Drop Down Menus

కార్తీక మాసంలో ఉపవాసం చేసేవాళ్ళు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ? karthika Masam Upavasam Rules

 

కార్తీక మాసంలో  ఉపవాసం ఎలా చేయాలంటే?

కార్తీక మాసంలో నక్తాలు ఉంటున్నాం అని కొందరంటుండటం వినిపిస్తుంటుంది. నక్తాలు ఉండటం అంటే ఉపవాసాలు ఉండటం అని అర్థం. ఉపవాసం అనే దానికి.. రోజంతా ఏమి తినకుండా, మరునాడు భోజనం చేయాలా?

ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి అనే సందేహాలు కలుగుతాయి. నక్తం అంటే రాత్రిపూట అని అర్థం. పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేయటాన్ని నక్తవ్రతమని, నక్త భోజనమని అంటారు. రాత్రిపూట తినమన్నారు కదా అని పది గంటలో, పదకొండు గంటలకో చేయకూడదు. సూర్యాస్తమయం అయి చుక్కలు కనిపించే సమయానికి చేయాలి. ఇలా చేయటం ఆరోగ్య ప్రదం.

Also Readమనసులోని కోర్కెలు తీర్చే దశావతార నృసింహ మంత్రము

ఈ విధి విధానాన్ని తెలుసుకోకుండా ఇష్టానుసారం భోజనం చేస్తే అది వ్రత పుణ్యఫలాన్ని ఇవ్వకపోగా అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే ప్రమాదముంది. అందుకే.. పెద్దల పర్యవేక్షణలో వ్రతాలను ఆచరించటం మేలు. ఈ వ్రతం కేవలం కార్తీకంలోనే కాదూ సంవత్సరంలో అన్ని మాసాలలోనూ, కొన్ని ప్రత్యేక తిథులలో ఆచరించటం ఆరోగ్యానికి క్షేమకరమని, పుణ్యప్రదమని తెలియచెబుతోంది లింగపురాణం.

పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రమే భోజనం చేసే ఈ వ్రతాన్ని ఎందుకాచరించాలి? అసలు ఉపవాసాలుంటూ ఏమీ తినకుండా ఉండేటప్పుడు ఎందుకు ఉద్యోగాలు చేయాలి, ధనాన్ని ఎందుకు సంపాదించాలి? అని కొందరికి కలిగే సందేహాలకు ఈ కథా సందర్భంలో సమాధానాలు దొరుకుతాయి. గృహస్తుడు అని అంటే తానొక్కడూ తిని కూర్చోకూడదు. అతడిమీద ఎన్నెన్నో జీవులు ఆధారపడి ఉంటాయి. వాటన్నింటికీ భోజనం పెట్టటం ద్వారా తృప్తి కలిగించాకే గృహస్తుడు తినాలి. దేవతలు ఉదయం పూట, ఋషులు మధ్యాహ్నవేళ, పితృదేవతలు అపరాహ్ణవేళ, గుహ్యకులు లాంటివారు సాయంసంధ్య సమయాలలో భోజనం చేస్తారు. అందుకని వారందరికీ వారి వారి సమయాలలో ఆహారాన్ని నివేదించి.. చుక్కలు కనిపించేటప్పుడు గృహస్తుడు తినాలి. గృహస్తుడిచ్చిన ఆహారం మీద పశు పక్ష్యాదులు, సూక్ష్మ జీవులు ఆధారపడుతుంటాయి. వాటన్నింటికీ ఆహారాన్ని ఇచ్చేందుకు మనిషి ధర్మబద్ధంగా సంపాదించాలి.

నక్తవ్రతం కేవలం ఒంటిపూట ఉపవాసంతోనే ముగియదు. ఆ సందర్భంగా కొన్ని కొన్ని దానాలు, ధర్మాలు చేయాల్సి ఉంటుంది. దీని వెనుక సర్వభూతదయ అనే సామాజికాంశం కనిపిస్తుంది. ప్రాతఃకాలస్నానం, భస్మ, రుద్రాక్ష ధారణ, భగవన్నామ స్మరణలు, ప్రణవ శివ షడక్షర మహామంత్ర జపాలు చేయాలి. మితంగా పెసరపప్పు, బియ్యం కలిపి వండిన అన్నాన్ని భుజించి, సత్య సంభాషణలు చేస్తూ చాపమీద పడుకోవాలి.

పుష్యమాసంలో ఈ వ్రతాన్ని చేస్తే నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఈ మాసంలో రెండు పక్షాలలో వచ్చే అష్టమి తిథులు, పూర్ణిమనాడు వ్రతంచేసి, ఆవునెయ్యితో రుద్రుడికి అభిషేకించాలి. ధాన్యాన్ని శివుడికి నివేదించటం, కపిల గోవును, ఎద్దును దానం ఇవ్వటం వల్ల ఆగ్నేయాది లోకాలు ప్రాప్తిస్తాయి. మాఘమాసంలో పెసరపప్పు, నెయ్యితో కూడిన భోజనాన్ని తినాలి. ఈ మాసంలోని చతుర్దశి, పౌర్ణమిలలో వ్రతం చేయొచ్చు. నెయ్యి, గొంగళి, నలుపురంగు ఆవు, ఎద్దులను దానం చేయటం వల్ల యమధర్మరాజు సంతుష్టుడవుతాడు. ఫాల్గుణ మాసంలో నెయ్యి, పాలతో వండిన పాయసాన్ని నివేదించాలి. చదుర్దశి, అష్టమి, పూర్ణిమలలో నక్తవ్రతం చేసి రుద్రాభిషేకాన్ని నిర్వహించాలి. గోమిధునాన్ని దానం చేసే వారికి చంద్రసాయిజ్యం లభిస్తుంది. 

చైత్రమాసంలో చేపడితే నిరుతిలోకం లభిస్తుంది. వైశాఖంలో వ్రతం చేసి తెల్లటి ఆవును, ఎద్దును దానమిస్తే అశ్వమేధ ఫలం దక్కుతుంది. జ్యేష్టమాసంలో నెయ్యి కలిపిన పదార్థం నివేదించి అర్ధరాత్రి వరకూ గోశాలలో గోవులకు సేవలు చేస్తూ ధూమ్రవర్ణంలో ఉన్న గోమిధునాన్ని దానం చేయాలి. ఆషాఢంలో చెరకు రసం నెయ్యి, పేలపిండి, ఆవుపాలను స్వీకరిస్తూ వ్రతాన్ని చేసే వారికి వరుణ లోక ప్రాప్తి కలుగుతుంది.

శ్రావణమాసంలో.. అరవై రోజులలో పంట కొచ్చిన వరి ధాన్యాన్ని శివుడికి నైవేద్యం పెట్టాలి. చిత్ర వర్ణాలున్న గోమిధుదాన్ని దానం ఇవ్వటం, పూర్ణిమనాడు ఆవునెయ్యితో శివుడిని అభిషేకించటం, అన్నదానం చేయటం వల్ల వాయు సాయిజ్యం లభిస్తుంది. ఆశ్వయుజంలో నల్లనిరంగులో ఉండే గోమిధుదాన్ని దానమివ్వాలి. పున్నమినాడు రుద్రాధ్యాయంతో శివుడిని అభిషేకించి పూజిస్తే ఈశానలోకం లభిస్తుంది. కార్తీక మాసంలో నెయ్యితో కూడిన క్షీరాన్నాన్ని నివేదించి కపిల గోమిధునాన్ని దానమివ్వటం, అన్నదానాలు చేస్తే సూర్యలోకార్హత పొందుతారు. మార్గశిరంలో నెయ్యి, పాలతో కూడిన యవధాన్యంతో వండిన అన్నాన్ని నివేదించటం, వేద పండితులకు, దరిద్రులకు, సత్పురుషులకు పున్నమినాడు శివాభిషేకం అయిన తర్వాత భోజనాలు పెట్టడం, తెలుపు రంగుగల గోమిధునాన్ని దానమివ్వటం వల్ల సోమలోక నివాస అర్హత లభిస్తుంది.

నక్తవ్రతం అన్నిమాసాల్లోనూ చేయవచ్చంటోంది లింగపురాణం. అహింస, సత్యం, దొంగతనానికి పాల్పడకుండా ఉండటం, బ్రహ్మచర్యం, ఓర్పు, దయ, ఉదయం, మధ్యాహ్నం సాయం కాలాలలో స్నానం చేయటం, ఇలాంటివన్నీ వ్రతం వల్ల ప్రాప్తించే మంచి అలవాట్లు. శుక్ల, కృష్ణ పక్షాలలో చతుర్దశి, అష్టమి తిథులలో ఈ వ్రతాన్ని ప్రతినెలా అందరూ చేస్తూ ఉంటే సమాజంలో అశాంతి అనేదే ఉండదు అని అంటోంది లింగపురాణం.

Famous Posts:

నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి..?

అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం.. చక్కని పరిష్కారం..!!

భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం

హిందూ సాంప్రదాయం ప్రకారం శుభ_అశుభశకునాలు –వాటి ఫలితాలు

ఉద‌యం నిద్ర‌లేవ‌గానే వేటిని చూడ‌కూడదో, వేటిని చూడాలో మీకు తెలుసా..?

పిల్లల కోసం శ్లోకాలు - స్తోత్రాలు

పూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు ఉండవచ్చా?

karthika masam 2020, karthika meaning in telugu, karthika masam telugu 2020, Karthika Deepalu, కార్తీక మాసం, ఉపవాసం, karthika masam importance in telugu, కార్తీక మాసం సోమవారం 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.