Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

కలియుగంలో ఒక్కసారి చూసినంత మాత్రాన తరించిపోయే సేవ..| Tirumala Lord venkateswara Nijapada darshanam

కలియుగంలో ఒక్కసారి చూసినంత మాత్రాన తరించిపోయే సేవ..

తిరుమల శ్రీవారి శుక్రవారాభిషేకం

శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టు కి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 5:00 గంటలకు జరిగే అభిషేకమే శుక్రవారాభిషేకం.

1. పునుగు

2. కస్తూరి 

3. జవ్వాది మున్నగు

సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆకాశగంగా తీర్థంతో సుమారు ఒక గంట పాటు అభిషేకం జరుగుతుంది.

తిరుమలలోని మూలవిరాట్టుకు నిత్యభిషేకం లేదు.

నిత్యాభిషేకం భోగశ్రీనివాసమూర్తికి కే . మూలవిరాట్టుకి  శుక్రవారం మాత్రం అభిషేకం.

ప్రాతఃకాల ఆరాధన పూర్తికాగానే అభిషేకం సంకల్పం జరుగుతుంది. అస్తోత్తర శతానామఅర్చన జరుగుతుంది. ఆఫై ఊర్ధ్వపుండ్రంలోని అరభాగం కుడా తగ్గించి సుక్ష్మంగా ఊర్ధ్వ పుండ్రాన్ని మాత్రం దర్సనియమాత్రంగా ఉంచుతారు.

వస్త్రాన్ని,ఉత్తరేయాన్ని తొలగించి స్నానకౌపీనం కడతారు. 

ఈ సమయంలో శ్రీవారి సన్నిధానంలో రెండు వెండి గంగాళలలో గోక్షిరాన్ని,రెండు వెండి గంగాళాలలో బంగారుబావి శుద్దోదకాన్ని సిద్దపరుస్తారు. 

ఆ తరువాత జియ్యంగార్ర్లు, అధికార్లు, ఏకాంగులు, పరిచారకులు, ఆచార్య పురుషులు , వైస్తవస్వాములు, పరిమళంఅరకు వెళ్ళతారు.జియ్యంగార్లు పచ్చ కర్పూరం,కస్తూరి ఉన్న రజతపాత్రను అధికారులు కుంకుమపువ్వుతో తయారు చేసిన నలుగు బిళ్ళలు,చందన బిళ్ళలు,పసుపు కలిపి ఉన్న రజత పాత్రలను, పరిచారకులు పరిమళం ఉన్న రజత పాత్రలను స్వీకరిస్తారు.

ఈ సేవకు డబ్బు కట్టినవారు,ఈ సేవకు అనుగుణంగా గంబురా(పచ్చకర్పూరం) పాత్రలను, జాఫ్ర(కుంకుమ) పాత్రలను,కొందరు పునుగు పాత్రలను , కొందరు కస్తూరి పాత్రలను తీసుకొని విమాన ప్రదక్షణం చేసి బంగారు వాకిలి చేరుకొంటారు. అభిషేక ద్రవ్యాలను శ్రీవారికి సమర్పిస్తారు. ఆఫై అభిషేకం మొదలవ్తుంది. 

అర్చకుడు అభిషేకానికి అనువుయిన పిఠo మీద నిలబడి జియ్యంగార్ అందించిన ఆకాశగంగా జలంతో నిండిన సువర్ణ శoఖo తీసుకోని పురుష సుక్తంతో అభిషేకం కొనసాగిస్తాడు. 

అభిషేకనంతరం వరకు పంచ సుక్తాల పంచోపనిషత్తుల పఠనం కొనసాగుతుంటుంది. సువర్ణ శoఖాభిషేకం పూర్తి అయ్యాక క్షీరాభిషేకం మొదలవ్తుంది.

శ్రీవారి వైకుంఠహస్త్తం నుండి జాలువారే క్షిరాన్ని సంగ్రహిస్తారు.

ఆఫై శుద్దోదకాభిషేకం సాగుతుంది. కేసరి బిళ్ళలు.చందన బిళ్ళలను శ్రీవారి శ్రీహస్తానికి సమర్పిస్తారు.

ఆ తరువాత కార్యక్రమం ఉద్వఅర్తనం పరిమళ పాత్రలలోని పరిమళాన్ని ఆపాద కిరీటం  పూసి నలగిడి శుద్దోదకాభిషేకం ప్రారంబిస్తారు. 

వైకుంఠహస్తం నుండి జాలువారే అభిషేకోదకాన్ని సంగ్రహించి భక్తులకు వినియోగిస్తారు. 

తదనంతరం శ్రీలక్ష్మిహరిద్రాభిషేకం శ్రీవారి వ్రక్షఃస్టలంలోని అమ్మవారికి ఈ అభిషేకం జరుగుతుంది.

తదనంతరం శుద్దోదకాభిషేకం.108 కలశాల జలంతో అభిషేకం పూర్తిచేస్తారు.అప్పుడు తెరలో మూల విరాట్టు శరీరంఫై తడి లేకుండా తుడిచి,శ్రీవారికిరీటానికి పొడి వస్త్రం చుట్టి 24 మూరల పొడవుగల సరిగ పట్టంచు దోవతిని,12 మూరల ఉత్తరియాన్ని అందంగా తొడగి ఆఫై ఉర్ద్వ పుండ్రాన్ని తీరుస్తారు. పచ్చకర్పూర హారతి జరుగుతుండగా తెరను తీస్తారు.

శుక్రవార అభిషేక అనంతరం మిల మిల మెరిసిపోతున్న శ్రీవారిని చూసి భక్తులు పరవశించి పునీతులవుతారు.

శ్రీవారి శుక్రవారాభిషేకం సేవలో పునుగుపిల్లి

అత్యంత అరుదుగా లభించే సుగంధ ద్రవ్యాలకు కారకుడు శుక్రగ్రహం.

1) పునుగు, 2) జవ్వాది, 3) కస్తూరి, 4) గోరోచనం

మొదలగు సుగంధద్రవ్యాలు శుక్రగ్రహ కారకత్వాన్ని తెలియజేస్తాయి.జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు పునుగుపిల్లితైలం తో అభిషేకం చేస్తే శుక్రగ్రహ దోష నివారణ జరుగుతుంది.

శ్రీవారిసేవలో:- తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ప్రతి శుక్రవారం అభిషేకం తరువాత కాస్తంత పునుగు తైలాన్ని విగ్రహానికి పులుముతారు.

" అత్తారు పన్నీరు పునుగు జవాదీ తోడ ముడుపు తెస్తున్నారు మేలుకో " అంటాడు శ్రీఅన్నమాచార్య.

పదకవితా పితామహుడు

1) తాళ్ళపాకశ్రీఅన్నమాచార్యులు

2) తరిగొండ శ్రీవెంగమాంబ

కలియుగప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి పై వేలు, వందలు సంకీర్తనలు రచించి " శ్రీవారి " అనుగ్రహం పొందగలిగారు.

అయితే ఏ కళలూ తెలియని నోరులేని మూగజీవి " పునుగుపిల్లి " ఏ అదృష్టం చేసుకుందో.......

ఎన్ని జన్మల పూజా ఫలమో తెలియదు కాని ఈ అరుదైన జీవికి మరొకరికి సాధ్యం కాని అరుదైన సేవాభావం కలిగింది.

శ్రీ ఏడుకొండలస్వామివారి మూలవిగ్రహానికి ఈ " పునుగుపిల్లి " శరీరం నుంచి స్రవించే ద్రవాన్ని పూస్తేనే శుక్రవారపు అభిషేకం పూర్తవుతుంది.

శ్రీస్వామివారి విగ్రహం శతాబ్దాలుగా నల్లగా నిగనిగలాడుతుండడానికి, ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉండడానికి ఈ పునుగుతైలమే ప్రధాన కారణమని అర్చకుల నమ్మకం.

ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ పునుగుపిల్లి అత్యంత అరుదైనది.

పునుగుపిల్లితైలం తీసే విధానంలో ప్రత్యేకత ఉంది.

ఇనుప జల్లెడలోని గదిలో పిల్లిని ఉంచుతారు. ఇనుపజల్లెడ గది పై భాగంలో రంథ్రం ఏర్పాటు చేస్తారు. రంథ్రం ద్వారా చందనపుకర్రను గదిలోకి నిలబెడతారు. 2సంవత్సరాల వయస్సు అనంతరం ప్రతి 10రోజులకు ఒకసారి హావభావాలను ప్రదర్శిస్తూ చందనపుకర్రకు చర్మాన్ని పిల్లి రుద్దుతుంది.

ఆ సమయంలో చర్మం ద్వారా వెలువడే పదార్థమే పునుగుతైలం.

తైలాన్ని సుగంధ పరిమళాలతో చూర్ణం చేసి మూలవర్లుకు అభిషేకం చేస్తారు.

ఇలా చేయడం ద్వారా " శ్రీవారు " శాంతపడుతారని అర్చకులు చెబుతున్నారు.

నిదర్శనం:- పునుగుపిల్లి అంతరించి పోయింది అని అర్చకులు బాధపడుతున్న సమయంలో ఎక్కడ నుండో శ్రీగరడురాజు తన కాళ్ళతో తీసుకుని వచ్చి వేంకటాద్రికొండ పై వదిలాడు. అది చూసిన అర్చకులు ఆ దేవదేవుడు నిత్యం తిరుమలగిరిపై కొలువై ఉన్నారని నమ్మి, దేవదేవుని సహస్రనామాలతో అర్చిస్తున్నారు.

శుక్రవారఅభిషేక ప్రియ.. గోవిందా 

మార్జాల కిశోర న్యాయ సంవిధాత.. గోవిందా

  ఓం నమో వేంకటేశాయ..

Famous Posts:

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?


మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి


సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం

 

మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.


భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?


మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.


భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు

Tirumala, Lord venkateswara, Nijapada darshanam, ttd nijapada darshanam video, nijaroopa darshanam tirumala which day, nijapada darshanam experience, nijapada darshanam on which day, nijaroopa darshanam tirumala, tirupati, venkateswara swamy

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు