Drop Down Menus

విష్ణు సహస్ర నామ మహిమ | Know the Significance of Vishnu Sahasranamam Mahima stotram

 

విష్ణు సహస్ర నామ మహిమ...

పూర్వం పూరీ నగరం లో జగన్నాధపురం లో ఒక మహా పండితుడు భార్య తో సహా ఒక పూరి గుడిసె లో నివాస ముండెడివాడు.

ఇతను శ్రీ మహావిష్ణువునకు పరమ భక్తుడు పూట గడవని దారిద్ర్యస్థితి అతనిది,

ప్రతి నిత్యమూ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ చేసి ఇతడు ఆ ఊరిలో మూడిళ్ల వద్ద భిక్షాటన కు వెళ్లేవాడు.

ఆ వచ్చినదానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు .భార్య మాత్రం పరమ గయ్యాళి , దైవం పట్ల నమ్మకం లేనిది , ఎటువంటి నియమాలనూ పాటించనిది.

Also Readపూజ గది ఎలా ఉండాలి.. ఇంట్లో ఎక్కడ ఉండాలి తెలుసా ?

ఇంటి లో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్ననూ ఇతడు హరి నామ స్మరణను  విడువలేదు.

ప్రతినిత్యమూ చేయుచున్న విధముగా ఆరోజు కూడా విష్ణుసహస్ర పారాయణము చేయుచుండగా భార్య వచ్చి భర్త తో " ఏమిటి చేస్తున్నావు ? " అని గద్దించి అడిగింది.

దానికి ఆ భర్త "విష్ణుసహస్ర నామాలను స్తోత్రం చేస్తున్నాన"న్నాడు. అందుకు ఆ భార్య " ప్రతీ రోజూ స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ! ఏమి ఇచ్చాడు ఆ శ్రీమహావిష్ణువు ? అడుక్కోవడానికి భిక్షాపాత్ర తప్ప " అంది.

అక్కడితో ఆగక " ఏదీ ! నువ్వు చదువు తున్నదేమిటో చెప్పు" అన్నది.

అందుకు ఆ భర్త " వెయ్యి నామాలే ! ఏమిటి చెప్పేది ? నీకేమిటి అర్ధమౌతుంది ? ఎప్పుడూ పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణుసహస్ర నామాలేమి అర్ధమౌతాయి ? " అన్నాడు.

ఆ భార్య మాట్లాడుతూ " వెయ్యి నామాలక్కరలేదు , మొట్ట మొదటిది చెప్పు చాలు " అన్నది.

అందుకు ఆ భర్త " విశ్వం విష్ణుః " అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య " ఆపు అక్కడ ! దీనర్ధమేమిటో చెప్పు " అన్నది.

అందుకు ఆ భర్త " విశ్వమే విష్ణువు , ఈ ప్రపంచమంతా విష్ణుమయమే " అని వివరించగా " ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు ,

అందులో నువ్వూ , నేనూ ఉన్నామా ? ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని  అనుభవిస్తూ , పూరిగుడిసె లో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతీ రోజూ నువ్వు ఆ శ్రీమహావిష్ణువుని గానం చేస్తున్నావే ? అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా ? కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్ధం లేదయ్యా ! " అంది.

భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు " నా భార్య మాటలు కూడా నిజమేనేమో ? విశ్వమంతా విష్ణువే ఐతే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉండాలి ?

కనుక " ఈ మంత్రంలో విశ్వం" అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకుని ఒక బొగ్గు ముక్కతో ఆ " విశ్వం" అనే పదాన్ని కనబడకుండా మసి పూసి ( తాటాకు ప్రతి ఉండేదిట ఈ భక్తుడి ఇంట్లో ) ఎప్పటిలాగే యాచన కై బయలుదేరి వెళ్లి పోయాడట

ఆ తరువాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది . 

ప్రతినిత్యమూ పాల సముద్రంలో శ్రీమహావిష్ణువును శ్రీమహాలక్ష్మి సేవిస్తున్నట్లుగనే ఆరోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్కున నవ్విందిట !

అందుకు శ్రీమహావిష్ణువు " ఏమిటి దేవీ ? ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ? " అని అడిగితే అమ్మవారు 

" నాధా ! మిమ్ములను నల్లని వాడని , నీల మేఘ శ్యాముడని అందరూ స్తుతించడం విన్నాను కానీ అంత మాత్రంచేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా " అని పరిహాసమాడగా....

శ్రీమహావిష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్లరంగు కనబడిందిట.

వెంటనే శ్రీ మహా విష్ణువు జరిగినదంతా దివ్యదృష్టి తో గమనించాడుట. లక్ష్మీదేవి " ఏమిటి స్వామీ ఆలోచిస్తున్నారు ? మీ ముఖము పై ఆ నల్లరంగుకు గల కారణమేటో తెలిసినదా ?" యని అడుగగా స్వామి,

" దేవీ ! ఇది నా పరమ భక్తుడు చేసిన పని " యని పలికాడుట. లక్ష్మీదేవి " అదేమిటి స్వామీ ! పరమ భక్తుడంటున్నారు ? అతడెందుకిలా చేస్తాడని యడుగగా స్వామి తన భక్తుని జీవితదీన స్థితిని వివరించగా ....

లక్ష్మీదేవి " అంతటి పరమ భక్తుని దీనస్థితికి కారణమేమి ? మీరాతనిని ఉద్ధరింపలేరా ? స్వామీ ! " అని యడుగగా " 

దేవీ ! గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే ఐనప్పటికీ ఎన్నడూ ఎవరికీ దానమిచ్చి యెరుగడు కనుకనే ఈ జన్మలో భక్తుడైననూ దరిద్రమను భవించుట తప్పలేదు .

Also Readగృహప్రవేశం ఇలా చేస్తే.. ఈ నియమాలు పాటిస్తే.. మీకంతా శుభమే...

అయిననూ నీవు కోరితివి కనుక నేటితో ఇతనికి కష్టములు తొలగించెదన" ని పలికి, మానవ రూప ధారియై ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలి పోయాడు.

ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషము లోనున్న శ్రీ మహా విష్ణువు ఆ ఇల్లాలితో " అమ్మా ! నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్ము ను తిరిగి తీర్చుటకు వచ్చితిని , సొమ్మును తీసికొన వలసినదని చెప్పగా ఆ ఇల్లాలు " నీవెవరవో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాము , నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు , ఎవరనుకుని మా ఇంటికి వచ్చారో, వెళ్లిపోమ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామి లేదమ్మా ! నేను పొరబాటు పడలేదు , అసత్యమసలే కాదు , నీ భర్త వద్ద అప్పు గా తీసుకున్న సొమ్ము ఇదిగో ! నువ్వు స్వీకరించు , 

నీ భర్త కు నేను తరువాత వివరిస్తానని ఆమెకు అశేష ధన , కనక , వస్తు వాహనాలు , మణి మాణిక్యాలు , సేవక జనం, తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలూ కానుకలుగా ఇచ్చి వెళ్లిపోబోతూ ఉండగా..

ఆ ఇల్లాలు  ఓయీ ! నీ ముఖం మీద కప్పియున్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు ! నా భర్త కు చెప్పాలికదా ! నువ్వు ఎలా ఉంటావో ? అని పలుకగా....

స్వామి  అమ్మా ! నా ముఖాన్ని నీకు చూపలేను , నా ముఖం మీద ఎవరో నల్లరంగు పూశారమ్మా ! నేనెవరో నీ భర్తకు తెలుసులే !" అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్లి కొంతదూరం పోయాక అంతర్ధాన మైనాడు.

ఇంతలో ఊరిలో యాచనకు వెళ్లిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరిగుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్లు మిరుమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది , అనేకమంది సేవకులూ , ఉద్యానవనాలతో కళ కళలాడిపోతోంది ఆ భవనం. 

ఇంతలో ఇతని భార్య లోపలి నుండి వచ్చి " లోపలికి రమ్మని భర్తని ఆహ్వానించగా , ముందు తన భార్యని గుర్తుపట్ట లేకపోయాడు , 

అసలు ఆ సంపదని ఎందుకు స్వీకరించావు ? మనము ఎవరికో అప్పివ్వడమేమిటి ? అది తిరిగి వారు తీర్చడమేమిటి ? మన దీన స్థితి నీకు తెలియనిదా ? 

అంటూ భార్య పై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటివెంట విన్న తరువాత తన కళ్లను , చెవులను తానే నమ్మలేకపోయాడు.అయితే ఆ వచ్చినవాడు ఎలా వున్నాడు ? అతడి ముఖము ఎలాగ ఉన్నది ? అని భార్యని ప్రశ్నించగా..నేను అతడి ముఖాన్ని చూడ లేదు , అతడి ముఖం పై ఎవరో నల్లని రంగు పులిమారట , ముఖము చూపించ లేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు , అయినా అతడు వెళుతూ వెళుతూ నాగురించి నీ భర్త కు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్లిపోయాడన్నది.

Also Readఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉండాలి.. 

అది వినిన భక్తుడు హతాశుడై భార్యతో " వచ్చినవాడు మరెవరో కాదు , మారువేషంలో వచ్చిన సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే ! ప్రతి నిత్యమూ నేను విష్ణువును స్తుతిస్తున్నా ఆ స్వామిని నేను దర్శించ లేకపోయాను,

ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శన భాగ్యం కలిగింది" అని పలికి ఇంటి లోపలికి వెళ్లి ఉదయము విష్ణు సహస్రనామాలలో  మొట్టమొదటి " విశ్వం " అనే నామంపై పులిమిన  నల్లరంగును తొలగించాడు . 

తరువాత భార్య తో " నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడు  అడగగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి పోవగా సముద్రము ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఊర్ధ్వదిక్కుగా చేతులు జోడించి శ్రీమహావిష్ణువు నుద్దేశించి స్తోత్రగానం చేశాడు.

అప్పుడు అశరీర వాణి " భక్తా ! పూర్వ జన్మ కర్మఫలముల కారణంగా ఈ జన్మ లో నీకు భగవద్దర్శనము కలుగదు , మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందెదవు " అని పలికినది.

విష్ణు సహస్త్రనామ నిత్యపారాయణ వలన కలుగు ఫలిత మిదియని అందరూ గ్రహించండి , ప్రతి నిత్యమూ పఠించండి , అవసరార్ధులకు సహాయం చెయ్యండి.

Famous Posts:

మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి


నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి..? 


అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం.. చక్కని పరిష్కారం..!!


భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం


హిందూ సాంప్రదాయం ప్రకారం శుభ_అశుభశకునాలు –వాటి ఫలితాలు


ఉద‌యం నిద్ర‌లేవ‌గానే వేటిని చూడ‌కూడదో, వేటిని చూడాలో మీకు తెలుసా..?


పిల్లల కోసం శ్లోకాలు - స్తోత్రాలు

విష్ణు సహస్ర నామ మహిమ, Vishnu Sahasranamam, Vishnu Sahasranamam Telugu, vishnu, vishnu sahasranamam in telugu download, vishnu sahasranamam telugu pdf vignanam, Sree Vishnu Sahasra Nama Stotram

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments