Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

రుక్మిణి కల్యాణం మహత్యం - వివాహం కానీ కన్యలకి పరిహారం | Rukmini kalyanam Benefits in Telugu

 

రుక్మిణి కల్యాణం మహత్యం :

వివాహం కానీ కన్యలకి  పరిహారం..

భారతీయ వివాహ వ్యవస్థకి ఎంతో ప్రాధాన్యత వుంది ... మరెంతో ప్రత్యేకత వుంది. సంప్రదాయ బద్ధంగా కొనసాగే పెళ్లి పనులు,  ప్రాచీనకాలం నుంచి వస్తోన్న ఆచార వ్యవహారాలకు అద్దం పడుతుంటాయి.

Also Readసంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 

ఆధునీక నాగరికత కొన్ని పద్ధతులను పక్కకి నెట్టేస్తున్నా, వివాహ వ్యవస్థ మాత్రం నేటికీ తన విశిష్టతను నిలబెట్టుకుంటూనే వుంది. 

వివాహమనేది స్త్రీ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది కాబట్టి, ఆ విషయంలో వాళ్లు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు.

ఈ నేపథ్యంలో పెళ్లి సంబంధాలు రాకపోవడం, 

వచ్చిన సంబంధాలు నచ్చక పోవడం యువతులను మానసిక వత్తిడికి గురిచేస్తుంటాయి. 

ఇంకొందరు తమకి సంబంధం నచ్చకపోయినా, 

పెద్దల మాట కాదనలేక తల వంచవలసి వస్తుంది. ఇలాంటి సందర్భంలో యువతులు తమ దురదృష్టాన్ని నిందించుకుని కుమిలిపోతుంటారు.

ఇలాంటి వారిని చూసిన మిగతా వాళ్లు కూడా తమ భవిష్యత్తును తలచుకుని ఆందోళన చెందుతుంటారు. తమ ఆశలకి ... ఆలోచనలకి తగిన వరుడు దొరుకుతాడో లేదోనని సతమతమైపోతుంటారు.

ఈ తరహా యువతులకి పరిష్కార మార్గంగా 

'రుక్మిణీ కల్యాణం' పేర్కొనబడుతోంది. 

సంస్కృతంలో వ్యాసభగవానుడు రచించిన 

'శ్రీ భాగవతం'లో రుక్మిణీ కళ్యాణ ఘట్టం అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతుంది. 

శ్రీ కృష్ణుడిని భర్తగా పొందడానికి ఆమె పడిన ఆరాటం ... ఆమె కోరిక నెరవేరిన తీరు ఎంతో మనోహరంగా వర్ణించడం జరిగింది. 

సాధారణంగా వివిధ గ్రంధాలను పారాయణం చేయడం వలన ఆయా దైవాల అనుగ్రహం కలుగుతుంది. 

అలాగే భాగవతంలోని రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని 

చదవడం వలన, యువతులకు వెంటనే వివాహ యోగం కలుగుతుందని చెప్పబడుతోంది.

రుక్మిణీ కల్యాణం చదవడం వలన ... 

యువతులకు ఇష్టంలేని సంబంధాలు తప్పిపోయి, కోరుకున్న వ్యక్తి భర్తగా లభిస్తాడు.

అలా జరగడం కోసం వ్యాసభగవానుడు కొన్ని ప్రత్యేకమైన బీజాక్షరాలను ఉపయోగిస్తూ ఈ కళ్యాణ ఘట్టాన్ని రచించాడు. 

ఇక అమ్మవారు కూడా తన వివాహ ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో చదివిన వారిని ఈ విధంగా అనుగ్రహిస్తూ ఆనందాన్ని కలిగిస్తుంది.

Also Readభార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త వందేళ్లు జీవిస్తాడు.

1. ముందుగా శ్రీకృష్ణుని నిత్యపూజచేసి రుక్మిణీ కళ్యాణం పారాయణం ప్రారంభించాలి.

2. శ్రీకృష్ణ నిత్యపూజ చేయలేని వారు కనీసం 

కృష్ణ అష్టోత్తరము మరియు కృష్ణాష్టకము 

ఖచ్చితముగా చదవాలి. 

3. మీ జన్మనక్షత్రము రోజుగాని, లేదా 

నామనక్షత్రము రోజుగాని పారాయణ ప్రారంభించండి. 

4. వీలయినంతవరకు శుక్రవారం, గురువారాలలో పారాయణ ప్రారంభించండి. 

మీకు వివాహము నిశ్చయము కాగానే ఎనిమిదిమంది కన్యలను పిలిచి (శ్రీకృష్ణుని అష్టభార్యలుగా భావించి) చందన తాంబూలములతో రుక్మిణీ కళ్యాణం అను పుస్తకమును దానముగా ఇవ్వండి 

శ్రీకృష్ణుని అనుగ్రహం ఖచ్చితముగా లభిస్తుంది.

Famous Posts:

rukmini kalyanam pooja procedure, rukmini kalyanam benefits in telugu, rukmini kalyanam, slokas in telugu pdf, rukmini kalyanam pdf telugu, rukmini kalyanam story, rukmini, kalyanam padyalu in telugu pdf, rukmini kalyanam lyrics, rukmini kalyanam book in english pdf download

Comments

Popular Posts