Drop Down Menus

ఈ దానాలు చేస్తే లక్ష్మీదేవిని బయటకు గెంటివేసినట్లేనట...ఈ దానాలు ఏమిటో తెలుసా ?? Dharma Sandehalu Telugu

ఈ దానాలు చేస్తే లక్ష్మీదేవిని గెంటివేసినట్లేనట...ఈ దానాలు ఏమిటో తెలుసా ??

> మానవ జన్మకు సార్థకత సాటి మానవుని మంచి కోరడమేనంటారు పెద్దలు. సాటి మానవుడు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలని, మనకు ఉన్నంతలో సాటివారి సంతోషం కోసం కొంత దానం చేయాలని..అప్పుడే ఇహపర లోకాల్లోనూ మనకు శాంతి సంతోషాలు లభిస్తాయని చిన్నతనం నుండి నూరిపోస్తుంటారు.

కంటిచూపు లేనివారికి నేత్రదానం, చదువు పట్ల జిజ్ఞాస ఉండేవారికి విద్యాదానం, ప్రమాదాల్లో గాయపడినవారికి రక్తదానం, భవిష్యత్తులో ఉపయోగపడేలా అవయవదానం అంటూ సంవత్సరాలు గడిచేకొద్దీ దానాలు సైతం కొత్తపుంతలు తొక్కుతున్నాయి. కానీ దానాల విషయంలో మాత్రం శ్రీశ్రీ చెప్పినట్లు "కాదేదీ దానానికి అనర్హం" అనరాదంటున్నారు పండితులు.

Also Readశ్రీలక్ష్మీపూజ ఇలా చేస్తే ధనమే ధనం 

> కొన్ని వస్తువులను దానరూపంలో కానీ, ఉచితంగా కానీ ఇస్తే సర్వనాశనం అయిపోతారంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఆ వస్తువులు ఏంటో చూడండి మరి...

> సూదులు, కత్తెరలు, కత్తులు - ఈ వస్తువులను దానం చేస్తే కోరి సంసారంలో నిప్పులు పోసుకున్నట్లేనట. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో పాటు, జీవితంలో ఏదీ కలిసిరాదని అంటున్నారు.

> పాడైన ఆహారం - తెలిసి కానీ, తెలియకకానీ చెడిపోయిన ఆహారాన్ని దానం చేయరాదు. ఇలా భుజించే యోగ్యం కాని ఆహారాన్ని దానం చేస్తే ఇక వారు కోర్టు మెట్లు ఎక్కవలసిందేనట. ఏదో ఒక సమస్యలో ఇరుక్కుని కోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేయవలసిందేనట. అలాగే ధనం సైతం వచ్చింది వచ్చినట్లు ఖర్చయిపోయి, దరిద్రులుగా మిగిలిపోతారట.

> విరిగిన/పగిలిన/చిరిగిన వస్తువులు - విరిగిన కంచాలు, పాత్రలు కానీ, పగిలిన కుర్చీలు, మరేదైనా ఫర్నిచర్ కానీ, చినిగిన దుస్తులు కానీ దానం చేయరాదు. అంటే ఆ వస్తువు దేని కొరకు ఉద్దేశించబడిందో ఆ పనికి అనర్హమైనప్పుడు ఖచ్చితంగా ఇతరులకు ఇవ్వరాదు. వాటిని దానం చేయడం అటుంచి, అసలు ఇంట్లో ఉంచుకోవడమే తప్పట, వాటి ద్వారా నెగటివ్ ఎనర్జీ బారిన పడతారట. వాటిని దానం చేస్తే అదృష్టం కలిసిరాకపోగా, తాడుని ముట్టుకున్నా పామై కరుస్తుందట. అంటే తలపెట్టిన అన్ని కార్యాల్లోనూ అపజయాలే ఎదురవుతాయట.

> చీపురుకట్టలు - చీపుర్లను కొన్ని ఊళ్లల్లో లక్ష్మీదేవి అని భావిస్తుంటారు. ఇక వాటిని దానం చేయడం అంటే చేజేతులా లక్ష్మీదేవిని గెంటేసినట్లే. చీపుర్లను దానం చేసినవారి ఇంట లక్ష్మీదేవి ఉండదట.

> ప్లాస్టిక్ వస్తువులు - ప్లాస్టిక్ వస్తువులనైతే దానం చేయడం అటుంచి, కాసేపు వాడుకుని తిరిగి ఇచ్చేందుకు అరువుగా కూడా ఇవ్వొద్దంటున్నారు. కెరీర్ నాశనమైపోతుందని, నిలకడలేమి వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు.

Famous Posts:

లేపాక్షి ఆలయ రహస్యం మీకు తెలుసా?

నిమ్మకాయల దీపం పెట్టటం వలన కలిగే ఫలితాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ

హనుమ నామస్మరణం సర్వపాప నివారణం

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము

లక్ష్మీదేవి,  దానాలు, ఆధ్యాత్మిక కథలు, Telugu Devotional Stories, devotional stories for kids, hindu devotional stories, devotional stories about faith, dharma sandehalu telugu, lakshmi devi, goddess laxmi devi, lakshmi devi storys

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.