అన్నమయ్య కీర్తనలు :
నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు ||
వేదములు చదివియును విముఖుడై హరిభక్తి
యాదరించని సోమయాజి కంటె |
ఏదియును లేని కుల హీనుడైనను విష్ణు
పాదములు సేవించు భక్తుడే ఘనుడు ||
పరమ మగు వేదాంత పఠన దొరికియు సదా
హరి భక్తి లేని సన్యాసి కంటె |
సరవి మాలిన అంత్య జాతి కులజుడైన
నరసి విష్ణుని వెదకు నాతడే ఘనుడు ||
వినియు చదివియు, శ్రీ విభుని దాసుడు గాక
తనువు వేపుచు నుండు తపసి కంటె |
ఎనలేని తిరు వేంకటేశు ప్రసాదాన్న
మనుభవించిన యాతడప్పుడే ఘనుడు ||
మరికొన్ని అన్నమయ్య కీర్తనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Related Postings :
keywords : Annayyamayya Keerthanlu , annamayya history, annamayya lyrics, annamayya keerthanas pdf , annamayya telugu lyrics, keerthanalu, Hindu Temples Guide