ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య సంభాషణ ఇలా సాగుతోంది...
ఆమెనడిగాడు... మీది ఏ కులం?
ఆమె సమాధానం "మహిళ"గా చెప్పాలా "అమ్మ"గా చెప్పాలా?
రెండిటినీ కూర్చి చెప్పండి, అన్నాడతడు.
పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆమె చెప్పింది... "తల్లి కాగానే స్త్రీ కులాతీతురాలౌతుంది"!
అదెలా సాధ్యం! ఆశ్చర్యపోతూ అడిగాడతడు...
ఆమె సమాధానం...
తల్లి తన పిల్లల మలమూత్రాదులను శుభ్రపరచేటప్పుడు తల్లిది శూద్ర జాతి
పిల్లలు పెద్దవాళ్ళైయ్యే తరుణంలో వారి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఆమె క్షత్రియ వనిత
పిల్లల ఎదుగుదలతోపాటు ఆమె కులం కూడా మారుతుంది. వారికి విలువలు నేర్పిస్తుంది, సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పించి బ్రాహ్మణ వనిత అవుతుంది.
చివరగా...
పిల్లలకు మంచి విద్యాబుద్ధులు వచ్చి సంపాదనపరులైన తరువాత, తల్లి వారికి ధనం యొక్క విలువను, ఆదా చేయడాన్ని నేర్పించి వైశ్య ధర్మాన్ని ఆచరిస్తుంది.
ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటారనుకుంటాను... స్త్రీ కులాతీతురాలని!
గౌరవంతో, వినమ్రతాభావంతో నిశ్చేష్టుడై అలా చూస్తుండిపోయాడతడు...
మాతృమూర్తులందరికి అంకితం
ప్రతి నిత్యం మన జీవితాలని ఉత్సహంగా మలిచే అమ్మ కి నమస్కారాలు.
Related Posts:> బియ్యపు గింజతో ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది ఎలాగో తెలుసా ?
స్త్రీ పురుషులు, stree, Adarsha Stree Purushulu, Devotional Story's, women, men, dharma sandehalu
Excellent
ReplyDeleteExcellent
ReplyDelete