ఆలయం గర్భగుడిలోకి ఎందుకు ప్రవేశించరాదు
> మన దేశంలోని కొన్ని ఆలయాల గర్భగుడుల లోనికి కొందరిని రానిస్తున్నారు. ముఖ్యంగా జ్యోతిర్లింగాలను అందరూ స్పర్శించవచ్చు - అని కొందరంటారు.
> కానీ కొన్ని ఆలయాలలో గర్భగుడిలోనికి వెళ్ళక పోవడం నియమం. అది శాస్త్రాలు ఏర్పరచినది. ఏ వర్ణంవారు కూడా గర్భగుడిలోనికి రారు. దానికంటూ నియమించిన అర్చకులు తప్ప. దీని వెనుక భౌతిక - ధార్మిక కారణాలున్నాయి.
Also Read : ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి
> మూర్తిని తాకాలన్నా, అర్చించాలన్నా సదాచారం, శాస్త్ర నియమాలు అవసరం. అవి అందరికీ సాధ్యం కావు.
> “సదాచారం లేనివారు, రజస్వలయైన వారు గుడిలోకి ప్రవేశిస్తే విగ్రహం/లింగంలోని దైవశక్తి ఇంక ఉండదు. వెంటనే ప్రోక్షణాదులు జరపాలి. లేకపోతే క్రమంగా ఆ విగ్రహాదుల్లోకి పిశాచాలు ప్రవేశిస్తాయి.
> ఆ గ్రామ, నగరాలలో ఉపద్రవాలు వస్తాయి. వ్యాధులతో , శోకాలతో ప్రేతాలు భయాన్ని కలిగిస్తాయి" - అని శాస్త్రం స్పష్టంగా చెప్తోంది.
> సంప్రోక్షణం ప్రకుర్వీత
తద్దోషస్యోపశాంతయే|
దోషైరుపహతం జ్ఞాత్వా
ప్రాసాద ప్రతి మాదికం|| (ఈశ్వర సంహిత)
> విలంబనే తు నిష్కృత్యా
వినశ్యేద్దేవ సన్నిధిః|
తత్స్థాః ప్రేతా భయం కుర్యుః
వ్యాధి శోకాదిభిర్నృణామ్|| (విష్ణు సంహిత)
> ఆలయంలోని విగ్రహంలో దేవుడున్నాడని విశ్వసిస్తే, వీటినీ విశ్వసించాలి. విగ్రహాన్ని దేవతా శక్తిగా మార్చడం ఒక మహా ప్రక్రియ. ప్రతిమాశోధన - అనేది మంత్ర, యజ్ఞాదులతో చేసి, యంత్రాది, ప్రతిష్టాది విధానాలతో ఆ బింబంలో కళాన్యాసం చేసి దేవతని ప్రతిష్ఠిస్తారు. వాటిని స్పర్శించా లన్నా, అర్చించాలన్నా ఆయా నియమాలను అనుష్టించే వారికే అర్హత ఉంటుంది.
అయితే దేవాలయంలోని మూర్తిని తాకవలసిన అవసరమేముంది? నమస్కరిస్తేచాలు - ఆ మూర్తినుండి శక్తి తరంగాలు ప్రసరిస్తాయి. ధ్యానిస్తే చాలు - తరించిపోతాం. అందుకే - గర్భగుడి, అంతరాలయం, ముఖమండపం-వంటివి అంద రూ దర్శించి అనుగ్రహం పొందడానికై ఏర్పాటు చేశారు. యుగాలనుండి అందరూ ఆలయానికి వెళ్ళి స్వామి దయను పొందుతున్నారు.
> భౌతికంగా ఆలోచించినా - గర్భాలయంలోకి జనం ఎక్కు వైనా, అందరూ తాకుతున్నా ప్రశాంతత దెబ్బతినడం, విగ్రహ శిల అరిగిపోవడం వంటివి జరుగుతాయి. కొద్దిమంది నియమితంగా సేవిస్తే- అవి పదిలంగా ఉంటాయి.
> స్థూలంగా ఆలోచిస్తే అసమంజసంగా అనిపించేవి, సూక్ష్మం గా గమనిస్తే సముచితంగా అనిపిస్తాయి. ఆ సూక్ష్మదృష్టి, తెలివిలేని మూర్ఖులు మన మతాన్ని విపరీత దృష్టితో చూస్తున్నారు. వైద్యచికిత్సా కేంద్రాలలో శస్త్రచికిత్సవంటివి జరిగేచోట వైద్యుడు, రోగి తప్ప ఎవరూ ఉండరు. ఎందుకు? అది ఒక సూక్ష్మ విజ్ఞానం. అలాగే దేవతా వ్యవస్థది మరొక సూక్ష్మవిజ్ఞానమే. నమ్మితే ఈ విజ్ఞానాన్నీ నమ్మాలి.
> సర్వవ్యాపకుడైన పరమేశ్వరునికి ఏ పరిమితులు, నియమాలు ఉండవు. ఎవరైనా, ఎక్కడైనా, ఎలాగైనా స్మరించి, ధ్యానించి, కీర్తించి ధన్యులు కావచ్చు. కానీ ఒక విగ్రహంగా దివ్యశక్తిని కేంద్రీకరించినప్పుడు మాత్రం నియమాలు వర్తిస్తాయి.
Famous Posts:
> పూజలో కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ?
> అమ్మాయి పుష్పావతి అయిన సమయములో చేయవలసినవి
> దిష్టి, దృష్టి - నివారణ మార్గాలు
> శివునికి ఏ అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది?
> అగ్నిసాక్షిగా వివాహం ఎందుకు చేస్తారు..?
> అన్నదానం చేసేటపుడు 100 లో 99 మంది చేసే అతి పెద్ద తప్పు
> గుడి దగ్గర్లో ఇల్లు ఉండకూదనడానికి ఖచ్చితమైన కారణాలు ఇవే
> దీపావళి రోజు ఉప్పుతో ఇలా చేస్తే చాలు
Dharma Sandesalu Telugu, garbha griha meaning, sanctum sanctorum meaning, sanctum in temple, garbhagriha temple, garbhagriha meaning in english, garbhagriha concept, sanctum sanctorum india, garbhagriha architecture, ఆలయం , గర్భగుడి
Tags
interesting facts