Drop Down Menus

సమస్యలు పరిష్కారాలు | Dharma Sandehalu | PROBLEMS and SOLUTIONS | Hindu Temple Guide

సమస్యలు పరిష్కారాలు:-

👉 ఎంత ప్రయత్నించినా మీ ప్రయత్నం ఫలితాలు లేదా మీ కృషికి తగిన ఆదాయం పొందలేకపోతే ఇంటి ముందు గానీ ఇరువైపులా గానీ , ఎండిన చెరువు, నదులు, సరస్సులు ఉండి ఉండాలి! అది కనబడకుండా ఉండాలంటే డోర్ కి కర్టెన్లు వేయాలి. అద్దె ఇల్లు అయితే వేరే ఇంటికి మారండి . అటువంటి చిత్రపటాలు కూడా ఇంట్లో ఉండకూడదు.

👉 ఆర్థిక నష్టాలు తొలగాలంటే , నీళ్ళలో పచ్చిపాలను కలిపి ఇంట్లోని గదులంతటా చిలకరించి తుడిచి వేయండి. గడపను కూడా అదే నీటితో కడిగి పసుపు, కుంకుమ , పుష్పాలతో అలంకరించుకోవాలి. మిగిలిన నీటిని వృక్షాలకు పోయాలి . ధనలాభం కలుగుతుంది. 

👉 దారిద్ర్య బాధలు తొలగాలంటే చాతుర్మాసంలో ప్రతీ మాసంలో మీ జన్మనక్షత్రం రోజున వస్త్రాది దానాలు చెయండి.

👉 ఋణబాధలు తీరాలి అంటే లక్ష్మీదేవి చిత్రపటం ముందు 8 ప్రమిదలను ఆవునేతితో లేదా నువ్వులనూనెతో దీపారాధన చేసి ఒక్కో దీపం వద్ద ఒక్కోక్క తీపి పదార్థం నివేదనగా ఉంచి పూజ అనంతరం కుటుంబ సభ్యులు అందరూ మహాప్రసాదంగా తీసుకుని మిగిలిన పదార్థాలన్నీ పేదలకు పంచండి. ఋణబాధలు నుంచి విముక్తి కలిగి సంతోషకరమైన జీవితం పొందుతారు ఈ విధంగా 4 వారాలు చేయండి.

👉 శతృపీడలు అధికమైతే విభూది లింగమును పూజించి నదిలో నిమజ్జనం చేయడం మంచిది.

👉 అనవసరమైన ఖర్చులు పెరుగుతుంటే ప్రతీ మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణము చేయవలెను. అదే రోజు పేదవారికి ఏదైనా దానం చేయాలి. మరుసటి రోజు అంటే ఋధవారం కూడా జానపదులు పాడే వారికి కానీ , బుడబుక్కల వారికి గానీ లేదా గంగిరెద్దుల వారికి కానీ కొంత డబ్బు సహాయం చేయండి. ఈ విధంగా 7 మంగళవారాలు , 7 బుధవారాలు చేయడం  వల్ల ఆకస్మికంగా ధనం ధాన్యం లభ్యం అవుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుముఖం పడతాయి. ఆదాయం పెరుగుతుంది.

👉 బ్యాంకు ఋణములు పొందుటకు ఎంత ప్రయత్నించినా ఫలితం అనుకూలంగా కనిపించకపోతే బుధ వారం రోజు రాత్రి శనగలను నానబెట్టి గురువారం ఉదయం కపిల గోవునకు తినిపించి గంగడోలును స్పురించండి.అలా రెండు సార్లు చేస్తే ప్రయోజనం ఉంటుంది .

👉 ఆదివారం రవిహోరలో ఉదయం 10:30, 11.00 గంట సమయంలో సేకరించిన తెల్లజిల్లేడు చెట్టు వేరును అష్టగంధంతో కలిపి తావీజు నందు బంధించి మెడ లేదా నడుముకు ధరిస్తే దారిద్ర్యం నశించి , శతృవులపై విజయం కలిగి వారి ద్వారానే ధనలాభం కలుగుతుంది.

👉 అసుర సంధ్యా సమయం లో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణము తొమ్మిది సార్లు పారాయణం చేస్తే శతృభయం ఉండదు .

Famous Posts:

దేవుడికి ఏ పుష్పాన్ని అర్పింస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది


భార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త వందేళ్లు జీవిస్తాడు.


ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు


చాలామందికి  తెలియని గాయత్రీ మంత్రం రహస్యం


ప్రకారం ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు


ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?


మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి


నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి..?

Dharma Sandehalu, dharma sandehalu 2020, dharma sandehalu online, dharma sandehalu telugu, సమస్యలు పరిష్కారాలు, lord shiva abhisekham, hanuman chalisa.

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.