Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

నల్ల దారం కట్టుకోవడం వెనక రహస్యమేంటి? Benefits of Wearing a Black Thread on Leg | Significance Of Wearing Black Thread

కాలుకి నల్లదారం కట్టడం వెనక ఉన్న రహస్యం తెలిస్తే వెంటనే మీరు కట్టుకుంటారు ..

ఈ రోజుల్లో ఎక్కువ మంది కాలికి నల్లదారం కట్టుకోవడం చేస్తున్నారు. దీన్ని ఒకరిని చూసి మరొకరు ఫాలో అవుతున్నారు. ఇది చూడ్డానికి అందంగా కూడా కనిపిస్తుండడంతో యూత్ చాలా మంది వీటిని ఇష్టపడుతున్నారు.

ఇలా ఒకరు ఇష్టపడుతూ ఇలాంటివాటిని కట్టుకోవడం వల్ల వీటికి గిరాకీ పెరిగిందనే చెప్పొచ్చు.

ఈ నేపథ్యంలోనే వీటికి పూసలు, మువ్వలు ఇలా కొత్త అదనపు హంగులు వచ్చి చేరాయి. అయితే, ఇది కేవలం అందం కోసం అనుకుంటే పొరపాటే.. దీని వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని కొందరు చెబుతున్నారు. భారతదేశంలో నల్లదారం కట్టుకోవడం అనేది ఇప్పుడు మొదలైంది ఏం కాదు. ఇది మన హిందూ సంప్రదాయంలో పూర్వం నుంచి వస్తున్న ఆచారమే. నలుపు రంగు ప్రతి కూల శక్తిని త్వరగా గ్రహిస్తుంది. 

అందుకే దిష్టి తగలకుండా నలుపు రంగులో ఉన్న ఎన్నో వస్తువులని మనం వాడుతుంటాం. పిల్లలకి దిష్టి తగలకుండా నలుపు రంగు బొట్టు పెట్టడం, కాలికి పెట్టడం, అదే విధంగా, మనం కూడా బయటికి వెళ్లినప్పుడు పాదానికి దిష్టి తగలకుండా పెట్టడం, ఇలా ప్రతి విషయంలోనూ నలుపు రుంగుని ప్రతి కూల శక్తిని దూరం చేస్తుందని వాడతారు.

ఈ నేపథ్యంలోనే పాదం పైభాగంలో, మెడ, నడుము, మణికట్టు చుట్టూ ఇలా అనేక ప్రదేశాల్లో వీటిని కట్టుకుంటారు. ఇలా కట్టడం ఫ్యాషన్‌గా అని కూడా యూత్ భావిస్తుంటుంది. అదే విధంగా, నల్ల దారాన్ని మొలతాడుగా నడుముకి కట్టుకుంటారు, కాలికి కూడా కట్టుకుంటారు.

Also Readపిల్లల పెంపకంలో ప్రతి తల్లి తండ్రి చేస్తున్న అతి పెద్ద తప్పులు ఇవే  

ఇది ఎందుకంటే, నడుముకి కట్టడం వల్ల పొట్ట పెరగకుండా, నడుము పరిమాణాన్ని నియంత్రించడంలో సాయపడుతుందని అంటారు. దీంతో పాటే వెన్ను నొప్పి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని కూడా నిపుణులు చెబుతున్నారు. నల్లదారం ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.

ఇలా చేయడం వల్ల సంతానోత్పత్తికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. నడుము దగ్గరగా నల్లదారం ఉండడం వల్ల పునరుత్పత్తి అవయవాలు చల్లగా మారుతాయట. దీని వల్ల సంతానలేమి సమస్యలు దూరం అవుతాయట.

అందుకే పూర్వం నుంచి మన పెద్దలు ఇలాంటి ఆచారాలను పాటిస్తారని చెబుతున్నారు. అదే ఆచారం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారి కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.

Famous Posts:

పూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు ఉండవచ్చా?


నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి.?


మీ ఇంటిలోని దుష్టశక్తులను నివారించడానికి పూజ గదిలో ఇలా చేయండి


మరణం తరువాత ఏం  జరుగుతుంది?


అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి..


నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ?


భార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించండి.


ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు.

నల్ల దారం, which leg to wear black thread for women's, which leg to wear black thread for mens, which leg to wear black thread for baby boy, benefits of wearing black thread in leg, black thread on which leg for gents, black thread in leg means, how to tie black thread on leg, which hand to wear black thread for ladies, Black thread, leg, 

Comments

Post a Comment

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు