Drop Down Menus

దీపావళి లక్ష్మీ పూజా విధానం.. వ్రత నియమాలు - The Lakshmi Puja Vidhi For Diwali - Lakshmi Puja Vidhi at Home In Telugu

దీపావళి లక్ష్మీ పూజా విధానం.. వ్రత నియమాలు...

*విష్ణువు శక్తికి, మాయకు కారణం లక్ష్మీ పక్కనుండటమే అంటారు. భూదేవి కూడా ఆమె మరో అంశమని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మీగా చెప్పబడింది. ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు.

*త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు దేవేరి, భృగుమహర్షి కుమార్తె అయిన లక్ష్మీ దుర్వాసుని శాపంతో క్షీరసాగర మథనంలో ఉద్భవించింది. జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టాల నుంచి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుందని నమ్ముతారు. ఋగ్వేద కాలంలో అదితి, రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా ఆరాధించారు. అధర్వణ వేదం ‘సినీవాలి’ అనే దేవతను ‘విష్ణుపత్ని’గా నుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడంలేదు.

*లక్ష్మీ దేవి గురించి వివిధ గాధలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదని, ఆమె నిత్యానపాయిని ఎన్నడూ విడివడనిది అని అర్థం. లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు.

*పురాణాలు, ఇతిహాసాలలో లక్ష్మీ దేవి గురించి వివిధ రకాలుగా పేర్కొన్నారు. సృష్టి ఆరంభం నుంచే శ్రీమహావిష్ణువునకు లక్ష్మీదేవి తోడుగానే ఉందని, 'నిత్యానపాయిని' లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని కొందరు అంటారు. సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని జగన్మాత ప్రసాదించిందని దేవీ భాగవతంలో పేర్కొన్నారు. 

*లక్ష్మీదేవి ఓసారి విష్ణువు నుంచి వేరు కావడంతో ఆయన శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాలతో భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి ఆయనకు కుమార్తెగా జన్మించింది. అనంతరం విష్ణువుతో వివాహం చేశాడు. కాబట్టి లక్ష్మీదేవిని 'భార్గవి' అని కూడా అంటారు.

*దీపం జ్యోతి పరబ్రహ్మమ్, దీపం సర్వతమోహరమ్, దీపేన సాధ్యతే సర్వమ్, సంధ్యా దీపం నమామ్యహమ్.. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. లోకకంటకుడైన నరకుడు విష్ణువు చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా భూదేవి వరం పొందుతుంది. 

*దీపావళి రోజు లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. సంపద, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. సాయంత్రం వేళలో పూజ ప్రారంభించాలి. దీపావళి ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడం సంప్రదాయం. లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు. దీపం వెలిగించి ఈ కింది మంత్రంతో పూజ ప్రారంభించాలి.

          *ప్రాణ ప్రతిష్ఠ* 

*‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే

*బెల్లం ముక్కను నివేదన చేస్తూ … ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా

ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

*అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణ మిహనోధేహి భోగం

జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనమతే మృడయానస్వస్తి

అమృతమాపః ప్రాణానేన యధాస్థాన ముపహ్యయతే

రక్తాం భోధిస్థపోతోల్లసదరుణ సరోజాధిరూఢాకరాబ్జైః

*పాశంకోదండ మిక్షూద్భవ మళిగుణమప్యం కుశం పంచబాణాన్

బిబ్రాణా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీన వక్షోరుహాఢ్యా

దేవీబాలార్కవర్ణాభవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః

పై మంత్రాన్ని చదువుతూ ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి.

       *కలశ స్థాపన* 

*వేదిక మధ్యలో ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యాన్ని పోసి కలశాన్ని ఉంచాలి. బంగారం, వెండి, రాగి పాత్రను కలశంగా పెట్టి అందులో మూడు భాగాలు నీటిని పోయాలి. కలశంలో మామిడి ఆకులను వేయాలి. వేదిక మీద పోసిన ధాన్యంలో తామర పువ్వును గీసి లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి. అలాగే ఒక పళ్లెంలో కొన్ని నాణేలను ఉంచాలి. తరువాత కలశాన్ని కుంకుమతో అలకరించి ఈ కింది మంత్రాన్ని చదువుకోవాలి.

*‘గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః

కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య’

 *లక్ష్మీదేవి ఆధాంగ పూజ.* 

చంచలాయై నమః- పాదౌ పూజయామి

చపలాయై నమః- జానునీ పూజయామి

*పీతాంబర ధరాయై నమః -ఊరూ పూజయామి

కమలవాసిన్యై నమః- కటిం పూజయామి

పద్మాలయాయై నమః- నాభిం పూజయామి

మదనమాత్రే నమః- స్తనౌ పుజయామి

లలితాయై నమః -భుజద్వయం పూజయామి

కంబ్కంఠ్యై నమః- కంఠం పూజయామి

సుముఖాయై నమః- ముఖం పూజయామి

శ్రియై నమః ఓష్ఠౌ పుఅజయామి

సునాసికాయై నమః నాసికం పూజయామి

సునేత్రాయై నమః ణెత్రే పూజయామి

రమాయై నమః కర్ణౌ పూజయామి

కమలాలయాయై నమః శిరః పూజయామి

ఓం శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి

* ఈ కింది మంత్రాన్ని పఠిస్తూ దీపం వెలిగించాలి…

*ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం

సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ

ఘృతాక్తవర్తి సంయుక్తం అంధరాశి వినాశకం

దీపం దాస్యామి తే దేవి గృహణ ముదితాభవ

శ్రీలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి.

*లక్ష్మీ దేవికి తిలకాధారణ చేసి, విగ్రహం ముందు పూలు, కుంకుమ, పసుపు, గంధం, నైవేద్యం, పండ్లు, కొబ్బరి, మొదలైనవి సమర్పణలు ఉంచాలి. అలాగే బంగారు, వెండి ఆభరణాలు, ముత్యాలు, నాణేలను కూడా సమర్పించవచ్చు. లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శుద్దోదక స్నానం చేయాలి. ఆభరణం, ముత్యాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి. విగ్రహాన్ని వస్త్రంతో తుడిచి కలశంలో పెట్టాలి.

 *లక్ష్మీదేవి అష్టోత్తరం.. పూలు, అంక్షితలతో పూజ. 

ఓం ప్రకృత్యై నమః

ఓం వికృత్యై నమః

ఓం విద్యాయై నమః

ఓం సర్వభూతహితప్రదాయై నమః

ఓం శ్రద్దాయై నమః

ఓం విభూత్యై నమః

ఓం సురభ్యై నమః

ఓం పరమాత్మికాయై నమః

ఓం పద్మాలయాయై నమః

ఓం పద్మాశన్యే నమః

ఓం స్వాహాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం సుధాయై నమః

ఓం ధన్యాయై నమః

ఓం హిరణ్మయై నమః

ఓం నిత్యపుష్టాయై నమః

ఓం విభావర్యై నమః

ఓం ఆదిత్యై నమ:

ఓం దిత్యై నమః

ఓం దీప్తాయై నమః

ఓం వసుధాయై నమః

ఓం వసుధారిణ్యై నమ:

ఓం కమలాయై నమః

ఓం కాంతాయై నమః

ఓంకామాక్ష్యై నమః

ఓం క్రోధసముద్భవాయై నమః

ఓం అనుగ్రహప్రదాయై నమః

ఓం బుద్ద్యై నమః

ఓం అనఘాయై నమః

ఓం హరివల్లభాయై నమః

ఓం అశోకాయై నమః

ఓం అమృతాయై నమః

ఓం దీప్తాయై నమః

ఓం లోకశోకవినాశిన్యై నమః

ఓం ధర్మనిలయాయై నమః

ఓం కరుణాయై నమః

ఓం లోకమాత్రే నమః

ఓం పద్మప్రియాయై నమః

ఓం పద్మహస్తాయై నమః

ఓం పద్మాక్ష్యై నమః

ఓం పద్మసుందర్యై నమః

ఓం పద్మోద్భవాయై నమః

ఓం పద్మముఖ్యై నమః

ఓం పద్మనాభప్రియాయై నమః

ఓం రమాయై నమః

ఓం పద్మమలాదరాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం పద్మిన్యై నమః

ఓం పద్మగంధిన్యై నమః

ఓం పుణ్యగంధిన్యే నమః

ఓం సుప్రసన్నయై నమః

ఓం ప్రసాదాభిముఖ్యై నమః

ఓం ప్రభాయై నమః

ఓం చంద్రవదనాయై నమః

ఓం చంద్రాయై నమః

ఓం చంద్రసహోదర్యై నమః

ఓం చతుర్భుజాయై నమః

ఓం చంద్రరూపాయై నమః

ఓం ఇందిరాయై నమః

ఓం ఇందుశీతలాయై నమః

ఓం ఆహ్లాదజనన్యై నమః

ఓం పుష్ట్యై నమః

ఓం శివాయై నమః

ఓం శివకర్యై నమః

ఓం సత్యై నమః

ఓం విమలాయై నమః

ఓం విశ్వజనన్యై నమః

ఓం పుష్ట్యై నమః

ఓం దారిద్రనాశిన్యై నమః

ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః

ఓం శాంతాయై నమః

ఓం శుక్లమాల్యాంబరాయై నమః

ఓం శ్రియై నమః

ఓం భాస్కర్యై నమః

ఓం బిల్వనిలయాయై నమః

ఓం వరారోహాయై నమః

ఓం యశస్విన్యై నమః

ఓం వసుంధరాయై నమః

ఓం ఉదారాగ్యై నమః

ఓం హేమమాలిన్యై నమః

ఓం హరిణ్యై నమః

ఓం ధనధాన్యకర్త్యై నమః

ఓం సిద్ద్యై నమః

ఓం స్రైణసౌమ్యాయై నమః

ఓం శుభప్రదాయై నమః

ఓం నృపవేశ్మగతానందాయై నమః

ఓం వరలక్ష్మ్యై నమః

ఓం వసుప్రదాయై నమః

ఓం శుభాయై నమః

ఓం హిరణ్యప్రాకారాయై నమః

ఓం సముద్రతనయాయై నమః

ఓం జయాయై/మంగళాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః

ఓం విష్ణుపత్న్యై నమః

ఓం ప్రసన్నాక్ష్యై నమః

ఓం నారాయణ సమాశ్రితాయై నమః

ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః

ఓం దేవ్యై నమః

ఓం సర్వోపద్రవవారిణ్యై నమః

ఓం నవదుర్గాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః

ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః

ఓం భువనేశ్వర్యై నమః

*అష్టోత్తరం పూర్తయిన తర్వాత కింది మంత్రాన్ని జపిస్తూ కుడివైపునకు మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి.

యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే

పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ

త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల

అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ

తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి

శ్రీలక్ష్మీదేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

  *సాష్టాంగ నమస్కారం* 

నమస్తే లోకజనని నమస్తే విష్ణు వల్లభే

పాహిమాం భక్తవరదే శ్రీలక్ష్మ్యైతే నమో నమః

శ్రీలక్ష్మీదేవ్యై నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి

*సంధ్యాసమయంలో ఆవు నెయ్యితో దీపాలను ఇంటిముందర వరస క్రమంలో వెలిగించాలి.*

*శ్రీ మహాలక్ష్మి అష్టకం*

నమస్తే‌స్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |

శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో‌స్తు తే || 1 ||

నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |

సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 2 ||

సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |

సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 3 ||

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |

మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 4 ||

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |

యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమో‌స్తు తే || 5 ||

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |

మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 6 ||

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |

పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమో‌స్తు తే || 7 ||

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |

జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమో‌స్తు తే || 8 ||

మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |

సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ |

ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ |

మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||

*ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్.*

*కనకధారా స్తోత్రం*

*శ్రీ ఆదిశంకరాచార్య విరచితము*

అంగం హరేః పులక భూషణ మాశ్రయన్తీ

బృంగాంగనేవ ముఖళాభరణం తమాలమ్!

అంగీకృతాఖిల విభూతి రసంగలీలా

మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః !!

ముగ్దా ముహుర్విదధతీ వదనే మురారేః

ప్రేమత్ర పాప్రిణి హితాని గతా గతాని !

మాలాదృశోర్మధు కరీవ మహోత్ప లేయా

సామే శ్రియం దిశతు సాగర సంభావా యాః !!

విశ్వా మరేంద్ర పదవి భ్రమ దానదక్ష

మానంద హేతు రదికం మురవిద్విషోపి.

ఈషన్నీషీదతుమయి క్షణ మీక్షణార్థ మిందీవరోదర సహోదర మిందియా యాః !!

అమీలితాక్ష మధిగ్యమ ముదా ముకుంద మానంద కంద మనిషేష మనంగ తంత్రం!

అకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవన్మమ భుజంగ శయాంగనాయాః !!

బాహ్వంతరే మధుజితశ్శ్రిత కౌస్తు భేయా హారావళీవ మరి నిలమయీ విభాతి !

కామ ప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణ మావహతుమే కమలాల యామాః !!

కాలాంబు దాళి లలితో రసి కైటభారేః ర్దారాధరే స్ఫురతి యా తటిదంగనేవ !

మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః !!

ప్రాప్తం పదం ప్రథమతఃఖలు యత్ప్రభావాత్ మాంగల్య భాజి మధుమాథిని మన్మథేన!!

మయ్యపతే త్తదిహ మంథర మీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయాః !

దద్యాద్దయాను పవనోద్రవిణాంబు ధారా మస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే !!

దుష్మర్మ ఘర్మమపనీయ చిర్టయదూరం నారాయణ ప్రణయనీ నయనాంబువహః !

ఇష్టా విశిష్ట మతయోపి యయా దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టప పదం సులభం లభంతే !

దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తి రిష్టాం పుష్టి కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః !!

గీర్ధవ తేతి గరుడద్వజ సుందరీతి శాకంభరీతి శశశేఖర వల్లభేతి !

సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయై తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై !!

శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రశూత్యే రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై !

శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై !!

నమోస్తు నాళిక నిభాననాయై నమోస్తు దుగ్దోదధి జన్మభూమ్యై !

నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై !!

సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి !

త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే !!

యత్కటాక్ష సముపాసనావిధిః సేవకస్య సకలర్థ సంపదః !

సంతనోతి వచనాంగ మానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే !!

సరసిజనిలయే ! సరొజహస్తే ! దవళత మాంశుక గందమాల్య శోభే !

భగవతి ! హరివల్లభే ! మనోజ్ఞే ! త్రిభువన భూతకరీ ! ప్రసీద మహ్యం !!

దిగ్ఘస్తభిః కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగిం !

ప్రాత ర్న మామి జగతాం జననీ మశేష లోకధినాథ గృహిణీ మమృతాబ్ది పుత్రిం !!

కమలే ! కమలాక్ష వల్లభే !త్వం కరుణాపూర తరంగితై రపాంగైః !

అవలోకయ మా మకించనానం ప్రథమం పాత్ర మకృతిమం దయాయాః !!

స్తువంతి యే స్తుతిభి రమూభి రన్వహం త్రయీ మయీం త్రిభువనమాత్రం రమాం !

గుణాధికా గురుతుర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః !!

*అష్ట లక్ష్మీ స్తోత్రమ్*

ఆదిలక్ష్మి

సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే

మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే |

పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే

జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ ‖ 1 ‖

ధాన్యలక్ష్మి

అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే

క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |

మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే

జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ ‖ 2 ‖

ధైర్యలక్ష్మి

జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే

సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, జ్ఞాన వికాసిని శాస్త్రనుతే |

భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే

జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ ‖ 3 ‖

గజలక్ష్మి

జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే

రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే |

హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే

జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ ‖ 4 ‖

సంతానలక్ష్మి

అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని జ్ఞానమయే

గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే |

సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే

జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ ‖ 5 ‖

విజయలక్ష్మి

జయ కమలాసిని సద్గతి దాయిని, జ్ఞానవికాసిని గానమయే

అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే |

కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే

జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ ‖ 6 ‖

విద్యాలక్ష్మి

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే

మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |

నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే

జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ ‖ 7 ‖

ధనలక్ష్మి

ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే

ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే |

వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే

జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ ‖ 8 ‖

ఫలశృతి

శ్లో‖ అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి |

విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ‖

శ్లో‖ శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః |

జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళం ‖

*శ్రీ సూక్తమ్ విశిష్టత*.

(ప్రతి రోజు శ్రీ సూక్తము తో అమ్మవారికి రెండు పూటలా కుంకుమ అర్చన చేయండి. మీ ఇంట్లో ఇంక ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు, దారిద్ర్యము అప్పుల బాధలు ఉండవు.చాలా శక్తివంతమైనది శ్రీ సూక్తము)శ్రీ చక్రం ఉన్నవారు శ్రీ సూక్తము తో రోజు ఈ విధంగా చేయవచ్చు).

శ్రీ చక్రం లేని వాళ్ళు కూడా మామూలుగా

ఒక తమలపాకు మీద శ్రీ సూక్తం తో కుంకుమార్చనలు చేయవచ్చు

శ్రీ సూక్తం, అర్దం 

వేదాలలో, పురాణాలలో ఉన్న మహాలక్ష్మీ స్తుతుల కూర్పే శ్రీ సూక్తం. మన దక్షిణ భారత పూజా విధానంలో ఇది బహుళ ప్రాచుర్యం సంతరించుకున్నది. ఆ శ్రీమహాలక్ష్మి యొక్క కృపాకటాక్షాలు పరిపూర్ణంగా కలగటానికి దీని పారాయణ శ్రద్ధగా చేద్దాము.

హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్

చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్

యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రభోదినీమ్

శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్

కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్

పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్

చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్

తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే

ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః

తస్య ఫలాని తపసా నుదన్తు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ

ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహమ్

అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుదమే గృహాత్

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్

ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్

మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి

పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ

శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్

ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే

ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్

చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్

సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్

యస్యాం హిరణ్యం ప్రభూతం గావోదాస్యోశ్వాన్ విందేయం పురుషానహమ్

యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహమ్

శ్రియః పంచదశర్చం చ శ్రీకామః సతతం జపేత్

ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః

ఋషయస్తే త్రయః ప్రోక్తాస్వయాం శ్రీరేవ దేవతా

పద్మాననే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే

త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్

అశ్వదాయీ గోదాయీ ధనదాయీ మహాధనే

ధనం మే జుషతాం దేవి సర్వకామాంశ్చ దేహి మే

పుత్రపౌత్రం ధనం ధాన్యం హస్త్యశ్వాదిగవేరథమ్

ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మామ్

ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః

ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్ను తే

చంద్రాభాం లక్ష్మిమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం

చంద్రసూర్యాగ్ని వర్ణాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే

వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహా

సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః

భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్సదా

వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః

రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి

పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి

విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ

యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ

గంభీరావర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వస్త్రోత్తరీయా

లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైమణిగణ ఖచితైస్స్నాపితా హేమకుంభైః

నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం

దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం

శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రగంగాధరాం

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్

సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ

శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా

వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం

బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమాద్యాం జగదీశ్వరీం త్వామ్

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే

సరసిజ నిలయే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్యశోభే

భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమహ్యమ్

ఓం విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియాం

విష్ణోః ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభామ్

ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి

తన్నో లక్ష్మీః ప్రచోదయాత్

శ్రీవర్చస్యమాయుష్యమారోగ్యమావిధాత్ పవమానం మహీయతే

ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః

ఋణరోగాది దారిద్ర్య పాపంక్షుదపమృత్యవః

భయశోకమనస్తాపా నశ్యంతు మమ సర్వదా

శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియం వయో జరితృభ్యో దధాతు

శ్రియం వసానా అమృతత్వమాయన్ భజంతి సద్యః సవితా విదధ్యూన్

శ్రియ ఏవైనం తచ్ఛ్రియామాదధాతి

సంతతమృచావషట్ కృత్యం సంధత్తం సంధీయతే ప్రజయా పశుభిః

య ఏవం వేద

ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి

తన్నో లక్ష్మీః ప్రచోదయాత్

ఓం శాంతిః శాంతిః శాంతిః

తాత్పర్యము:-

ఓ అగ్నిదేవా! బంగారు మేని ఛాయ గల, పాపాలను నాశనము చేసే, బంగారు మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడిన, చంద్రుని వలె చల్లగా ఆహ్లాదకరంగా, సువర్ణమయమైన యున్న మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము.

ఎవరి కరుణ, కటాక్షములతో నాకు బంగారము, ఆవులు, గుర్రాలు, బంధువులు సంప్రాప్తమైనవో ఆ మహాలక్ష్మిని నా వద్దకు ఆవాహనము చేయుము. ఆమె నా వద్ద నుండి వీడిపోకుండా చూడుము.

గుర్రాలతో ఉన్న రథం మధ్యలో ఆసీనమైనది, తన రాకను ఏనుగు ఘీంకార నాదంతో సూచిస్తున్న ఆ శ్రీదేవిని ఆహ్వానిస్తున్నాను. తల్లీ నీవు నా వద్ద సంతోషముగా నెలకొని ఉండుము.

చక్కని చిరునవ్వుతో, బంగారు కోటలో నివసించే, కరుణ, తేజస్సు, ఆనంద రూపిణియై, ఆనందము ప్రసాదించునది, పద్మములో ఆసీనురాలై, పద్మము వంటి ఛాయకలది అయిన ఆ శ్రీదేవిని ఇక్కడ సాక్షాత్కరించమని ప్రార్థిస్తున్నాను.

చంద్రుని పోలినది, తేజోవంతమైనది, తన కీర్తి చంద్రికలతో ప్రకాశించుచున్నది, దేవతలచే పూజిన్చబడుచున్నది, కరుణా స్వరూపిణి, పద్మమును ధరించినది, 'ఈం' అనే బీజమంత్రానికి భావంగా ఉన్నది అయిన మహాలక్ష్మిని నేను శరణు వేడుతున్నాను. ఓ దేవీ! నిన్ను ప్రార్థిస్తున్నాను, నా దారిద్ర్యం పోయేలా కరుణించు.

సూర్యుని తేజస్సు కలిగిన ఓ తల్లి! వనానికి అధిపతియైన బిల్వవృక్షం (మారేడు చెట్టు) నీ తపోమహిమచే ఉద్భవించినది. నీ తపస్సు వలన కలిగిన దాని ఫలాలు అజ్ఞానము మనే లోని ఆటంకాన్ని, అమంగళకరమైన బయటి ఆటంకాన్ని తొలగిస్తాయి గాక!

కుబేరుడు, కీర్తి ఐశ్వర్యాలతో నన్ను వెన్నంటి రావాలి. నీ అనుగ్రహం పూర్తిగా నిండిన ఈ దేశంలో నేను జన్మించాను. సకల సంపదలను నాకు ప్రసాదించు!

ఆకలి దప్పికలతో కృశించినది, శ్రీదేవి కంటే ముందుగా జన్మించిన జ్యేష్టాదేవిని (అలక్ష్మి) నేను నాశనం చేస్తాను. నా గృహము నుండి అభాగ్యము, కొరతలను పూర్తిగా నిర్మూలించి నన్ను అనుగ్రహించు.

సుగంధానికి నిలయమైనది, జయింప అలవికానిది, ఎల్లప్పుడూ పుష్టినిచ్చేది, సకల సంపదలు కలిగిన, సమస్త జీవులకు అధినాయిక యైన మహాలక్ష్మిని ఇక్కడ ఆవాహన చేస్తున్నాను.

ఓ శ్రీదేవి! మనస్సులో జనించే ఉత్తమమైన కోరికలూ, సంతోషము, వాక్కులో సత్యము, గోసంపద చే, ఆహార సమృద్ధిచే కలిగే ఆనందాన్ని నేను చవి చూడాలి. నాకు కీర్తి కలుగచేయుము.

కర్దమ మహర్షి! నీకు పుత్రికగా జన్మించిన మహాలక్ష్మి నాకు సాక్షాత్కారించాలి. తామరపువ్వుల మాల ధరించిన, సిరిసంపదలకు అధిదేవత, తల్లి అయిన ఆమెను నా కులములో ఎల్లప్పుడూ నివసింప చేయాలి.

మహాలక్ష్మి పుత్రుడవైన ఓ చిక్లీత! నీరు, చక్కని ఆహారపదార్థాలను ఉత్పత్తి చేయుగాక! నా ఇంట నీవు నివసించాలి. దేవీ, నీ మాత అయిన ఆ మహాలక్ష్మి నా కులములో నిరంతరమూ నివసించేలా అనుగ్రహించు.

ఓ అగ్నిదేవ! కరుణ కలిగిన మనసు కలది, పద్మవాసిని, లోకానికి ఆహారము ఇచ్చి పోషించేది, కుంకుమ రంగు కలది, తామరపువ్వుల మాల ధరించినది, చంద్రునివలె ఆహ్లాదకరమైనది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము.

అగ్నిదేవా! దయకలిగినది, గంభీరముగా యుండెడిది, దండము చేత బూనినది, అందమైన శరీరచాయ కలిగినది, సూర్యునివలె ప్రకాశించునది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము.

అగ్నిదేవా! ఎవరి వలన నేను అంతులేని బంగారుము, గోవులు, సేవకులు, గుర్రాలు ప్రాప్తించుకుంటానో , అట్టి మహాలక్ష్మిని నన్ను వదలి వెళ్లిపోకుండా కృప చూపుము.

ఎవరు లక్ష్మీదేవి కృప కొరకు ప్రార్తిస్తున్నారో, వారు ఇంద్రియాలు నిగ్రహించి, ప్రతిరోజూ ఆజ్యముతో హోమము చేయాలి. పైన తెలిపిన పదిహేను మంత్రాలను సదా జపిస్తూ ఉండాలి. సుప్రసిద్ధులు, ఋషులు అయిన ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు ముగ్గురు ఈ సూక్తంలోని ఋషులు, మహాలక్ష్మియే దేవత.

పద్మము వంటి ముఖము, ఊరువులు, కన్నులు కలదానా! పద్మము నుండి ఉద్భవించిన తల్లి!, నేను దేని వలన సుఖాన్ని పొందుతానో దాన్ని ప్రసాదించు.

గుర్రాలను, గోవులను, సంపదలను ఇచ్చే, ధనానికి అధిదేవతయైన మహాలక్ష్మి! కోరికలన్నీ నెరవేరేటప్పుడు కలిగే సుఖాన్ని ఇచ్చే సంపదను నాకు ప్రసాదించు.

పుత్రులు, గోవులు, ధనధాన్యాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు మొదలైన సకల సంపదలు ప్రసాదించు. జనులకు నువ్వు తల్లిగా భాసిస్తున్నావు. నన్ను ఆయుష్మంతునిగా చేయుము.

అగ్ని, వాయువు, సూర్యుడు, అష్టవసువులు, దేవేంద్రుడు, బృహస్పతి, వరుణుడు - తమ తమ సంపదలను నీ కృపతో అనుభవిస్తున్నారు.

చంద్రునివలె చల్లగా, దేవతల శక్తిగా, సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తున్నది, శ్రీదేవి, ఈశ్వరి, చంద్రుడు, సూర్యుడు, అగ్ని - మువ్వురినీ తన మహత్తుగా కలదీ అయిన శ్రీమహాలక్ష్మిని కొలుస్తున్నాను.

ఓ గరుత్మంతుడా! సోమరసం కోసం వచ్చిన వృత్రాసురుని సంహరించిన ఇంద్రుడు సోమరసం గ్రోలనీ. సోమయాగం నిర్వర్తించాలని సంకల్పించిన నాకు పుష్కలముగా ధనాన్ని ప్రసాదించనీ!

పుణ్యము చేసిన భక్తులకు కోపము రాదు, మాత్సర్యము ఉండదు, లోభము నశిస్తుంది, దుర్బుద్ధి పుట్టదు. భక్తిని పొంద కోరేవారు శ్రీ సూక్తాన్ని సదా జపము చెయ్యాలి.

నీ కృపతో మేఘాలు ఎల్లప్పుడూ వర్షించనీ! విత్తనాలు చక్కగా మొలకెత్తి బాగా పెరగనీ! భగవంతుని నిందించేవారు నిష్క్రమించు గాక!

పద్మము అంటే ఇష్టపడేదానా! పద్మములు చేతిలో ధరించిన జగన్మాతా! పద్మములో జన్మించి, నివసించే తల్లీ! తామర రేకులవంటి విశాలమైన కన్నులు కలిగి, విష్ణువు మనస్సుకు అనుకూలమైన మాతా! నీ పాదపద్మములతో నన్ను అనుగ్రహించు.

పద్మము మీద ఆసీనురాలై ఉన్నదేవరో, విస్తారమైన పిరుదులు కలిగిన, తామర రేకులవంటి నేత్రములు కలవారెవరో, లోతైన నాభి కలిగి, స్తన భారముతో వంగి ఉన్న వారెవరో, స్వచ్చమైన వస్త్రాలు, ఉత్తరీయము ధరించిన దెవరో, రత్నాలు పొదిగిన కలశాల జలంతో దేవలోకములోని అత్యుత్తమైన గజములతో అభిషేకించ బడుతున్న దెవరో, పద్మాన్ని చేత ధరించిన దెవరో, సర్వ మంగళ స్వరూపిణియైన దెవరో అట్టి మహాలక్ష్మి నా గృహములో సదా సర్వవేళలా నివసించుగాక!

భాగ్యానికి నిలయమైనది, పాలకడలి నుండి ఉద్భవించినది, శ్రీరంగములో వెలసిన దేవీ, దేవ లోక స్త్రీల నందరిని దాసీజనంగా చేసుకొన్నది, లోకాని దీపంగా భాసిస్తున్నది, ఎవరి మృదుల కటాక్షంతో ఇంద్రుడు, శివుడు వైభవము పొందుతున్నారో, మూడు లోకాలను తన కుటుంబముగా చేసుకున్నది, తామర కొలనులో ఉద్భవించినది, మహావిష్ణువుకు ప్రియమైనది అయిన నీకు నమస్కరిస్తున్నాను.

సిద్ధులను ఇచ్చే, ముక్తిని అనుగ్రహించే, విజయాన్ని సిద్ధింప చేసే లక్ష్మీ రూపాలలో, సరస్వతిగాను, సంపదలిచ్చే శ్రీదేవిగాను, వరాలిచ్చే వరలక్ష్మిగా నువ్వు సదా నాకు ప్రసన్నురాలవుగా ఉండుగాక!

వర, అభయ ముద్రలు చేత దాల్చిన, పాశము, అంకుశములు చేత ధరించిన, పద్మములో నివసిస్తున్న, కోటి బాల సూర్యుల ప్రకాశము కలదీ, మూడు నేత్రములు కలదీ, ఆదిశక్తి, జగదీశ్వరి అయిన ఆమెను నేను స్తుతిస్తాను.

శుభములలో శుభానివి, సకల శుభాలను సాధించి, ప్రసాదించే దానవు, శరణు పొందటానికి యుక్తమైన దానవు, మూడు కన్నులు కాలిగిన ఓ దేవీ, నారాయణీ! నా నమస్కారము.

పద్మ వాసిని, పద్మమును చేత ధరించినది, పవిత్రమైన తెల్లని వస్త్రములు, సుగంధభరితమైన మాలను ధరించి శోభిస్తున్న, భగవతి, హరిపత్ని, కామ్యదాయిని, ముల్లోకాలను పోషించి కాపాడే నువ్వు నన్ను అనుగ్రహించు.

విష్ణుపతిని, భూదేవి, తులసి గా అలరారుతున్నది, మాధవుని ప్రియురాలు, ప్రియసఖి, విష్ణువుతో కూడిన దేవీ! నేను నమస్కరిస్తున్నాను.

మహాలక్ష్మిని తెలుసుకుందాము. విష్ణుపత్నియైన ఆమెను అందుకై ధ్యానిద్దాం. ఆ లక్ష్మీదేవి మనకు ప్రేరణనిచ్చు గాక!

మహాలక్ష్మీ! వర్చస్సు, లోటు లేని జీవితం, మంచి ఆరోగ్యం - నాకు ప్రసాదించే పవనాలు సదా వీచనీ. ధన ధాన్యాలు, పశు సంపద, పుత్రులు, నూరేళ్ళ దీర్ఘాయుష్షు నాకు చేకూరనీ. ఋణము, రోగము, దారిద్ర్యము, ఆకలి, అకాల మరణము, భయము, శోకము, మానసిక వ్యథలు నశించు గాక!.

శ్రీదేవి చేరే వారిని ఐశ్వర్యం వరిస్తుంది; సంపద, దీర్ఘాయుష్షు చేకూరుతుంది. వారు ఐశ్వర్యాలతో తులతూగుతూ మరణం లేని స్థితికి చేరుకుంటారు. సత్వరమే వారు కీర్తిని, విజయాన్ని పొందుతారు.

మంచివి అన్నీ లక్ష్మే దేవియే - ఇలా తెలుసుకున్న వాడు లక్ష్మీ దేవిని చేరుకుంటాడు. మంత్రయుక్తముగా ఎల్లప్పుడూ యాగము చేయాలి. అలా చేసే వాడికి పుత్ర సంపద, పశు సంపద లభిస్తుందని గ్రహించాలి.

మహాలక్ష్మిని తెలుసుకుందాము. విష్ణుపత్నియైన ఆమెను అందుకై ధ్యానిద్దాం. ఆ లక్ష్మీదేవి మనకు ప్రేరణనిచ్చు గాక!

*యే మనుష్యః మాం ఆశ్రతః!*

*తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!

Famous Posts:

దిష్టి, దృష్టి - నివారణ మార్గాలు

శివునికి ఏ అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది? 

అగ్నిసాక్షిగా వివాహం ఎందుకు చేస్తారు..? 

అన్నదానం చేసేటపుడు 100 లో 99 మంది చేసే అతి పెద్ద తప్పు

గుడి దగ్గర్లో ఇల్లు ఉండకూదనడానికి ఖచ్చితమైన కారణాలు ఇవే

దీపావళి రోజు ఉప్పుతో ఇలా చేస్తే చాలు 

ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ?

చేతిలోని డబ్బు నిలవాలంటే...ఏమి చేయాలి? 

నిత్య దరిద్ర కారణాలు ఇవే..

రజస్వల వివరణ - దోషము -నియమ నిబంధనలు

అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా..? 

మనసులోని కోర్కెలు తీర్చే దశావతార నృసింహ మంత్రము

దేవాలయాల్లో ఇతరులకు నమస్కారం చేయకూడదు ఎందుకో తెలుసా? 

స్త్రీ మూర్తులకి ఇవి అవసరం..

శుక్రవారం విడిచిన దుస్తుల్నే_ధరిస్తే..? 

ఎంతటి కష్టమైన సమస్య తీరాలన్న, ప్రతి పని లో విజయం కావాలన్నా ఏమిచెయ్యాలి  ? 

గుడికి ఎందుకు వెళ్ళాలి? దాని వెనక రహస్యాలు 

దీపావళి, లక్ష్మి పూజ, diwali meaning, diwali importance, diwali essay, diwali story in telugu, వ్రత నియమాలు, lakshmi pooja, diwali special, 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments