Drop Down Menus

కుజదోషం ఉన్న వారికి వివాహం కాదా..? How does Manglik Dosha Effect on Marriage? Effects of Kuja Dosha & Remedies

కుజదోషం ఉన్న వారికి వివాహం కాదా..

"ఇంత వయసు వచ్చినా ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా" ? అనే ప్రశ్న వినిపించిన వెంటనే, "ఆ అమ్మాయికి కుజ దోషం ఉందట"! అనే సమాధానం వినిపిస్తూ వుంటుంది.

Also Readఇంటి ఇల్లాలు చేయకూడని కొన్ని పనులు

ఇక ఈ మాట విన్న వాళ్లంతా కుజదోషం అంత భయంకరమైనదా? అని అనుకోవడం సహజం.

అయితే కుజదోషం గురించి అంతగా భయపడవలసిన పనిలేదు. అది పరిహారం లేనంత పెద్ద సమస్యకూడా కాదు. జాతకాలు చూసే వాళ్లలో కొందరు ఈ విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ రావడంవల్ల, కుజుడు అంటేనే కంగారు పడిపోయేంత పరిస్థితికి చేరుకోవడం జరిగింది. కొన్ని గ్రహాలతో కలిసి వున్నప్పుడు కుజుడు కూడా మేలు చేస్తాడనే విషయం చాలా మందికి తెలియదు.

భరద్వాజ మహర్షి ఓ సౌందర్యవతిని చూడటం వలన ఆయన మనసు అదుపు తప్పి ‘రేతస్సు’ భూమిపై పడింది. ‘మంగళుడు’అనే పేరుతో ఆ శిశువు భూదేవి ఆలనా పాలనలో పెరిగాడు. అగ్నికి సమానమైన తేజస్సు కలిగినవాడు కాబట్టి అంగారకుడిగా ప్రసిద్ధి చెందాడు. విపరీతమైన కోపం … అనుకున్నది సాధించేంత వరకూ నిద్రపోని పట్టుదల కుజుడి లక్షణాలుగా చెప్పబడ్డాయి. ఈ కోపం వలన తాత్కాలికమైన నష్టం జరిగినా … పట్టుదల కారణంగా విజయాలు అందుకున్న వారి సంఖ్య ఎక్కువని చరిత్ర చెబుతోంది.

ఇక జాతకంలో కుజుడు శుభస్థానంలో వున్నాడా? లేక దోషస్థానంలో ఉన్నాడా ? అనేది ముందుగా చూసుకోవాలి. కుజదోషం వుంటే అది ఏ స్థాయిలో ఉందో … అది తన ప్రభావాన్ని ఎప్పుడు చూపిస్తుందనే విషయాన్ని కూడా అడిగితెలుసుకోవాలి. పంచాంగం పైపైన చూసి కుజదోషం వుందని చెప్పగానే ఆడపిల్ల జీవితంపై ఆ ముద్ర వేయకూడదు. శాస్త్రం బాగా తెలిసిన వారితోనే చూపించి జాతక ఫలాన్ని నిర్ణయించవలసి వుంటుంది.నక్షత్రాలు పొంతనే వివాహానికి ముఖ్యమని జ్యోతిష్య నిపుణులు కూడా అంటున్నారు.మరికొందరు జ్యోతిష్యులు నక్షత్ర పొంతన మాత్రమే వివాహ బంధాన్ని నిర్ణయించదంటున్నారు. కుజ దోష జాతకులను కుజదోష జాతకులకే వివాహం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి అని మరికొందరు జ్యోతిష్యులు అంటున్నారు. అందుకే స్త్రీ పురుష జాతకాలను వివాహ బంధంతో ఒక్కటి చేయడం ద్వారా కుజునికి ప్రాధాన్యత పెరుగుతుంది. వివాహ బంధంలో స్త్రీపురుషులు ఒక్కటవడం, వంశావృద్ధికి కుజుడే కారకుడు. అందుకే పెళ్లి బంధం కోసం కుజస్థానానికి జ్యోతిష్య నిపుణులు ప్రాధాన్యత ఇస్తారు.

కుజగ్రహ ప్రభావం ఇరు జాతకులకు ఉంటే.. ఆ వధూవరులు సుఖభోగాలు అనుభవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అదే దోషాలుంటే మాత్రం వివాహ అడ్డంకులు, వివాహ బంధంలో సమస్యలు వంటివి తప్పవని, వీటి నుంచి బయటపడాలంట, తప్పక దోష పరిహారం చేయాల్సిందేనని వారు చెబుతున్నారు.

Also Readభార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు

ఇక కుజ దోషం వుందని చెప్పినా విచారంలో మునిగిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దోషం ప్రభావం అందరికీ ఒకేలా వుండదు. అది వున్న స్థానాన్ని బట్టి తీవ్రత … ఫలితం మారుతూ వుంటుంది. ఇక మేషం – వృశ్చిక రాశులలో పుట్టినవారికి కుజదోషం వర్తించదని ‘జ్యోతిష్ గ్రంధ్’అనే ప్రాచీన కాలంనాటి గ్రంధం చెబుతోంది.

కుజ దోషం వున్నవారు భూమాతను … సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం వలన, అంగారకుడి అనుగ్రహం లభిస్తుందని తెలుస్తోంది. అలాగే మంగళ వారాల్లో దేవాలయాల్లో దీపారాధన చేయడం … పగడాన్ని ధరించడం పరిష్కార మార్గాలుగా చెప్పబడుతున్నాయి. ఇక దోషం ఎంత బలంగా ఉన్నా డీలాపడి పోవలసిన పనిలేదు. ఎందుకంటే అన్ని దోషాలకు విరుగుడు ఆ సర్వేశ్వరుడి అనుగ్రహమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Famous Posts:

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?


శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి


సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం 

కుజదోషం, కుజ దోష నివారణ మంత్రం, Kuja Dosha, kuja dosha effects in telugu, kuja dosha remedies after marriage, kuja dosha calculator, kuja dosha nakshatras, kuja dosha nivarana, 

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.