Drop Down Menus

నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ క్షేత్ర మహిమ | Nithya Kalyana Perumal Temple | Thiruvidanthai, Timings | Tamil Nadu

 

క్షేత్ర సందర్శనం:

నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ క్షేత్ర మహిమ

పెళ్లి వయస్సు దాటిపోతున్నా పెళ్లి కావట్లేదా…

అయితే ఒక్క సారి ఈగుడిని దర్శించండి.

Also Readఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?

అన్ని అనుకూలంగా ఉన్నా, 

మంచి ఉద్యోగం చేస్తున్నా, 

మంచి కుటుంబం ఉన్నప్పటికి, 

మంచి ఆస్తిపరుడైనప్పటికి..

కొందరు అబ్బాయిలకు..అమ్మాయిలకు  పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఫలితం ఇవ్వవు. 

పెళ్లి ఏర్పాట్లలో ఏదో ఒక లోపం తలెత్తి పెళ్లి క్యాన్సల్‌ అవ్వడం జరుగుతుంది.

Also Readభర్త భార్యను ఇలా పిలవడం మానేయండి. 

పెళ్లి జరుగుతుందని భావిస్తున్న సమయంలో ఏదో ఒక కారణం వల్ల ఆ పెళ్లి చెడిపోవడం లేదా మరేదైనా కారణం వల్ల పెళ్లి పీటల వద్దకు రాకుండానే ఆగిపోవడం జరుగుతుంది. 

ఇలాంటి వారికి కొన్ని దోషాలు ఉంటాయి.

ఆ దోషాల కారణంగానే పెళ్లి జరగకుండా ఏదో శక్తి అడ్డు పడుతూ ఉంటుంది. 

అలాంటి దుష్ట శక్తిని తొలగించుకుని పెళ్లి చేసుకోవాలి 

అంటే తమిళనాడులోని తిరుమణ తిరుతల సుట్రుల్లా దేవాలయాన్ని సందర్శించాలి. 

అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఆ గుడిని సందర్శించి అక్కడ దైవారాధన చేయడం వల్ల వెంటనే పెళ్లి అవుతుందని నమ్మకం.

Also Readభార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించండి. 

తమిళనాడులో ఎక్కువ శాతం ప్రజలు దీన్ని నమ్ముతున్నారు. 

తమిళనాడు నుండే కాకుండా కర్ణాటక మరియు కేరళ నుండి కూడా ఆ గుడికి వెళ్తారు. 

ఏపీలో కూడా కొందరు ఆ గుడికి వెళ్లడం వల్ల తమ పెళ్లి అయ్యిందని చెబుతున్నారు. 

ఆ గుడి మహత్తు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మహాబలిపురం దగ్గర లో తిరువిడనత్తై వద్ద ఉన్న శ్రీ లక్ష్మి వరాహస్వామి ఆలయము ఉంది . 

ఈ ఆలయము లో లక్ష్మి దేవిని కోమలవల్లీ తాయారు గా మరియు విష్ణువును వరాహ అవతారంలో పూజిస్తారు. విష్ణువు సన్యాసికి పుట్టిన 360 మంది సంతానాన్ని పెళ్లిచేసుకున్నాడు కనుక, ఈ స్వామీని భక్తులు ‘నిత్య కళ్యాణ పెరుమాళ్’ గా వ్యవహరిస్తారు.

తిరుమనం అంటే వివాహం, 

చేరి అంటే గ్రామం అని అర్ధం. 

పురాణం ప్రకారం శివుడు పార్వతి దేవిని పరిణయం ఆడినది ఇక్కడే. 

తిరుమనంచేరిని సందర్శించటం ద్వారా వివాహానికి ఉన్న అవరోధాలు తొలగిపోతాయని చెప్తారు.

కుంభకోణం నుండి 7 కి.మీ ల దూరంలో ఉప్పిలి అప్పన్ ఆలయం కలదు. 

ఉప్పిలి అప్పన్ అంటే ఉపమానాలకు అందనివాడు అనుపమానుడు అని అర్ధం . 

ఇక్కడ మార్కండేయ ఋషికి భూదేవి చిన్న బాలిక గా లభించింది. 

Also Readపూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు ఉండవచ్చా?

ఆమె ” కోకిలాంబాళ్ ” పేరుతో పెంచి పెద్దచేసి,

శ్రీ మహావిష్ణువు కిచ్చి వివాహము జరిపించాడని ప్రతితీ. ఆలయంలో ఉప్పులేకుండా నైవేద్యం పెడతారు.

తిరుకరుకావూర్ ఆలయము తంజావూర్ కు మరియు కుంభకోణం పట్టణాలకు 20 km ల దూరంలో కలదు. 

ఇది ఒక ప్రసిద్ద శివాలయ క్షేత్రము . 

ఇక్కడ అమ్మవారు గర్భరక్షాంబిగై . 

ఈ అమ్మవారిని పెళ్లికాని వారు, 

సంతానము లేని దంపతులు .. 

భక్తీ శ్రద్దలతో పూజించి దర్శనము చేసుకుంటారు.

శ్రీ దేవి భూదేవి సమేత శ్రీమహా విష్ణువు ” సారనాథుడుగా ” కొలువై ఉన్నాడు. 

ఇక్కడి అమ్మవారికి ‘సారనాయకి’ అనే పేరు ఉంది. కావేరినది దేవి శ్రీహరిని ఇక్కడ వివాహము ఆడింది ఇక్కడేనని స్థలపురాణంలో పేర్కొన్నారు.

Also Readప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు

ఈ ఆలయము దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన గొప్ప పుణ్య క్షేత్రము . 

పాండ్యరాజు తన కుమార్తె అయిన మీనాక్షి దేవిని చొక్కనాథుడు అయిన పరమేశ్వరునికి ఇచ్చి వివాహము చేసిన స్థలము గా ప్రసిద్ది చెందినది . 

పెళ్ళికాని వారు మధుర మీనాక్షిదేవిని దర్శించుకోవడము అనాదిగా వస్తున్న ఆచారము.

పెళ్లి కానీ వారు ఈ దేవాలయంలో పూజలు చేయడం అనేది ఇప్పటి ఆచారం కాదు.. 

కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. పెద్దలు నమ్మిన ఈ ఆలయాన్ని ఇప్పటికీ అక్కడి వారు నమ్ముతున్నారు. 

ఎన్నో పెళ్లిళ్లు ఈ దేవాలయంలో దర్శనం తర్వాత అయ్యాయి అని అక్కడ వారు అంటుంటారు.

Also Readఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?

నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ క్షేత్ర మహిమ:

వివాహం ఆలస్యమవుతున్న వారు, 

వివాహ విషయాల్లో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారు ఈ క్షేత్ర దర్శనం తో వివాహం జరుగుతుంది.

ఈ క్షేత్రాన్ని దర్శించి క్రింది విధంగా చేయాలి.

కోమలవల్లి సమేత వరాహ స్వామీ వారు కొలువైన క్షేత్రం ఈ నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్. 

1. వివాహం కోసం ఇక్కడకు వచ్చే భక్తులు రెండు పూల మాలలు ఆలయం లో దేవుడికి సమర్పించాలి. (పూల మాలలు గుడి ఎదురుగా ఉన్న దుకాణాల్లో లభిస్తాయి)

2. గోత్ర నామాలతో అర్చన చేసిన పిదప  అందులో ఒక మాల ను పూజారి గారు తిరిగి భక్తుడి మెడలో వేస్తారు. 

3. ఆ మాల ధరించిన భక్తుడు గుడి చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయాలి. తదుపరి కోమలవల్లి అమ్మవారిని దర్శించి కుంకుమను తీసుకోవాలి. 

అలా చేసిన 3 నుంచి 6 నెలల్లో వివాహం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వివాహం అయిన తదుపరి దంపతులిద్దరూ వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవాలి.

Also Readహిందూ సాంప్రదాయం ప్రకారం శుభ_అశుభశకునాలు –వాటి ఫలితాలు

దర్శన వేళలు:

ఉదయం6.00 నుంచి మధ్యాహ్నాం 12.00 వరకు 

సాయంత్రం 3.00 నుండి రాత్రి 8.00 వరకు

ఎలా చేరుకోవాలి:

చెన్నై నుంచి 45 kms 

మహాబలిపురం వెళ్లే బస్సులన్ని ఈ క్షేత్రం మీదుగానే వెళ్తాయి 

చిరునామా:

నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్, 

తిరువిడెంతై ( THIRUVIDANTHAI)

కాంచీపురం dist 

తమిళనాడు.

Famous Posts:

అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం.. ఎలా వెలిగించాలి? 

కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శివ గుణాలు లోకానికి సందేశాలు

భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

nithya kalyana perumal temple timings, nithya kalyana perumal temple marriage procedure, nithya kalyana perumal temple contact number, how to pray in nithya kalyana perumal temple, nithya kalyana perumal temple dress code, nithya kalyana perumal temple address, nithya kalyana perumal temple distance from chennai, nithya kalyana perumal temple history in telugu, Nithya Kalyana Perumal Temple, kanchipuram, tamil nadu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.