Drop Down Menus

సర్వ కార్యసిద్ది వారాహి వ్రతం | Benefits of worshipping Goddess Varahi Vratam in Telugu | Varahi Mantram

సర్వ కార్యసిద్ది వారాహి వ్రతం:
వారాహి మాత పూజకు మొదట పూజకు అమ్మవారి పటం, లేకపోతే అమ్మ వారిని ఆవాహన చేస్తూ కలశం అయిన పెట్టవచ్చు,అది కాకపోతే మనం నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వెలిగించి అయిన అమ్మ ఈ దీప కాంతిని నీ రూపంగా భావిస్తున్నాను,అని మనసులో అనుకోని 16 శుక్రవారాలు వారాహి మాత పూజ మొదలు పెట్టవచ్చు.

ఇక్కడ ప్రధానంగా భక్తి ముఖ్యం, విగ్రహాలు ఫోటో ఖచ్చితంగా ఉండాలనే నియమం ఏమీ లేదు కనుక మనం ఇంట్లో వెలిగించే దీపాన్నే వారాహి మాతగా భావించి పూజ మొదలు పెట్టవచ్చు.

కానీ ప్రతి నెల 2 సార్లు వచ్చే పంచమి తిధిని మాత్రం మిస్ అవ్వకుండా  వారాహి మాత పూజని గుండ్రంగా ఉండే 5 లడ్డులను నైవేద్యంగా సమర్పించీ,దీపారాధన చేయాలి, అలాగే ఈమెకు రాత్రి దేవత అనే పేరు ఉంది కనుక ఈ పూజని సాధ్యమైనంతవరకు, సాయంకాలం 6 గo పైన మొదలు పెట్టి మీ ఓపిక ఉన్నంత వరకు అమ్మని ధ్యానించుకోవచ్చు, ఇంట్లో అమ్మలకు నెలసరి వచ్చినప్పుడు, మీ భర్తలతో కానీ మీ పిల్లలతో కానీ దీపారాధన చేయించి పంచమి తిథిని మిస్ అవ్వకుండా ఇంట్లో పూజ చేసుకోవచ్చు.

ఈమెకు పగటి పూజకంటే సాయంకాలం పూజ చేయటం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెబుతోంది. కనుక మన గ్రూపులో వారాహి మాత పట్ల విశ్వాసం ఉన్నవాళ్లు అందరూ ఇప్పుడు వచ్చే పంచమి తిథి నుంచి 16 శుక్రవారాల పూజను మొదలు పెట్టండి ఈ పూజ వల్ల కలిగే లాభాలు మనకున్న చిన్నపాటి  సమస్యలు ఈ చిన్న పూజ వల్ల దాదాపు పరిష్కరించుకోవచ్చు.

పూజకు కావాల్సిన సామగ్రి
1.పసుపు
2.కుంకుమ
3.ఆగర్భత్తులు
4.దానిమ్మ పండు గింజలు
5.లడ్డులు(5)
6.అమ్మ వారి చిత్రపటం,విగ్రహం,కలశం, ఇవేవీ లేకపోయినా పర్వాలేదు దీపాన్ని వెలిగించి, అ దీపకాంతిని వారాహిమాత  గా భావించి కూడా పూజ మొదలు పెట్టవచ్చు.

6. (పువ్వులు) ఖచ్చితంగా పలనా పువ్వులు పెట్టాలని రూల్ ఏమీ లేదు ఏవైనా అమ్మవారికి సమర్పించవచ్చు, అలాగే అమ్మవారినీ,భూదేవి అని అంటారు, కనుక ఈ భూమిమీద ఏ పువ్వు అయిన రోడ్డు పక్కన మన పెరటిలో వికసించిన ఏ పుష్పం అయిన అమ్మకు ఇష్టం, పూలకోసం ప్రత్యేక ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.

దానిమ్మ గింజాలు ఒక గుప్పెడు,లడ్డులు 5 గుండ్రంగా ఉండాలి

శక్తి ఆరాధన గ్రూప్ సభ్యులకు మనవి, వారాహి అంటే కేవలం క్షుద్ర పూజలు అనుకొనే వారికి నా విన్నపం దయచేసి మీరు ఇక్కడ ఒక్క విషయం గమనించాలి, అమ్మ చల్లని తల్లి ఒకరి వినాశనం కోరుకొని చేసే పూజ ఎప్పటికి ఫలితాన్ని ఇవ్వదు, మనం బాగుండాలి మనతో పాటు నలుగురు బాగుండాలి అనుకొనే వాళ్ళు మాత్రమే అమ్మ కృపకు పాత్రులు ఎప్పుడైతే నీ మనసులో చెడు ఆలోచన తో పూజ చేయాలి అనుకుంటావో నీ వినాశనం అప్పుడే మొదలు అయినది అని దాని అర్థం, మీరు యూట్యూబ్ లో మరియు ఇతరత్రా సోషల్ మీడియాలలో చూస్తున్నా వార్తలను నమ్మి మోసపోకండి, ఈ పూజ కేవలం 4 అంశాలను పరిగణనలోకి తీసుకొని చేయిస్తున్నాను
1.ఆర్ధిక ఇబ్బంది
2.వ్యాపార అభివృద్ధి
3.ఇంట్లో తరచు కలహాలు
4.మానసిక ప్రశాంతత
కేవలం ఇలాంటి విషయాలు పరిగణలోకి తీసుకుని పూజ చేయమంటూతున్నాను,ఈ విషయం అందరూ గమనించగలరు.

ఓం నమో వారాహి
మన పురాణాల ప్రకారం మహా శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్త మాతృకలు,వీరే బ్రహ్మీ,మాహేశ్వరి,కౌమారి,వైష్ణవి, వారాహి,ఇంద్రాణి,చాముండీ.
8.వ మాతృక గా నారసింహి
9.వ మాతృక గా వినాయకి నీ ఆరాధించడం జరుగుతుంది,భక్తులకు కొంగుబంగారంగా మనల్ని ఎప్పుడు చల్లగా చూసేందుకు వీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు,ఈ సప్త మాతృక స్వరూపిణి ఈ వారాహి మాతగా పరిగణించపడుతోంది, ఈ వారాహిరూపం పంది రూపాన్ని పోలిఉండి,నల్లని శరీరఛాయాతో మేగవర్ణంతో 8 చేతులతో, అభయ వరద హస్తం,శంకు చక్ర, రోకలి నాగలి,పాశం హలం ఆయుధాలతో భక్తులకు దర్శనం ఇస్తుంది,ముక్యంగా లలితదేవికి సర్వసైన్యాధ్యక్షురాలు ఈ వారాహిమాత,అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రనామాలలో వినిపిస్తుంది,వారాహి మాతను భక్తి శ్రద్ధలతో కొలిచినవారికి,భక్తుల పాలిట   కొంగు బంగారమై,తన పైన నమ్మకం ఉంచిన వారి సమస్యలపై గొప్ప యోధురాలిగా నిలిచి జీవితంలో భక్తులకు ఎదురయ్యే అడ్డంకులన్ని తొలగించి,శత్రుభయం,జ్ఞాన సిద్ధిబుద్ధి,ధనప్రాప్తి,ఇంకా అనేక అనేక సకల జయాలు సిద్ధిస్తాయి,అలాగే ఈమె అజ్ఞాచక్ర కుండలిని జాగృతికి కూడా ఎంతో సహాయపడుతుంది, అందుకే  ఆమెను ఆజ్ఞచక్రేశ్వరి అన్నారు,శుంభ నీశుoబ,రక్త బీజ వధలోను ఈమె ప్రస్తావన ఉంది.
ప్రతినిత్యం మీరు ఈ నామాలను స్మరిచండి....
ఓం పంచమే నమః
ఓం దండనాథ నమః
ఓం సంకేత నమః
ఓం సమయేశ్వరి నమః
ఓం సమయ సంకేత నమః
ఓం పోత్రిన్యే నమః
ఓం శివయే నమః
ఓం ఆజ్ఞ చక్రేశ్వరి నమః
ఓం మహా సైన్యయే నమః
ఓం వార్తాలీ నమః

ఈ నామాలతో స్మరిస్తే సకల కార్య సిద్ధి లభిస్తుంది.

॥ వారాహీ గాయత్రీ ॥

వరాహముఖ్యై విద్మహే । దణ్డనాథాయై ధీమహీ ।
తన్నో అర్ఘ్రి ప్రచోదయాత్

(వారాహి మాత ధ్యాన స్తోత్రం)
వన్దే వారాహవక్త్రాం వరమణిమకుటాం విద్రుమశ్రోత్రభూషామ్
హారాగ్రైవేయతుంగస్తనభరనమితాం పీతకైశేయవస్త్రామ్ ।
దేవీం దక్షోధ్వహస్తే ముసలమథపరం లాఙ్గలం వా కపాలమ్
వామాభ్యాం ధారయన్తీం కువలయకలితాం శ్యామలాం సుప్రసన్నామ్

వారాహి అమ్మ వారి అవతారాలు
1.బృహత్ వారాహి
2.స్వప్న వారాహి
3.కిరాతా వారాహి
4.లఘు వారాహి
5.ధూమ్ర వారాహి
6.మహా వారాహి గా చెప్పబడుతున్నది.
1.బృహత్ వారాహి అనగా శత్రు శేషం ఉండదు అనగా మీరు ఈ అవతరాన్ని ఉపాసించడం వల్ల, మన లోని అంతర్ శత్రువులు కామ, క్రోధ, మద, మచర్యాలు,నశించి, మన అంతర్ ముకంగా ఉన్న శత్రువులను అమ్మ నశి oపచేస్తుంది,ఇది మన దక్షణాచారం లో అమ్మను కొలిచే పద్దతి.

2.స్వప్న వారాహి
ఈ స్వప్న వారాహి ని కొలిచే సాధకులకు అమ్మ స్వప్నంలో భూత,భవిషత్, వర్థమానాలను తెలియచేస్తూ, సాధకులకు కానీ వారి కుటుంబసభ్యులకు కానీ ఏదైనా ప్రమాదం కానీ, మంచి చెడులను ముందుగానే సాధకుల స్వప్నంలో కనిపించి,సమాధానం చెబుతుంది.

6. మహా వారాహి భక్తుల పాలిట కొంగుబంగారంగా, కోరిన కోరికలు తీర్చే తల్లిగా మనకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటుంది.

కిరత వారాహి, లఘు వారాహి,ధూమ్ర వారాహి అవతారాలు వాటి విశిష్టత మనకు ఇక్కడ అవసరం లేదు. ఇప్పుడు చెప్పిన విధంగా 5 శుక్రవారాలు ఆ తల్లికి విశేషంగా పూజించుకోవచ్చి.

శత్రు బాధ నివారణ, గ్రహాబాధ, అనారోగ్యంతో బాధ , పిల్లలే సమస్యగా మారిన తల్లి తండ్రులు చేయగలం ఈ విధంగా అని మీకు అనుకుంటే పైన చెప్పిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని శుక్ల పక్షం లేదా కృష్ణ పక్షం లో వచ్చే పంచమి తిది రోజు పూజ మొదలు పెట్టి వారాహి ఉపాసన ఇప్పుడు ఇక్కడ ఇస్తున్న విధంగా రోజు చేయాలి అనుకునే వారు ఈ మంత్రాన్ని జపం చేయడం మీదలు పెట్టాలి మీ శక్తి వంచన లేకుండా రోజూ 108 సార్లు ఈ మంత్రాన్ని జపించ గుండ్రంగా ఉండే ఆహారం ముఖ్యంగా దానిమ్మపండు లాంటివి నివిధాన చేసి 5 వారాలు జపం చేయాలి. మీ సంకల్పం నెరవేరుతుంది. అదే ఈ మంత్రం..
శ్రీ బృహద్వారాహీ ధ్యానం
రక్తాంబుజే ప్రేతవరాసనస్థామర్థోరు కామార్భటికాసనస్థాం
దంష్ట్రోల్లసత్పోత్రి ముఖారవిందాం కోటీర సంఛిన్న హిమాంశురేఖాం
హలం కపాలం దధతీం కరాభ్యాం వామౌతరాభ్యాం ముసలేష్టదౌచ
రక్తాంబరాం రక్తపటోత్తరీయాం ప్రవాళ కర్ణాభరణాం త్రినేత్రాం
శ్యామాం సమస్తాభరణ స్రగాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రణతోస్మి నిత్యమ్ II
సర్వ బాధ నివారిణి అయిన బృహద్వారాహి మహా మంత్రం
Famous Posts:

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.


శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు


శివ గుణాలు లోకానికి సందేశాలు


భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?


కూతురా కోడలా ఎవరు ప్రధానం...?


సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?


కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?


మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి


సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 

వారాహీ దేవి, బృహద్వారాహీ మహా మంత్రం, varahi devi moola mantra in telugu, varahi tantra books in telugu, how to do varalakshmi pooja at home in telugu, varahi upasana book pdf, swapna varahi mantra sadhana in telugu, varahi mantra in telugu pdf, varahi devi puja in telugu, varahi tantra pdf download

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. శక్తి ఆరాధన శ్రీచక్ర ఉపాసన గ్రూప్ లో పూర్తిగా వ్రత విధానం కాపీ చేసి పెట్టండి.

    ReplyDelete

Post a Comment

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.