గ్రహాలు పరిహారాలు..| Navagraha Pooja Procedure, remedies and its Benefits - Navagraha Remedies in Telugu
గ్రహాలు పరిహారాలు..
రవి గ్రహం:-
‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అనే సంప్రదాయం ప్రసిద్ధమైనది. వాస్తు శాస్త్ర విద్య ఈశాన్యాన ఉన్న నుయ్యి, తూర్పున ఉన్న స్నానగృహం, ఇంట్లో ఈశాన్యాన ఉన్న పూజాగృహం, ఆగ్నేయాన ఉన్న వంటిల్లు బాలభానుని లేతకిరణాల వల్ల ఆరోగ్యాన్ని పెంచుతాయి.
సౌర స్నానాల పేరిట ఆరోగ్యం సాధిస్తున్నారు. ఉదయకాంతి శరీర ఆరోగ్యానికి చాలా మంచిదని కొత్త వైద్య ప్రక్రియ కూడా రూపొందుతున్నది. ఉదయాన సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఉదయకాలపు నడక ఆరోగ్యవంతుల మంచి అలవాట్లు. సూర్యుని కాంతిని ప్రత్యేక అద్దం ద్వారా అనారోగ్య ప్రదేశంలో ప్రసరింపజేసి ఆనారోగ్యాన్ని నివారించే పద్ధతిని రష్యన్ శాస్తవ్రేత్తలు నిరూపించారు. వేర్వేరు రోగాలకు వేర్వేరు రంగుటద్దాల ద్వారా సూర్యకాంతిని ప్రసరింపజేసి అనారోగ్యాలను నివారింపచేసే కలర్ థెరపీ ప్రసిద్ధి చెందుతోంది. రవికి సంబంధించిన రాగి జావ,క్యారెట్,ధాన్యం, గోధుమలు, గోధుమ పాలు, గోధుమ గడ్డి రసం పలువిధాలైన అనారోగ్యాలను నివారిస్తున్నట్టుగా శాస్తవ్రేత్తలు వక్కాణించారు. ఎముకలకు అధిపతి రవి. ఆ ఎముకలలోని లోపాలను పగడం ద్వారా పూరించడం ఫ్రాన్స్ శాస్తజ్ఞ్రుల కృషి ఫలితం. కంటి సమస్యలు ఉన్నవారు క్యారెట్ తినటం మంచిది. ఇలా రవి లక్షణాలు గల పదార్ధలు రవి ప్రభావం వలన జనించిన రోగాలన్నీ నయం చేస్తున్నాయి.
Also Read : పెళ్ళికాని మగవారికి అద్భుతమైన పరిష్కారం
చంద్రుడు:-
కాల్షియంకు ముత్యపు చిప్పలకు, ముత్యాలకు, మంచి గంధానికి, లవణానికి అధిపతి చంద్రుడు. మనస్సు కు చంద్రుడధి దేవత. రక్తంలోని తెల్ల రక్తకణాలకు చంద్రుడే అధిపతి. శరీరంలోని కాల్షి యం లోపించినపుడు ముత్యపు భస్మం ముం దుగా తీసుకోవాలంటుంది ఆయుర్వేదం. పూర్వపు రాజులు ముత్యపు సున్నం తాంబూలంలో వాడుకున్నారు. శరీరంలోని రక్తవేగం పెంచడానికి లవణం ఉపయోగపడుతుంది. ప్రేమ, కోపం, ఉద్వేగం బొమ్మా బొరుసులు. ఆ ఉద్వేగాన్ని పెంచే లక్షణం లవణంలో ఉం ది. ఆ ప్రేమకు కూడా చంద్రుడే అధిపతి. అదే లవణాన్ని సూక్ష్మీకరించి (నేట్రంమూర్) ముం దుగా వాడితే ఉద్వేగాన్ని రక్తపోటును తగ్గిస్తోం ది. మంచి గంథం రాసుకుంటే చల్లదనం ఇ స్తుంది. వెన్నెల ఆ లక్షణం కలదే. ముత్యం ధరిస్తే మనసు ప్రశాంతిని పొందుతుందని జ్యోతిశ్వాస్త్ర సాంప్రదాయం.
కుజుడు:-
ఎర్ర రక్త కణాలకు, రక్త చందనానికి, ఎముకలలోని మజ్జ కు, తుప్పుగల ఇనుముకు, వ్రణాలకు, దెబ్బ సెప్టిక్ అవ్వడానికి, బెల్లంలోని ఐరన్‌కు అధిపతి కుజుడే.కుజగోళం ఆకాశంలో ఎర్రగా కనుపిస్తుంది. ఆ ఎరుపుకు కారణం ఆ గోళం మీద తుపపుపై సూర్యకాంతి పడటమే. శరీరంలో ఐరన్ అధికంగా ఉంటే దెబ్బలు తొందరగా తగ్గుతాయి. అవి లోపించిన దెబ్బపై తుప్పు ఇనుము తగిలినా సెప్టిక్ అవుతుంది. బెల్లాన్ని శరీరంలో ఇముడ్చుకునే శక్తి లోపించినపపుడు ఆ బెల్లమే వ్రణాలను తగ్గకుండా చేస్తుం ది. ఎములలో ని మజ్జలో పగడం కలిసిపోతుందని ఫ్రాన్స్ వైజ్ఞానికుల అభిప్రాయం. పగడం కుజగ్రహానికి చెందిన రత్నం. కుజుడు శరీర పుష్టికి ప్రాధాన్యం ఇచ్చే గ్రహం. అతనికి ధాన్యమైన కందిపప్పు శరీర పుష్టినిస్తోంది. కందుల రంగు ఎరుపే.
బుదుడు:-
బుధుడు నరాలకు సంబం ధించిన గ్రహం. అతని రాశులు మిథున, కన్యలు. ధాన్యం పెసలు. కన్యారాశి ఉత్పత్తికి, అమ్మకానికి సంకేతం. బుధుడు వ్యాపారస్థుడు. అతని రంగు ఆకుపచ్చ. ఆ రంగు ఉత్పత్తికి సంకేతమని ఆధునిక వైజ్ఞానికుల అభిప్రా యం. పెసల రంగూ ఆకుపచ్చేనని, అవి నరాల నిస్సత్తువను తొలగిస్తాయని ఆహార వైద్యుల అభిభాషణం. బుధుడు సమయస్ఫూర్తికి అధిపతి. అది లోపించడం బుద్ధి మాంద్యం. పెసలలోనూ బుధునికి చెందిన వసలోను ఆ బుద్ధి మాంద్యాన్ని తగ్గించే లక్షణం ఉంది.
గురుడు:-
గురుడు పసుపుకు, పంచదారకు, షుగర్ వ్యాధికి, శనగలకు సంబంధించిన గ్రహం. పంచదారను జీర్ణించుకుంటే షుగర్ వ్యాధి రాదు. అది జీర్ణించుకోలేనప్పుడు ఏర్పడే పుళ్ళకు వేప, పసుపు మందులైతే పంచదార, శనగలు పుళ్ళు తగ్గకుండా చేస్తాయి. గురుడు మేధావి. మేధావులు ఆలోచనలు చేస్తారు. వ్యాయామం చేయరు. ఆ రెండు లక్షణాలే షుగర్ వ్యాధిని పుట్టిస్తాయి. పసుపు షుగర్ వ్యాధి తగ్గిస్తుందని, వ్యాయామం షుగర్ రాకుండా చేస్తుందని వైద్యుల అభిప్రాయం. విశేషించి గురునికి చంద్ర, కుజ, శనులను దోషరహితులుగా చేసే ప్రత్యేక లక్షణం ఉంది. చంద్రుడిచ్చే జబ్బులకు శనిచ్చే వాతానికి పసుపు మంచి మందు. టి.బి.కి కూడా చంద్రుడే అధిపతి. దాన్ని నివారించే శక్తి వెన్న కలిపిన పసుపుకున్నది.
Also Read : మొక్కు తీర్చడం అంటే ఏమిటి ? దేవుడి మొక్కు ఎలా తీర్చుకోవాలి ?
శుక్రుడు:-
శుక్రుడు సౌందర్యానికీ, నిమ్మపండుకు, తేనెకు, చింతపండుకు, చర్మానికి అధిపతి. సౌందర్యాన్ని చింతపండు, నిమ్మపండు పెంపొందించడం లోకప్రసిద్ధమే. తేనె కూడా ఈ విషయంలో సహకరిస్తుంది. అది పుష్పాల నుండే వస్తుంది. పుష్ప జాతులు సౌందర్యానికి, సౌకుమార్యానికీ ప్రతీకలు.
శని:-
వాత లక్షణం కలవాడు. చర్మం లోని మాలిన్యాలను వెలువరించే శక్తికి ఇతడు అధిపతి. నువ్వులకు, ఊపిరితిత్తులకు కూడా అధిపతే. ఊపిరితిత్తులు చేసే పని వాయువును క్రమబద్ధం చేయడమే. వాతం అంటే వాయు దోషమే కదా! మాలిన్యాలను వెలువరించే లక్షణం, ఊపిరితిత్తుల పనిని క్రమబద్ధం చేసే లక్షణం నువ్వులకు ఉందని ఆయుర్వేద విజ్ఞానం చెపుతోంది.
Famous Posts:
> బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెంచితే వచ్చే ఫలితాలు
> ఏ రాశి వారు ఏ దేవునికి తాంబూలం సమర్పించాలి?
> కొత్త గా పెళ్ళి చేసుకున్న కొడుకుకు ఒక తల్లి చెప్పిన 5 ముఖ్య విషయాలు
> జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకం ఎప్పుడు రాయించుకోవాలి?
> తల్లితండ్రుల గొప్పదనం గురించి శాస్త్రాలలో చెప్పబడిన విధానం
> మొక్కు తీర్చడం అంటే ఏమిటి ? దేవుడి మొక్కు ఎలా తీర్చుకోవాలి ?
> వాస్తురిత్య మనీ ప్లాంట్‌ను ఏ దిశలో పెంచాలి ?
గ్రహాలు పరిహారాలు, how to perform navagraha shanti puja at home, navagraha remedies in telugu, navagraha puja benefits, how to do navagraha puja at temple, navagraha books in telugu, navagraha shanti puja cost, navagraha pooja cost, navagraha homam at home
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment