ఈ స్తోత్రం పఠించడం వలన విద్యార్థులు చదువులో రాణిస్తారు | Medha Suktam - Telugu - మేధా సూక్తమ్..!!

 

ఈ స్తోత్రం పఠించడం వలన విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఎవరికైనా జ్ఞాపకశక్తి పెరగాలన్నా ప్రతిభా పాటవాలు పెంచుకోవాలన్న ఈ స్తోత్రం నిత్యం పఠించండి..

Also Readపిల్లల కోసం శ్లోకాలు - స్తోత్రాలు

మేధాసూక్తం పఠించలేని వాళ్ళు సరస్వతి కవచాన్ని పఠించవచ్చును.

పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు 

యాజ్ఞవల్క్య మహర్షి. 

అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రథమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. 

సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు.

అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటాన్ని  గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. 

యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు.

ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు, జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. 

తన మీద దయచూపి జ్ఞాన, జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, 

విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, 

గ్రంథ రచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను 

తనకు ప్రసాదించమన్నాడు.

సత్సభలలో మంచి విచారణ శక్తిని, సత్య స్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. 

ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో ఉంది. 

యాజ్ఞవల్క్య మునీశ్వరుడు స్నానము చేసి భక్తితో సరస్వతీ దేవిని ఇట్లు స్తుతించెను

స్మృతి శక్తి జ్ఞాన శక్తి బుద్ధి శక్తి స్వరూపిణి ప్రతిభాకల్పనా శక్తిర్యాచ తస్యై నమోనమః

జగన్మాతా ! ఓ సరస్వతీ! గురు శాపమువల్ల స్మృతి, విద్యాహీనుడనై, దుఃఖములో ఉన్న నాపై దయ చూపుము.

ఓ విద్యాధిదేవతా! నాకు జ్ఞానమును, స్మృతిని, 

విద్యను, ప్రతిష్ఠను, కవితను,శిష్యులకు బోధించు శక్తిని, గ్రంథరచన చేయు శక్తిని, మంచి మంచి శిష్యుని, సత్సభలో ప్రతిభను, ఆలోచించు శక్తిని ఇమ్ము. 

ఇవి అన్నియు నా దురదృష్టమువలన లోపించినవి.

మేధా శక్తికి మూల హేతువైన మేధాదేవిని మేధా సూక్తమ్ ద్వారా ప్రార్థించడం తైత్తరేయారణ్యకంలో కనపడుతుంది. 

ప్రతిరోజు మేధా సూక్తం పఠించటం వలన విధ్యార్ధులకు చదువు పట్ల శ్రద్ధ పెరిగి మేధా శక్తి మెరుగుపడటమే కాకుండా తెలివితేటలు, మాట్లాడే సామర్ధ్యాన్ని పెంచుతుంది. 

ఉన్నత విద్యలు అభ్యసించే వారు మేధా సూక్తమ్ పఠించటం ఉత్తమం.

Also Read సోమవారం ఇలా చేయండి రుణ బాధలు వదిలిపోతాయ్

మేధా సూక్తమ్..!!

ఓం యశ్ఛంద’సామృషభో విశ్వరూ’పః | ఛందోభ్యో‌உధ్యమృతా”థ్సంబభూవ’ |

స మేంద్రో’ మేధయా” స్పృణోతు |

అమృత’స్య దేవధార’ణో భూయాసమ్ |

శరీ’రం మే విచ’ర్షణమ్ |

జిహ్వా మే మధు’మత్తమా |

కర్ణా”భ్యాం భూరివిశ్రు’వమ్ |

బ్రహ్మ’ణః కోశో’உసి మేధయా పి’హితః |

శ్రుతం మే’ గోపాయ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

ఓం మేధాదేవీ జుషమాణా న ఆగా”ద్విశ్వాచీ’

 భద్రా సు’మనస్య మా’నా |

త్వయా జుష్టా’ నుదమా’నా దురుక్తా”న్ బృహద్వ’దేమ విదథే’ సువీరాః” |

త్వయా జుష్ట’ ఋషిర్భ’వతి దేవి త్వయా బ్రహ్మా’‌உ‌உగతశ్రీ’రుత త్వయా” |

త్వయా జుష్ట’శ్చిత్రం విందతే వసు సా నో’ జుషస్వ ద్రవి’ణో న మేధే ||

మేధాం మ ఇంద్రో’ దదాతు మేధాం దేవీ సర’స్వతీ |

మేధాం మే’ అశ్వినా’వుభా-వాధ’త్తాం పుష్క’రస్రజా | అప్సరాసు’ చ యా మేధా గం’ధర్వేషు’ చ యన్మనః’ | దైవీం” మేధా సర’స్వతీ సా మాం” మేధా సురభి’ర్జుషతాగ్ స్వాహా” ||

ఆమాం” మేధా సురభి’ర్విశ్వరూ’పా హిర’ణ్యవర్ణా జగ’తీ జగమ్యా |

ఊర్జ’స్వతీ పయ’సా పిన్వ’మానా సా మాం” మేధా సుప్రతీ’కా జుషంతామ్ ||

మయి’ మేధాం మయి’ ప్రజాం మయ్యగ్నిస్తేజో’ దధాతు మయి’ మేధాం మయి’ ప్రజాం మయీంద్ర’ ఇంద్రియం ద’ధాతు మయి’ మేధాం మయి’ ప్రజాం మయి సూర్యో భ్రాజో’ దధాతు ||

ఓం హంస హంసాయ’ విద్మహే’ పరమహంసాయ’ ధీమహి తన్నో’ హంసః ప్రచోదయా”త్ ||

Famous Posts:

మేధా సూక్తం, medha suktam meaning in telugu, shraddha suktam telugu pdf, medha suktam benefits, medha suktam telugu mp3 download, durga suktam telugu lyrics, sri suktam telugu pdf, neela suktam telugu pdf, narayana suktam telugu, saraswathi devi, telugu stotrams.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS