మానవ ఆచార వ్యవహారాల విషయంలో, శకునాల పాత్ర ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది. అయితే శకునాలు రెండు రకాలుగా భావించవచ్చు. శుభ శకునాలు, అశుభ శకునాలు. ఏ పని ప్రారంభించినా శుభ శకునం చూసుకొని ప్రారంభించాలి. అశుభ శకునం ఎదురైతే ఆ పని అసంపూర్ణంగా ముగుస్తుందని పూర్వ కాలం నుంచి ఆధునిక కాలం వరకు నమ్మకం ఉంది.
మంచి శకునం ఎదురు రావడం వలన, తలపెట్టిన కార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంద పురాతన కాలం నుంచి ఉన్న విశ్వాసం ఇప్పటికీ కొనసాగుతోంది. శకునం విషయంలో చాలామంది తమ పెద్దల మార్గాన్నే అనుసరిస్తూ ఉంటారు. వ్యాపార వ్యవహారాల నిమిత్తమైనా.. శుభకార్యాల నిమిత్తమైనా బయలుదేరుతూ వున్నప్పుడు మంచి శకునం చూసుకుంటూ ఉండాల్సిందే. మంగళప్రదమైన ధ్వనులు … శుభప్రదమైన వస్తువులు ఎదురైనప్పుడు మంచి శకునాలుగా భావించి అడుగుబయటికి పెట్టాలి.
అలాగే కొన్ని శకునాలు కార్యహానిని కలిగించేవిగా చెప్పబడుతున్నాయి. ఇంట్లో నుంచి అడుగు బయటికి పెడుతూ వుండగా ఎక్కడి నుంచైనా ఒక్కసారిగా ఏడుపులు వినిపించినా, ఏదో ఒక కారణంగా ఎవరైనా ఏడుస్తూ ఎదురుగా పరిగెత్తుకు వచ్చినా అది కార్య హానిని కలిగించే శకునంగా చెప్పబడుతోంది. అందుకే అలాంటి శకునం ఎదురైనప్పుడు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని శాస్త్రం చెప్పబడుతోంది.
శుభ_శకునాలు
పెళ్ళి ఊరేగింపు, మంగళ వాయిద్యములు, ఇద్దరు బ్రాహ్మణులు, దండధరుడగు శూద్రుడు, కన్య, ముతైదువు, పండ్లు, పువ్వులు, ఛత్రచామరములు, ఏనుగు, గుఱ్ఱము, పూర్ణకుంభము, చెఱుకు, పాలు, అన్నము, పెరుగు, ఆవు, బియ్యము, కల్లుకుండ, మాంసము, పొగలేని నిప్పు, తేనె, చలువ వస్త్రాలు, అక్షతలు, వీణ, మృదంగం, శంఖం, నల్లకోతి, భ్రమరము, తెల్లని వస్తువులు, కుక్క చెవి విదల్చుట, వధూవరులు, ఘంటానాదం, జయశబ్దము, మంగళ వస్తువులు, ఎదురుగా మృదువైన శీతల వాయువులు వీచుట లేదా వెనుక నుంచి ప్రయాణానికి అనువైన గాలులు వీచుట, తెల్లని వృషభము, అద్దం మొదలైనవి ఎదురుపడిన శుభప్రదం.
Also Read : ఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి
పశుపక్ష్యాదుల్లో నెమలి, కోడి, చిలుక, కొంగ, కుందేలు, నక్క, గ్రద్ద, ఆవు, జింక, ఉడుత, చిరుత వంటివి ఎడమ నుంచి కుడి వైపుగా వెళ్ళాయంటే వీటన్నిటిని శుభ శకునాలుగా గుర్తించవచ్చు.
అశుభ_శకునాలు
ఏడుపు వినుట, అకాల వర్షము, ముక్కు చీదుట, బల్లిపడుట, వితంతువులు, జుట్టు విరబోసుకున్నవారు, జుట్టులేనివారు, ఒకే తుమ్ము, ఊక, కలహము, చెడుమాట, ముగ్గురు వైశ్యులు, జంటశూద్రులు, కషాయ బట్టలు కట్టినవారు, పాము, కొత్తకుండ, నూనె, కట్టెలమోపు, ముష్టివాడు, కుంటికుక్క, ముక్కులేనివాడు, గుడ్డివాడు, రోగి, కుంటివాడు, రజస్వల, గర్భిణీస్ర్తీ, ఉప్పు, బొగ్గులు, రాళ్ళు, ఆమేధ్యం, నువ్వులు, మినుములు, గొఱ్ఱెలు, నపుంసకులు, పిల్లి, పంది, దూది, మజ్జిగ, బూడిద, కురూపి, చెడు జంతువులు, ఆయుధమును ధరించినవాడు, విరోధి, వెళ్ళవద్దని కోరుట, భోజనము చేయమని అడుగుట, సిద్ధవస్తువులు, జారుట, దెబ్బతగులుట, తొట్రుపడుట, మనసు కీడు శంకించుట, ఆరోగ్యము లేకుండుట, గుడ్లగూబ అరచుట.. వంటి పరిణామాలు ఎదురుపడినా ఇవన్నీ అశుభాలే.
అశుభ శకునాలు ఎదురైన వెంటనే ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని 12 పర్యాయాలు నీళ్ళు పుకిలించి ఊయవలెను. తలపై నీరు చల్లుకొని.. కళ్ళు నీళ్ళతో తుడుచుకొని కూర్చుని కాసిన్ని నీళ్లు తాగి ఇష్టదైవంను ప్రార్థించి, తర్వాత మరొక శుభ శకునమును చూసుకొని ప్రయాణం చేయవలెను. ప్రయాణాలకు బయలుదేరునప్పుడు ‘ఎక్కడికి?’ అని గానీ, ‘ఎప్పుడు వస్తావు?’ అని గానీ, ‘నేనూ రానా?’ అని గానీ ఎవరూ అడుగరాదు. ప్రయాణమై వెళ్ళిన వెంటనే ఇల్లు కడుగుట, ఇల్లాలు తలస్నానం చేయుట దరిద్రానికి కారణాలు. అందుకే ఇలాంటి విషయాల్లో తగిన రీతిలో ఉండటమే మంచిది..
Famous Posts:
> కూతురా కోడలా ఎవరు ప్రధానం...?
> సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
> కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?
> మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి.
> సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.
> భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?
> మహాభారతం నుండి నేర్చుకోవాల్సిన 12 ముఖ్యమైన విషయాలు.
శకునాలు, వాస్తు శాస్త్రం, Sakuna sastra, sakuna sastram telugu pdf, sakuna sastram pdf, sakuna sastram telugu pdf free download, subha asubha sakunalu telugu