Drop Down Menus

పూర్వజన్మ కర్మ | Sanatana Dharma Telugu | Hindu Temple Guide

పూర్వజన్మ కర్మ...

బిల్వమంగళుడు, గురూరమ్మ  , వారి ఇంటికి నిత్యం శ్రీ కృష్ణుడే వచ్చి విందుభోజనం చేసి వెళ్ళే భాగ్యాన్ని పొందారు....

బిల్వమంగళుడు.. ఏకాదశీ ,  దశమి మరియు శ్రవణ నక్షత్రం రోజులలో తులసి తీర్ధం మాత్ర పుచ్చుకుని  ఉపవసించడం ఆచారంగా అనుసరిస్తూ వచ్చాడు.

కాని ఈ రోజులలో చక్కెర పొంగలి, పాల పాయసం  మాత్రం అడిగి  చేయమని చెప్పి ప్రియంగా తినే వాడు కృష్ణపరమాత్మ.

ఒకనాడు బిల్వమంగళుని

ఇంటికి అతని స్నేహితుడు వచ్చాడు. 

కడుపునొప్పి తో తాను బాధపడుతున్నానని చెప్పిన స్నేహితుడు, భగవాన్ కృష్ణుని అడిగి

తన బాధను తీర్చమని కోరాడు....

పిదప భగవంతుని దర్శించిన బిల్వమంగళుడు" తన స్నేహితుడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు ,  మీతో మొరపెట్టమని చెప్పాడు." ఆని అన్నాడు. 

తక్షణమే  శ్రీ కృష్ణుడు " ఇది  పూర్వ జన్మ కర్మ ఫలితం. నేనేమి చేయలేను అన్నాడు. 

ఈ బదులే తన మిత్రునికి తెలిపాడు బిల్వమంగళుడు.

మనసు బాధ పడగా ఆ మిత్రుడు,  గురూరమ్మని

కలుసుకున్నాడు.  తన కడుపు నెప్పి  బాధను తీర్చమని భగవంతుని ప్రార్ధించమని  ఆమెను కూడా   వేడుకున్నాడు....

ఆ తరువాత ,  ప్రతిరోజూ

వస్తున్నట్టే  తమ ఇంటికి

వచ్చిన  శ్రీకృష్ణుని  ప్రేమగా  ఆహారం వడ్డించింది గురూరమ్మ, పిదప  మిత్రుని కడుపు నెప్పి బాధ చెప్పి , నీవల్లనే అతని బాధ తగ్గించబడుతుంది" అని

భక్తితో ప్రార్ధించినది....

ఆమె ప్రార్ధనను  స్వీకరించిన  శ్రీ కృష్ణుడు

మిత్రుని కడుపునెప్పి తగ్గించి కటాక్షించాడు. 

ఆనందంతో  ఉక్కిరిబిక్కిరి అయ్యాడు మిత్రుడు.  బిల్వమంగళుని వద్దకు వెళ్ళాడు. గురూరమ్మ ప్రార్ధనతో తన ఉదర బాధ తీరినట్టు చెప్పాడు. 

బిల్వమంగళునికి కోపం, తను వేడుకొన్నప్పుడు భగవంతుడు తన మాట వినిపించుకోలేదే ' అనే చింత  అతనిక, భగవంతుని  అడగనే అడిగాడు. 

వెంటనే " బిల్వమంగళా ! 

మిత్రుని ఉదరబాధను గురించి  నీవు చెప్పడం ఏదో విషయం చెప్పినట్లు

మాత్రమే వున్నది.  అందుకే ఉదర బాధ వచ్చిన కారణం మాత్రమే నీకు తెలిపాను   కాని

గురూరమ్మ ప్రార్ధన  మాతృప్రేమ  నిండి వున్నది.  ఆత్మార్ధమైన పవిత్ర భక్తి , ప్రేమలతో వేడుకునే భక్తుల  కోరికలు నేను  తప్పక నెరవేరుస్తాను. "   అని విశిద పరిచాడు..... 

సత్యం గ్రహించిన  బిల్వమంగళుడు.

కన్నీటితో భగవాన్ శ్రీ కృష్ణునికి

వందనాలు సమర్పించాడు.

Famous Posts:

ఉద‌యం నిద్ర‌లేవ‌గానే వేటిని చూడ‌కూడదో, వేటిని చూడాలో మీకు తెలుసా..?  

పిల్లల కోసం శ్లోకాలు - స్తోత్రాలు

గ్రహదోషాల నుండి విముక్తి కలగాలంటే

పూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు ఉండవచ్చా?

నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి.?

మీ ఇంటిలోని దుష్టశక్తులను నివారించడానికి పూజ గదిలో ఇలా చేయండి

మరణం తరువాత ఏం  జరుగుతుంది? 

అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.. 

నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ?

పూర్వజన్మ కర్మ, Sanatana Dharma Telugu, shri krishna cast, krishna images, krishna story, lord krishna wife, jai shri krishna, lord krishna images, lord krishna stories, krishna cartoon

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.