Drop Down Menus

అరుణాచలం వెళ్ళిన వారు, వెళ్లబోయే వారు తప్పక తెలుసుకోవలసిన కధ | Power of Arunachala - Must Read This Story

అరుణాచలం వెళ్ళిన వారు, వెళ్లబోయే వారు  తప్పక తెలుసుకోవలసిన కధ ఇది. అక్కడ ఆలయం లోపలకి వెళ్లేటప్పుడు మొదట ఒక సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయం ఉంటుంది.

చాలా మహత్యం, శక్తివంతమైనది.  అక్కడే అరుణగిరి నాధుడు అనే గొప్ప కవి పండితుడిని అనుగ్రహించాడు సుబ్రహ్మణ్యుడు.

అరుణగిరి నాథుడు:-

అరుణగిరి నాథుడు శ్రీనాథుని కాలంలో ప్రసిద్ధిచెందిన కవి పండితుడు. ఇతనినే "గౌడ డిండిమభట్టు" అని పిలిచేవారు.

యవ్వనంలో కొంత పైలా పచ్చిసుగా తిరిగే వాడట ఆయన,చెడు వ్యసనాలకు బానిసై,  తీవ్ర రోగగ్రస్తుడై కుటుంబం చే వెలివేయబడి  ఒకసారి ఆయన తీవ్ర విచారగ్రస్తుడై ఉంటే  ఒక సాధువు “దైవ ప్రారన చేసుకో, ఆయన కృపకు ప్రాతుడివిగా అని చెప్పాడు. అలా చెప్పినది సాక్షాత్తూ అరుణాచలేశ్వరుడంటారు.

ఆయన తీవంగా ప్రార్తించినా ఫలితం లేకుంటే, తిరువణ్ణామలై లోని అరుణాచలేశ్వర ఆలయంలోని ఉత్తరగోపురం ఎక్కి ఆత్మహత్య చేసుకుందామని క్రిందకి దూకాడు, అప్పుడు  కుమారస్వామి ఆయనను పడకుండా పట్టుకుని క్రిందకు దించి నాలుకపై షడక్షరిని లిఖించి, తన ప్రశస్తిని గానం చేసి తరించమన్నాడు.  అపుడు తన నోటినుండి ఆశువుగా వచ్చిన కీర్తనే ఈ Muthai tharu pathi . చాలా అద్భుతంగా ఉంటుంది, ఒకసారి వినండి.

అది జరిగిన ఆ ప్రదేశం సుబ్రహ్మణ్యేశ్వర కోవెలగా అరుణాచలేశ్వరాలయంలో ఉంది, ఇప్పటికి అరుణాచలం వెళ్ళినపుడు లోపలి వెళుతుండగా ఎడమ ప్రక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం దర్శించవచ్చును. 

ఇక అరుణగిరి నాథుని భక్తికి, భక్తి రచనకు అడ్డులేదు. వేల కొలది కీర్తనలు ప్రజల నాలుకపై నాట్యమాడాయి. ఈయన కీర్తిని హరించలేని సంబంధన్‌ అనే ప్రాఢదేవరాయల మంత్రి, సభలో అరుణగిరి నాథుని సవాలు చేశాడు.

తాను అమ్మను సభలో దర్శింప చేయగలనని, అరుణగిరి నాథుడు కుమారస్వామిని సభలో దర్శింప చేయాలని, అరుణగిరి నాథుడు అంగీకరించాడు.

అరుణగిరినాథుడు 'దేవేంద్రసంగవాకుప్పు” అనే గీతాన్ని పాడి అమ్మవారిని ప్రార్తించి, సాక్షాత్కరింప చేయలేకపోయాడు, మరల 'ఆతల సదా నారద' అనే గీతాన్ని కుమారస్వామిని ఉద్దేశించి పాడాడు.

“స్వామి! రా! నెమలి వాహనంపై నృత్వం చేస్తూరా!

దేవీ దేవతల నాట్యం చేస్తూ వెన్నంటిరా!

(పౌఢదేవరాయ మహారాజు డెందం ఆనందంతో నాట్వమాడగా, రా...”

వెంటనే దివ్య కాంతులు వెదజల్లుతూ క్షణ కాలం దర్శనమిచ్చి అంతర్దానమైనాడు కుమారస్వామి.

మరోసారి ప్రొాఢదేవరాయలు స్వర్గాన్నుండి పారిజాతం తెముంటాడు అరుణగిరినాథుడిని గుడి (తిరువజ్తామలైైలోన గోపురంలో తన దేహాన్ని భద్రపరచి, అరుణగిరినాథుడు చిలుక రూపం ధరించి, ఎగిరిపోయి, పారిజాత పుష్పాన్ని తీసుకుని తిరిగి అరుణగిరి గోపురం వద్దకు వస్తాడు (చిలక రూపంలో) అతని శరీరం కనబడదు. అప్పుడు ఆ చిలుక రపంలో తిరుత్తణికి ఎగిరి వెళ్లి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి చిలుకగా ఉండిపోతాడు.

ఇటువంటి ఎన్నో మహాత్యాలతో కూడిన స్థల పురాణాలు గల గొప్ప గొప్ప క్షేత్రాలు  గల దేశం మనది. 

సుబ్రహ్మణ్యుడు అరుణగిరినాధుని అనుగ్రహించిన అద్భుత ఘట్టం  ఈ క్రింది వీడియో లో చూడగలరు.  ఈ సినిమా తమిళం లో ఉన్న కూడా భావం దాదాపుగా అర్ధం అవుతుంది.

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ

అరుణాచల క్షేత్రం, అరుణాచలం గిరి ప్రదక్షిణ, Arunachalam temple, Arunachalam temple history in telugu, arunachalam temple history, thiruvannamalai temple, arunachalam temple state, Arunachalam

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.