వాస్తు వేధ దోషాలు..!!
వేధలు అంటే కనిపించకుండా బాధించే వాస్తు దోషాలు. వేధల్లో కొన్ని సహజమైన ప్రకృతి సంబంధమైనవి. మరికొన్ని సామాజిక మైనవి.
కుడ్య వేధ: ఇల్లు కడుతూ ఉన్నప్పుడు తూర్పు ఉత్తరం ప్రహరీ గోడలు కాని ఇతరమైన గోడలు కాని పడమర, దక్షిణ దిశలకన్నా ఎత్తుగా ఉండకూడదు. అంటే పడమర దక్షిణ దిశల గోడలు ఎత్తుగా ఉండాలి.
తారతమ్య వేధ: ఇంట్లో ఎప్పుడూ దక్షిణ పడమరల వైపు పెద్దవారు నివసించాలి. తూర్పు ఉత్తరముల వైపు చిన్నవారు వుండాలి. అలా కాకుండా వ్యత్యస్తంగా అయినప్పుడు తారతమ్య వేధా దోషం కలుగుతుంది.
నత వేధ: ఇంటి ఆవరణలో తూర్పు ఉత్తర భాగములు ఎత్తుగాను, పశ్చిమ దక్షిణములు పల్లముగాను ఉండుట వలన నత వేధా దోషం కలుగుతుంది. దాని వలన చోర బాధలు, ఆకస్మిక ప్రమాదాలు సంభవిస్తాయి.
కాంతి హీన వేధ: ఇంటిలోకి మొదటి, నాలుగు జాములో సూర్యరశ్మి సోకాలి. లేకపోతే కాంతి హీన వేధ దోషం కారణంగా భూత బాధలు పీడిస్తాయి.
క్షౌద్ర వేధ: ఇంట్లో ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ దిశల్లో పుట్టలు (చీమల పుట్టలు-పాముపుట్టలు) అదేపనిగా తేనె పట్టులు పెడుతూ ఉండడం మంచిది కాదు. అలా జరిగిన సందర్భాలలో కొన్ని నిర్మాణాలు అకస్మాత్తుగా భూమిలో కృంగిపోయిన సందర్భాలున్నాయి. దానినే క్షౌద్ర వేధ అంటారు.
పశు వేధ: ఇంటి ఆవరణలో ముందు భాగంలో పశువులు, గొర్రెలు, మేకలు వంటివి ఉండకూడదు. ఇంటి పశ్చిమ, దక్షిణ భాగాలలో ఉండాలి. గోవులైతే ఉత్తర ఈశాన్య భాగాలు శ్రేష్టం. గోవుయొక్క గిట్టల ధూళి వలన ఎన్నో దోషాలు పరిహారమవుతాయి. గోవు గురించి వేద విజ్ఞానం కాని హిందూ మత విశ్వాసం కాని, కేవలం విశ్వాసం కాదు-అది కేవలం విజ్ఞాన ప్రధానమూ మానవ శ్రేయస్సుకూ సంబంధించిన సత్సంప్రదాయం.
కోణ దృగ్వేధ: ఇంటి స్థలంలో ఒక మూలగా ఇల్లు కట్టకూడదు. ఒకవేళ తప్పనిసరి ఐన పక్షంలో దానికి ప్రత్యేక ప్రహరీ నిర్మాణం చేయాలి. అలాగే ఇతరుల ఇంటి మూల ఇంటి గృహ ద్వారాన్ని ఛేదించకూడదు. ఇంటి యొక్క మూలల వెంబడి ద్వారాలు ఉంచడం కూడా కోణ వేధగానే బాధిస్తుంది. ఈ కోణ వేధనే కొన్ని ప్రాంతాలలో ‘కొంజెర’ దోషం అని గ్రామీణ పద్ధతిలో పిలుస్తారు.
శైలవేధ: ఇంటికెదురుగా సింహ ద్వారానికెదురుగా కొండలు, గుట్టలూ ఉండకూడదు. ముఖ్యంగా తూర్పు ఉత్తర దిశలలో కొండలు, గుట్టలూ అసలు ఉండకూడదు. ఇంటి గోడల చివర్లలో కోట గోడల ఆకారంలో ఆర్చిలు కాని , కమాన్లు కానీ ఉండకూడదు. ఇల్లు నిర్మించే స్థలం కోణాకృతిలో ఉండకూడదు.
సత్రవేధ: ఇంటికి ఎదురుగా గాని సమీపంలో కాని రెండువందల గజాలలోపు సన్యాసాశ్రమాలు, అనాధాశ్రమాలు, ఆలయాలు ఉండకూడదు.
శల్యవేధ: శల్యములు అంటే ఎముకలు. ఇల్లు కట్టే స్థలం ముందుగా ఒక మనిషి నిలువు తవ్వి ఎముకలు, బొగ్గులు, ఊక వంటి నిషిద్ధ పదార్థాలు లేకుండా చూసుకోవాలి. ఇల్లు కట్టే స్థలంలో గర్భంలో గండశిల వంటివి ఉండకూడదు. అవి ఇంటిని కదిలిస్తాయి. హాని కలిగిస్తాయి.
కుల్యములు, అంటే కాలువలు, తటాకము అంటే చెరువులు, ప్రవాహాలు, ఇవి ముఖ్యంగా నైరుతి, వాయవ్యాలుగా కాని, ఈశాన్యము నుండి ఆగ్నేయముల వైపు కాని, దక్షిణ పడమరలుగా గాని ప్రవహించకుండా చూసుకోవాలి.
ఇంట్లో నీరు కూడా ఈశాన్యం వైపు పారేలా ఏర్పరుచుకోవాలి. ఇతరుల ఇంటి నీరు మన ఇంటి ఆవరణలోకి రాకుండా చూసుకోవాలి.ఈ వాస్తు నియమాలు చదివినప్పుడు, చెబుతున్నప్పుడు కఠినంగానే వినిపిస్తాయి. కాని కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ఇబ్బందులు రాకుండా కాపాడతాయి.
స్తంభహీన వేధ:-స్తంభహీన వేధని ‘శంఖపాల వేధ’ అని కూడా అంటారు. స్తంభములు (పిల్లర్లు) లేకుండా గృహ నిర్మాణము చేయకూడదు. స్తంభము అంటే స్థిరంగా నిలబడి యుండునది అని అర్థం. స్తంభములు వాస్తురీత్యా సరియైన సంఖ్యలో సరియైన పద్ధతిలో ఏర్పాటుచేస్తే ఆ ఇల్లు కూడా స్థిరంగా సుస్థిరంగా ఉంటుంది. స్తంభములు లేకుండా ఇల్లు నిర్మించరాదు. దానినే స్తంభహీన వేధ - శంఖపాల వేధ అంటారు. ఆ స్తంభాలు, సున్నాలేని సరిసంఖ్యలో ఉంటే చాలా క్షేమం. షోడశ సంఖ్యలో ఉంటే అంటే పదహారు సంఖ్యలో ఉంటే అత్యంత ఉత్తమం.
వికట వేధ: వికటము - అంటే వంకర. గృహము యొక్క సింహ ద్వారము విషయంలో చెప్పబడింది. ‘వికటే సంతాన వేధ స్యాత్’ వికట వేధ వలన సంతానమునకు హాని. సింహద్వార ప్రమాణం వంకరగా ఉన్నా - కొలతలు (ఆయము - మిగతా ద్వారముల సమన్వయ ప్రమాణముతో) హెచ్చుతగ్గులు మిట్ట పల్లాలు - సంకరమైన కలప - నిషేధితమైన కలప (తుమ్మ మొదలైనవి)తో చేయబడినా రెండు ద్వారముగా లేక ఒకే ద్వారము కలిగి ఉన్నా మరొకరి ఇంటిలోది కొని తెచ్చిపెట్టినా.. రూపహీనంగా ఉన్నా ఆ ఇల్లు వికట వేధ కలిగిన ఇల్లుగా చెప్పవచ్చు. అందుకే వికట వేధ లేకుండా సింహ ద్వార నిర్మాణం చేయించాలి.
వృక్ష ఛాయ వేధ;-వృక్ష ఛాయ కూడా వేధగానే పరిణమిస్తుంది. దిన సమయంలో గాని రాత్రి సమయంలో గాని రెండు మూడు ఝాముల వేళల్లో కాండము గల చెట్టుయొక్క నీడలు ఇంట్లో కాని ఇంటి మీద కాని పడకూడదు.
తూర్పున మర్రి, ఆగ్నేయంలో వేప, జామ దక్షిణంలో తెల్ల జిల్లేడు, అల్ల నేరేడు, పనస - నైరుతిలో శమీ వృక్షం - పడమర రావి చెట్టు ఉసిరిక చెట్లు - వాయవ్యంలో మేడి ఉత్తరంలో వెలగ - పనస. ఈశాన్యంలో మారేడు చెట్లు ఉంటే రక్షగా ఉంటాయి.
అగ్నివేధ: ఇంటిలో ఆవరణలోగాని ఇంటి సమీపంలో గాని చెత్త లాంటివి తగులబెట్టవలసి వస్తే అది ఇంటికి ఆగ్నేయ భాగంలో వచ్చేట్టు చూడాలి. ఆగ్నేయ భాగంలోకాక మరే దిశలోనైనా నిప్పు వెలగటం వల్ల ఆ ఇంటికి అగ్ని వేధా దోషం కలుగుతుంది. దాని వలన భార్యాపుత్రులకు హాని కలిగే అవకాశం ఉంది.
దహన వేధ: ఏదైనా ప్రమాదవశాత్తు ఇంటికి సంబంధించిన తలుపులు కాని కిటికీలు కాని పాక్షికంగా కాని పూర్తిగా కాని అగ్నిప్రమాదానికి గురైతే వాటిని వెంటనే తొలగించి కొత్తవి ఏర్పాటు చేసుకోవాలి. సగం కాలినవే కదా అని ఉపేక్షించరాదు.దాని వలన దహన వేధా దోషం తగులుతుంది. అలాగే ఇంట్లో పగిలిన అద్దాలు రెండు రూపాలుగా కనిపించే అద్దాలు, విరిగిన తలుపులు కలిగిన కిటికీలు ఉండరాదు. తలుపులు కాని, కిటికీలు కాని అదే పనిగా కిర్రుమనే శబ్దాలు కాని కీచుమనే శబ్దాలు కాని సృష్టించకూడదు. కోడు, కాళ్లు విరిగిన కుర్చీలు, బల్లలు వాడుకలో ఉంచకూడదు. వాటి వలన వేధా దోషమే కాకుండా, ప్రమాద బాధలు కూడా కలుగుతాయి. సహజంగా పేదవారు అక్కడా ఇక్కడా దొరికిన కలపతో గుడిసెలు, ఇళ్లు ఏర్పరచుకుంటారు. అందులో కాలిన వస్తువులు ఉండకూడదు. నట్టింట్లో బొగ్గులు ఉంచకూడదు. తాత్కాలికంగానైనా పోయకూడదు.
చతుష్కోణ వేధ: సహజంగా ఇల్లు కట్టే సమయంలో సమ చతురస్రంగా ఉండాలనే ఉద్దేశంతో నిర్మిస్తారు. ఆ సంబంధంగా నాలుగు భిన్న కోణాలు ఏర్పడతాయి. దాని వలన చతుష్కోణములుగా మూలలను వేధిస్తాయి. అది మంచిది కాదు.
రక్త వర్ణ వేధ: ఇంటికి వేసే రంగుల విషయంలో, ఫ్లోరింగ్ విషయంలో రక్త వర్ణం గల రంగును వాడకూడదు.
వాయు వేధ: ఇంటికి దక్షిణ, పడమర దిశలలో తప్పకుండా కిటికీలు ఉండాలి. దక్షిణ దిశ నుండి మలయ పర్వతం గాలులు, పడమటి వైపు నుండి పడమటి కనుమలల గాలులు వైద్య శాస్తర్రీత్యా చాలా ఆరోగ్యకరమైనవి.మలయ పర్వతాలే నల్లమల కొండలు. అక్కడ నుండి వచ్చే గాలులకే మలయానిలం అని పేరు. అందుకే దక్షిణ, పడమరలకు, ఇంటికి కిటికీలు ఉండాలని మన వాస్తు శాస్త్రం నిర్దేశించింది.
స్మశాన వేధ: ఇంటికి దగ్గరలో స్మశానం ఉండటం మంచిది కాదు. శవ దహనం చేసిన పొగను ప్రేత ధూమమంటారు. అది పారటం ఇంటిపైన కాని వ్యక్తిపైన కాని మంచిది కాదు.
గృహానికి ఆగ్నేయ, నైరుతి దిశలందు తూర్పు పడమరలలోనూ గోతులూ విపరీతమైన పల్లపు ప్రదేశమూ ఉండకూడదు.
ఉచ్చిష్ట వేధ: గృహావరణలో తూర్పు, ఉత్తర దిశలలో పెంటకుప్పలూ - ఉమ్ములూ, పేడకుప్పలూ, చెత్తకుప్పలూ ఉండకూడదు. ఈశాన్య దిశగా ఎప్పుడూ ఉమ్మివేయటం కానీ, మల మూత్ర విసర్జనలు కాని పనికి రావు. ఈ నియమం ఇంటికి మాత్రమే కాదు. బయటకు కూడా వర్తిస్తుంది. అలాగే సూర్యుడికి ఎదురుగా మల మూత్రాదులు చేయకూడదు. సూర్యుడు ఉన్న దిశ నుండి వ్యతిరేక దిశలో ఆగ్నేయ నైరుతి భాగాలను ఉపయోగించాలి.
భిన్నదేహళీవేధ: ‘దేహళి’ అంటే ‘కడప’ ద్వారం దాటడానికి వేసే ‘నడిమి పడిని’ కడప అంటారు. కడప పట్టణానికి ఆ పేరు రావడానికి అది తిరుపతి వెంకటేశ్వరస్వామి యొక్క దేవుని కడప కావటమే. ఈ గడపను తొక్కుతూ ఇంట్లోకి కాని, దేవాలయంలోకి కాని వెళ్లకూడదు. దాటుతూ వెళ్లాలి. ఈ కడపను ద్వార ప్రమాణానికి అనుప్రమాణ రీతిలో నిర్మించాలి. అలా కాకుండా నిర్మిస్తే అది దేహళీ భిన్న వేధగా ఇంట్లో నివసించే వారికి అనేక రకములైన ఇబ్బందులకు గురి చేస్తుంది.
జోతిష్యం..
ద్వాదశ ముహూర్త శుద్దులు స్థితులు..
ఏ శుభ కార్యానికైనా ముహూర్తం పెట్టేటప్పుడు లగ్నం బలంగా ఉండాలి.
ఏ ముహూర్త లగ్నానికి అయిన అష్టమ శుద్ది ఉండాలి.ఏ శుభ కార్యానికి ముహూర్తం పెడుతున్నామో ఆ శుభకార్యానికి వర్తించే గ్రహం ముహూర్త లగ్నంలో అస్తంగత్వం చెందకూడడు.
ఆ గ్రహ వర్గోత్తమం చెందితే మంచిది.
ఉదా:-వివాహానికి శుక్రుడు కారకుడు .
కాబట్టి వివాహ ముహూర్తంలో శుక్రుడు అస్తంగత్వం చెందకూడడు.
శుక్రుడు వర్గోత్తమం చెందితే మంచిది.
లగ్నానికి గురు దృష్టి మంచిది.
లగ్నశుద్ది:-నామకరణం,నిషేకం,గర్భాదానం మొదలగు వాటికి లగ్నశుద్ది ఉండాలి.
ముహూర్త లగ్నంలో ఏ గ్రహ ఉండరాదు.
కానీ కాళిదాసు మాత్రం లగ్నం నందు గురువు ఉన్నచో ముహూర్తం పనికి వచ్చును అని, మరియు శుభమనియు చెప్పియున్నారు.
కావున ముహూర్త లగ్నం నందు గురువు తప్ప మిగిలిన గ్రహాలు ఉండరాదని తెలియజెప్పినాడు.
ద్వితీయ భావ శుద్ది:-ధన సంబందమైన,రాజీ ప్రయత్నాలు,మొదలైన వాటికి ద్వితీయ శుద్ది ఉండాలి.ద్వితీయానికి రాహు సంబందమున్నచో పుడ్ పాయిజన్ అవుతుంది.
తృతీయ భావ శుద్ది:-పుంసవనం, సీమంతం, వ్యాపార ముహూర్తాలకు,సోదరుల మద్య ఆస్తి పంపకాలకు తృతీయ శుద్ది ఉండాలి.
చతుర్ధభావశుద్ది:-గృహ సంబందమైన ముహూర్తాలకు,శత్రు దర్శనానికి చతుర్దశుద్ది ఉండాలి.
పంచమభావ శుద్ది:-సంతాన విషయాలకు , ప్రయాణాలకు, ఉపనయనానికి పంచమశుద్ది ఉండాలి.
షష్టమ భావశుద్ది:- క్రయ విక్రయాలకు, వడ్డీ వ్యాపారాలకు, జమ ఖర్చులు వ్రాసుకునేవారికి షష్టమ శుద్ది ఉండాలి.
సప్తమ భావశుద్ది:- వివాహానికి సప్తమశుద్ది ఉండాలి.
అష్టమ భావశుద్ది:-అన్నీ శుభకార్యాలకు అష్టమ శుద్ది ఉండాలి.
నవమ భావ శుద్ది:-రాబోవు సంతానం మంచిగా ఉండటానికి శ్రీమంతం చేయటానికి నవమ శుద్ది ఉండాలి.
దశమ భావ శుద్ది:- కర్మాభావం చేసే ప్రతి పని మంచిగా ఉండాలి. పనిచేయాలంటే శక్తి కావాలి.
శక్తి ఆహార పదార్ధాలద్వారా వస్తుంది. అన్నప్రాశనకు,పనులు చేయటానికి దశమ శుద్ది ఉండాలి. ద్వితీయానికి, ద్వితీయాధిపతికి రాహుగ్రహ సంభందం ఉన్నప్పుడు అన్నప్రాశన చేయకూడదు.
లాభభావశుద్ది:- పట్టాభిషేక ముహూర్తానికి , ప్రమాణ స్వీకార ముహూర్తానికి లాభ భావ శుద్ది ఉండాలి. పార్లమెంట్ 11 వభావం సూచిస్తుంది.
రవి ప్రభుత్వం కాబట్టి లాభంలో రవి ఉంటే మంచిది.
వ్యయభావ శుద్ది:-శయ్యా సుఖానికి , గృహారంభ, గృహ ప్రవేశాలకు, దీక్షా మొదలగు వాటికి ద్వాదశ భావ శుద్ది ఉండాలి.
నక్షత్ర గణాలు..
వధూవరుల జాతకం పరిశీలించేటప్పుడు వరుని యొక్క మనస్తత్వం నిర్ణయించటానికి అతని జన్మ నక్షత్రం ఆదారంగా నిర్ణయించవచ్చు.
నక్షత్ర విభజన వారి మనస్తత్వ ప్రకారం విభజించబడింది.
వధువు నక్షత్రంతో వరుని నక్షత్రం సరిపోతుందో లేదో చూడాలి కానీ వరుని నక్షత్రంతో వధువు నక్షత్రాన్ని పోల్చకూడదు.
నక్షత్రాలు 27 నక్షత్రాలను మూడు భాగాలుగా చేశారు.
దేవగణ నక్షత్రాలు..
అశ్వని
మృగశిర
పునర్వసు
పుష్యమి
హస్త
స్వాతి
అనురాధ
శ్రావణం
రేవతి
దేవగణ నక్షత్ర జాతకులు సాత్విక గుణం కలిగి ఉంటారు.శాంత స్వభావం కలిగి ఉంటారు. పరోపకారులై ఉంటారు. ఓర్పు, సహనం కలిగి ఉంటారు.
మనుష్యగణ నక్షత్రాలు..
భరణి
రోహిణి
ఆరుద్ర
పుబ్బ
ఉత్తర
పూర్వాషాడ
ఉత్తరాషాడ
పూర్వభధ్ర
ఉత్తర భధ్ర
మనుష్యగణ నక్షత్ర జాతకులు రజో గుణ లక్షణాలు కలిగి ఉంటారు. మంచి చెడు రెండు కలిగి ఉంటారు. భాదించటం, వేధించటం చేయరు.ఎవ్వరికీ హాని తలపెట్టరు.
రాక్షస గణ నక్షత్రాలు..
కృత్తిక
ఆశ్లేష
మఖ
చిత్త
విశాఖ
జ్యేష్ఠ
మూల
ధనిష్ట
శతబిషం
రాక్షసగణ నక్షత్ర జాతకులు తామస గుణ లక్షణాలు కలిగి ఉంటారు. అసూయ ద్వేషాలు కలిగి ఉంటారు. కఠినంగా మాట్లాడుతారు.
మిక్కిలి స్వార్ధపరులు.
వధూవరులిద్దరిది ఒకే గణమైతే వారిద్దరి మధ్య సహకారం,ప్రేమానురాగాలు ఉంటాయి.
వధువుది మనుష్య గణమై వరునిది రాక్షస గణమైతే వారిద్దరిమధ్య బొత్తిగా అవగాహన లేకపోవటం , ఆమెకు విలువ ఇవ్వక తన ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు. వధువుది దైవగుణం వరునిది రాక్షసగణం అయితే సంసారంలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది.భార్యాభర్తల మద్య పొందిక కుదరదు.
Famous Posts:
> సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం
> భార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు
> ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఇక ఈజీ
> దేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది?
> ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు | మీకు ఎవరు చెప్పని విషయాలు
> వారాహీ తల్లిని పూజిస్తే పంటలు బాగా పండుతాయి
> శ్రీలక్ష్మీపూజ ఇలా చేస్తే ధనమే ధనం
> బియ్యపు గింజతో ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది ఎలాగో తెలుసా ?
> గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా ఎలా మారిందో తెలుసా ?
> ఎంతటి కష్టాన్ని అయిన పోగొట్టే అత్యంత శక్తివంతమైన హనుమ లాంగూల స్తోత్రమ్
Vastu shastra, వాస్తు వేధ దోషాలు, వాస్తు, vastu sandehalu in telugu, telugu vastu for house plan, vastu directions in telugu, west facing house vastu in telugu, main door vastu in telugu, west facing house vastu in telugu, Vastu For House, Vastu Tips,
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
I just stumbled upon your blog and wanted to say that I have really enjoyed reading your blog posts. Any way I’ll be subscribing to your feed and I hope you post again soon. Vastu consultant in Hyderabad
ReplyDelete