పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది I important Qualities Of a Good Man | Hindu Temple Guide

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు..
పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది.
కానీ ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యం లో లేదు.
కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః,
సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు
ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)

1.కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి

2. కరణేషు దక్షః :-
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
3. రూపేచ కృష్ణః:-
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.

4. క్షమయా తు రామః:-
ఓర్పులో రామునిలాగా ఉండాలి.పితృవాక్య పరి
పాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.

5. భోజ్యేషు తృప్తః
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.

6. సుఖ దుఃఖ మిత్ర :-
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.
Realated Posts:
సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


స్త్రీ , పురుషుడు, qualities of a good woman, qualities of a good man,Sanatana Dharma, sanatana dharma meaning in telugu, dharma sandehalu, man and women

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS