Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శ్రీకాళహస్తి ఆలయ సమయాలు మార్పు రాహుకేతు పూజలు ? | Sri Kalahasti Temple Updates

 SRI KALAHASTI TEMPLE UPDATES
శ్రీకాళహస్తి దేవస్థానం వారు ప్రెస్ నోట్ విడుదల చేసారు .. 


శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి  ఆలయ దర్శన వేళలను సోమవారం నుంచి అనగా మే 3 తేదీ నుంచి మార్పు  చేసారు . ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ఆలయం తెరిచి ఉంటుంది .  ఆ సమయం లో రాహు కేతు పూజలు తప్ప వేరే సేవలు ఉండవని తెలియచేసారు . 
కరోనా కారణంగా రాహు కేతు పూజ నిమిత్తం వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు తీస్కుని రావాలని పూజ కావాల్సిన సామాగ్రి దేవస్థానము వారు అందచేస్తారు కనుక బయట నుంచి ఏమి తీస్కుని రానవసరం లేదు . రాహుకేతు పూజలు అన్ని రోజులు చేస్తారు. 

దేవాలయం వారి ఫోన్ నెంబర్ తెలియచేస్తాను .. మీకు ఏదైనా అదనపు సమాచారం కావాలంటే వారికి ఫోన్  చేసి తెలుసుకోగలరు . 08578222240

అదే విధంగా తిరుపతి గోవిందా రాజుల స్వామి వారి ఆలయ సమయాలు కూడా మార్చారు .. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది . 

మీకు ఏదైనా దేవాలయ సమాచారం కావాలంటే క్రింద కామెంట్ చేయండి . 
Sri Kalahasti Temple Updates, Temple News, Sri Kalahasti Rahuketu Pooja Details. 

Comments

  1. I want to perform Rahu-Ketu puja in the name of my son who is in USA presently. Can I perform puja on behalf of my son. The puja can be performed in the absence of my son/ my self is possible? If possible what should I do? Please guide me.

    ReplyDelete

Post a Comment

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు