నూరేళ్ళు జీవించడానికి అకాల మరణాలను నివారించు యమాష్టకం | Yama Ashtakam in Telugu

 

యమాష్టకం

చాలా మందికి చిన్న చిన్న ప్రమాదాలు తరుచుగా జరుగుతూ ఉంటుంది.. కొందరు దైర్యంగా ఉంటారు.. మరి కొందరు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అన్న ఫోబియా లోకి వెళ్లిపోతారు.. దాని వల్ల భయం, చిరాకు, కోపం, గుండెల్లో దడ లాంటివి ఎక్కువై ప్రమాదాల, అనారోగ్యంతో బాధ పడుతుంటారు...

నిజానికి అలాంటి అలజడి వల్ల ఇంకా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి..

వారికి ఒక నమ్మకం ధైర్యం కోసం ఇప్పుడు చెప్పినట్టు చేయండి..

నమ్మకం అనేది మనిషి కి కొత్త ధైర్యం ఇస్తుంది...అలా అని ఇది మాట వరసకు చెప్తుంది కాదు... పాటించవలసిన నియమం.

ప్రతి ఒక్కరికి వారి జన్మ నక్షత్రం తెలిసి ఉంటుంది... ప్రతి మాసం జన్మ నక్షత్రం రోజున వారి పేరుతో కుల దైవానికి, ఇష్ట దైవానికి అర్చన జరిపించండి... హనుమంతుడి గుడికి ప్రదక్షిణలు చేయడం మంచిది..

జన్మ నక్షత్రం రోజు ఉదయాన్నేయమాష్టకం మూడు సార్లు పారాయణం చేసుకొని యమధర్మరాజు ని స్మరించుకోండి..

యమాష్టకం..!!

తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరఃపురా!

ధర్మం సూర్యసుతం ప్రాప ధర్మరాజం నమామ్యహమ్ || 1 ||

సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః |

అతో యన్నామ శమనమితి తం ప్రణమామ్యహమ్ || 2 ||

యేవాంతశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరమ్ |

కామామరూపం కాలేన తం కృతాంతం నమామ్యహమ్ | 3 

బిభర్తి దండందండాయ పాపినాం శుద్ధిహేతవే!

నమామి తం దండధరం యః శాస్తా సర్వ జీవినామ్|| 4 ||

విశ్వం చ కలయత్యేవ యస్సర్వేషు చ సంతతమ్ |

అతీవ దుర్నివార్యం చ తం కాలం ప్రణమామ్యహమ్ || 5 ||

తపస్వీ వైష్ణవో ధర్మీ సంయమీ విజితేంద్రియః |

జీవినాం కర్మఫలదం తం యమం ప్రణమామ్యహమ్ || 6 ||

స్వాత్మారామం చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్‌ |

పాపినాం క్లేశదో యశ్చ పుణ్యం మిత్రం నమామ్యహమ్ || 7 ||

యజ్ఞన్మ బ్రహ్మణో వంశే జ్వలంతం బ్రహ్మతేజసా |

యో ధ్యాయతి పరం బ్రహ్మ బ్రహ్మవంశం నమామ్యహమ్  || 8 ||

ఇత్యుక్త్యా సా చ సావిత్రీ ప్రణనామ యమం మునే |

యమస్తాం విష్ణుభజనం కర్మపాకమువాచ హ || 9 ||

ఇదం యమాష్టకం నిత్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌ |

యమాత్తస్య భయం నాస్తి సర్వపాపాత్పమ్రుచ్యతే || 10 ||

మహాపాపీ యది పఠేన్నిత్యం భక్త్యా చ నారద |

యమః కరోతి తం శుద్ధం కాయవ్యాహేన నిశ్చితం || 11 ||

ఇతి శ్రీ యమాష్టకం సంపూర్ణం...

Famous Posts:

యమాష్టకం, Yamashtakam, yama ashtakam in telugu, shivashtakam,

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS