Drop Down Menus

పూజ గది ఎలా ఉండాలి.. ఇంట్లో ఎక్కడ ఉండాలి తెలుసా ? Pooja room Vastu tips for every Indian home - Vastu for Pooja Room


 దేవుడి గది ఎలా ఉండాలి..?

ఇంటిలో దేవుడి పటాలకు, ప్రతిమలకు మనం పూజలు చేసుకుంటాం. గృహంలో దేవుడి గది ప్రత్యేకం. అయితే ఎవరి ఆర్ధిక స్ధోమతను బట్టి వారు దేవుడికి అలమరాలలో ఒక అరగాని, ప్రత్యేకించి ఒక మందిరంగాని లేదా ప్రత్యేకంగా ఒక గదినిగాని ఏర్పాటు చేసుకుంటారు.

అయితే ఇంటిలో ఎక్కడ వీలు దొరికితే అక్కడ దేవుడి గదిని ఏర్పాటు చేసుకోకూడదు. దేవుడి గది కోసం కూడా వాస్తును పాటించాల్సిందే. 

Also Readమీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి

దేవుడికి ప్రత్యేకించి ఒక గదిని ఏర్పాటు చేయలనుకుంటే, ఈశాన్యం గదిని అందుకు వాడుకోవటం మంచిది. అయితే ఈశాన్యం గదిలో ఎత్తుగా అరుగుగాని మందిరం మాదిరి కట్టడంగాని నిర్మించుకూడదు. దేవుడి పటాలను ఈశాన్యం గదిలో దక్షణ, పశ్చిమ నైరుతిలలో పీట వేసిగాని, ఏదైనా మంచి వస్ర్తము వేసి దానిపై పటాలు, ప్రతిమలు వుంచి పూజించుకొనవచ్చును. 

పటాలను గోడకు వ్రేలాడదీయదలిస్తే దక్షిణ, పశ్చిమ గోడలకు వ్రేలాడదీయాలి. ఈశాన్యం గదిలో దక్షిణ, పశ్చిమగోడలలో గల అలమారలో కూడా దేవుణ్ణి వుంచవచ్చును.

ఈశాన్యం గదిని దేవుడి గదిగా ఏర్పాటు చేయడం వీలుకాని పక్షంలో తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, వాయవ్యాలలో దేవుడిగదిని ఏర్పాటు చేసుకోవచ్చు. నైరుతి ఆగ్నేయ గదులు మాత్రం దేవుడి గదులుగా చేయకండి. ప్రత్యేకించి దేవుడిగదిని ఏర్పాటు చేయటం అనుకూలం కాని పక్షంలో గృహములో ఏ గదిలోనైనా సరే (నైరుతి, ఆగ్నేయ, గదులలో అయిన సరే) అలమారలలోగాని, పీటమీదగాని దేవుడి పటాలు, ప్రతిమలు వుంచుకొని పూజించవచ్చు. 

అయితే దేవుడి పటాలు, ప్రతిమలు ఎటువైపు(ఏ దిక్కుకు) అభిముఖంగా వుండాలి? అనేది అనేకమంది ప్రశ్న కొందరు తూర్పు, ఉత్తరాలకు దేవుడు అభిముఖంగా వుండాలని, మరికొందరు పూజించేవారి ముఖము తూర్పు, ఉత్తరాలకు అభిముఖంగా వుండాలని చెబుతున్నారు. మీరు ఏ వైపుకు అభిముఖంగా వున్నా ఇందు వాస్తుకు సంబంధం లేదని, అది మనలోని భక్తికి సంబంధించినదని చెప్పవచ్చు. అయితే ధ్యానం చేసే అలవాటు వుంటే తూర్పుకు అభిముఖంగా వుండి ధ్యానం చేయటం ఉత్తమం. ఉత్తరాభిముఖము కావటం రెండవ పక్షంపై అంతస్తుల్లో కూడా పూజగదిని ఏర్పాటు చేసుకొనవచ్చును.

Also Readపిల్లల కోసం శ్లోకాలు - స్తోత్రాలు

దేవుని గది నిర్మాణంలో జాగ్రత్తలు

గృహ నిర్మాణంలో మిగతా వాటిలాగే పూజ గదికి కూడా వాస్తు ప్రాముఖ్యత వుంది. నిజానికి ఈశాన్యంలో పూజ గది ఉండాలని, ఈశాన్యం గదిని పూజ గదిగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈశాన్యం గదిలో నుంచి రాకపోకలు వుండే విధంగా రెండు ద్వారాలు వుంచి బరువులు వుంచకుండా, పరిశుభ్రంగా వుంచుతూ వాడుకోవడం మంచిది. 

తూర్పు, ఉత్తర దిక్కులలో పూజా గదిని ఏర్పాటు చేసుకోవడంలో ఏ మాత్రం దోషం లేదని గ్రహించండి. దక్షిణ, పశ్చిమాల వైపు పూజ గదిని ఏర్పాటు చేయడం వల్ల ఇతర అవసరాల కోసం ఇంటిలో ఎక్కువగా తూర్పు, ఉత్తర భాగాలను వాడడం జరుగుతుంది. ఇది ఒక రకంగా శుభకరం అని గ్రహించండి. 

మరో ముఖ్య విషయం ఏమిటంటే.. పూజ గదికి ఎటువైపు కూడా అనుకుని బాత్ రూమ్ లేదా టాయిలెట్సు ఉండకూడదు. ఇదే విధంగా పూజ గది పైనగాని, కింద గాని టాయిలెట్సు, వుండకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి పొరపాటు చేయకూడదు. వీటి విషయంలో అపార్ట్ మెంట్ లో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు అపార్ట్ మెంట్స్ లో ఒకరి పూజ గది పైన ఇతరుల టాయిలెట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు.

అలాగే పూజ గది మీద 'లో-రూఫ్' వేసి అనవసరమైన సామాను వేయడం చాలా మంది చేస్తుంటారు. ఇలా చేయకూడదు. పూజ గదిలో అరుగులు నిర్మించి దానిపై దేవుని పటాలను వుంచి పూజ చేసుకోవడం చాలా ఇళ్లల్లో అలవాటుగా వుంది. పూజ పటాలను అరుగులపై వుంచే కన్నా, కొయ్యపీట, మండపములో వుంచుకోవడం మంచిది. అరుగు మీద లేదా నేల మీద పూజ పటాలు వుంచినప్పుడు నేలపై కొత్త వస్త్రాన్ని ఏర్పాటు చేసి దానిపై పూజ పటాలను ఏర్పాటు చేయాలి. వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు. చాపగాని, వస్త్రముగాని వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి. పూజా గృహంలో నిత్య దీపారాధన ఎంతో శుభకరం.

Also Readజ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకం ఎప్పుడు రాయించుకోవాలి?

ఇక చాలా మంది తమ పెద్దల ఫోటోలను దేవుని ఫోటోల పక్కన వుంచి పూజించడం అలవాటుగా వుంది. పెద్దల విషయంలో మనకున్న గౌరవానికి గాను వారి ఫోటోలకు ప్రత్యేకంగా వుండాలేగాని, పూజ గదిలో దేవుడి ఫోటోలతో సమంగా వుంచడం శుభకరమైన విధానం కాదు...

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు


ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

 దేవుడి గది, పూజ గది, Vastu for Pooja Room, vastu for pooja room in flats, which direction should god face in pooja room?, pooja room size as per vastu, pooja room in kitchen, pooja room vastu in telugu, 

vastu tips for mandir in flat

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.