే , కృష్ణానిరుద్ద కమలానాభ కల్మషారే !
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
ఈ యమకృత శివకేశవ నామాలను స్మరించువారు పాపరహితులై తిరిగి మాతృగర్బమున జన్మింపరు

‌‌‌|| ఓం శివ నారాయణాయ నమః ||

|| ఓం నమో హరిహరేశ్వరాయ నమః ||

Famous Posts:
ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు | మీకు ఎవరు చెప్పని విషయాలు 


sivakesava namalu in telugu, chaganti siva kesava namalu, sivakesava ashtottara shatanamavali, 110 names said by lord yama, yama namalu, shivapuranam telugu pdf, abhishekam mantra in telugu, ashtothram in telugu pdf, rudrabhishekam pdf telugu,lord shiva, stotrams
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.